Fixed Deposit: ఈ బ్యాంకులలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తే అధిక వడ్డీ వస్తుందా..? పూర్తి వివరాలు

Fixed Deposits: ఎలాంటి రిస్క్‌ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్‌ సిటిజన్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకునేందుకు మొగ్గు చూపుతారు. అయితే ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ..

Fixed Deposit: ఈ బ్యాంకులలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తే అధిక వడ్డీ వస్తుందా..? పూర్తి వివరాలు
Fixed deposit
Follow us
Subhash Goud

|

Updated on: Aug 10, 2021 | 8:35 PM

Fixed Deposits: ఎలాంటి రిస్క్‌ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్‌ సిటిజన్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకునేందుకు మొగ్గు చూపుతారు. అయితే ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంక్‌ను బట్టి ఒక్కోలా ఉంటాయి. పెద్ద పెద్ద బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ కొన్ని బ్యాంక్‌ లు మాత్రం మూడు సంవత్సరాల ఎఫ్‌డీలపై 7.25 శాతం ఇంట్రస్ట్‌ను చెల్లిస్తున్నట్లు ‘బ్యాంక్‌ బజార్‌’ తన డేటాలో వెల్లడించింది.. ఎఫ్‌డీపై అత్యుత్తమ వడ్డీ రేట్లను అందించే బ్యాంకులు ఏవంటే..

డీసీబీ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌:

సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీని చెల్లిస్తుంది. రూ .1 లక్ష డిపాజిట్‌ చేస్తే మూడేళ్లలో రూ .1.23 లక్షలకు పెరుగుతుంది. ప్రారంభ డిపాజిట్‌ రూ. 10 వేలు.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

సీనియర్ సిటిజన్స్ కోసం మూడేళ్ల ఎఫ్‌డీలపై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయల మొత్తం మూడేళ్లలో రూ.1.24 లక్షలకు పెరుగుతుంది. ప్రారంభ డిపాజిట్‌ రూ.1,000.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల కాలానికి ఎఫ్‌డీలపై 6.85 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే మూడు సంవత్సరాలలో రూ .1.22 లక్షలకు పెరుగుతుంది.

ఆర్‌బీఎల్ బ్యాంక్ :

సీనియర్ సిటిజన్లకు కోసం మూడు సంవత్సరాల ఎఫ్‌డిలపై 6.80 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష పెట్టుబడి మూడు సంవత్సరాలలో రూ .1.22 లక్షలకు పెరుగుతుంది.

ఇవీ కూడా చదవండి:

RBI: మహిళా సంఘాలకు రిజర్వ్ బ్యాంక్‌ గుడ్‌న్యూస్‌.. ఎలాంటి తనఖా లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..!

Vivad Se Vishwas Scheme: వివాద్ సే విశ్వాస్ పథకం అంటే ఏమిటి.. ప్రభుత్వానికి రూ .53,684 కోట్ల ఆదాయం..!

Reuben Singh: తలపాగా మ్యాచింగ్ కోసం 15కుపైగా రోల్స్ రోయిస్ కార్ల కొనుగోలు.. ఎవరు ఇతను?.. ఆయన ఛాలెంజ్ ఏంటి?