- Telugu News Photo Gallery Business photos Best Recharge Plans: Bsnl, Airtel, Jio, Vodafone idea Recharge Plans
Best Recharge Plans: కేవలం రూ.1999కే ఏడాది పాటు వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాలింగ్.. 600 జీబీ డేటా..!
Best Recharge Plans: ఇతర టెలికం సంస్థల లాగే భారతీయ ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL)తన వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్లాన్లను ..
Updated on: Aug 10, 2021 | 3:04 PM

Best Recharge Plans: ఇతర టెలికం సంస్థల లాగే భారతీయ ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL)తన వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్లాన్లను అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలను అందించి వినియోగదారులను తమ నెట్‌వర్క్ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఇవే కాకుండా ఇతర నెట్ వర్క్‌లు అందిస్తున్న ప్లాన్స్ ఇవే.

బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 1999 ప్లాన్: తాజాగా రూ.1999 ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో డేటా అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్ తో 600 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటాను ఏడాది పాటు వాడుకోవచ్చు. ఇంకా అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా అందిస్తోంది. ఇంకా నిత్యం 100 ఎస్ఎంఎస్ లు కూడా పంపుకొనేందుకు అవకాశం ఉంటుంది.

బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 2,399ప్లాన్: రూ.2399 ప్లాన్ ను సైతం బీఎస్ఎన్ఎల్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్ తో 455 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజు 3జీబీ డేటా లభిస్తుంది.

జియో రూ. 2,121 ప్లాన్: జియో రూ.2,121 ప్లాన్ ను అందిస్తోంది. ఈ ప్లాన్ తో 336 రోజుల పాట్ నిత్యం 1.5 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.

జియో రూ. 3,499 ప్లాన్: జియో నుంచి రూ.3499 ప్లాన్ కూడా మరొకటి అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా ప్రతి రోజు 3 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 365 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ. 2,698 ప్లాన్: ఎయిర్‌టెల్ రూ. 2,698 ప్లాన్‌తో ప్రతి రోజు 2 జీబీ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. అన్ లిమిటెడ్ కాలింగ్, నిత్యం 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

వోడాఫోన్ ఐడియా రూ.2595 ప్లాన్: వోడాఫోన్ ఐడియా రూ.2595తో 365 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్ లు, 1.5 జీబీ డేటా అందిస్తోంది.




