Urban Gardening: సోషల్ మీడియా ద్వారా నేర్చుకున్న గార్డెనింగ్.. డాబాపై 200 రకాల మొక్కలను పెంచుతున్న వైనం
Urban Gardening: లోకో భిన్నరుచి అన్నారు పెద్దలు. ఒకొక్కరికి ఒకొక్క అభిరుచి ఉంటుంది. అది ఆహారం తినడం విషయంలోనే కాదు.. జీవించే విధానం ఇష్టాలు ఇలా అన్నిటిలోనూ డిఫరెంట్ ఆలోచనలుంటాయి. అదే విధంగా సోషల్ మీడియాను కూడా..
Urban Gardening: లోకో భిన్నరుచి అన్నారు పెద్దలు. ఒకొక్కరికి ఒకొక్క అభిరుచి ఉంటుంది. అది ఆహారం తినడం విషయంలోనే కాదు.. జీవించే విధానం ఇష్టాలు ఇలా అన్నిటిలోనూ డిఫరెంట్ ఆలోచనలుంటాయి. అదే విధంగా సోషల్ మీడియాను కూడా కొంతమంది టైం పాస్ చేయడానికి ఉపయోగిస్తే.. మరికొందరు తాము జీవితంలో ఎదగడానికి ఉపయోగించుకుంటున్నారు. అలా ఓ వ్యక్తి తన అభిరుచికి అవసరమైన సమాచారం ఫేస్ బుక్ నుంచి తెలుసుకున్నాడు.. ఇప్పుడు స్తానికంగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ కు చెందిన గణేష్ కులకర్ణి స్తానికంగా లైబ్రేరియన్ గా పనిచేసేవాడు. అయితే గణేష్ కు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం.. దీంతో ఎప్పుడూ మొక్కలను ఎలా పెంచాలి.. ఏ విధంగా వాటిని సంరక్షించాలి అనే ఆలోచిస్తుండేవాడు.. కొన్ని మొక్కలను తెచ్చి.. ఇంట్లో నాటేవాడు..సరైన పోషకాలు అందక గులాబీ వంటి మొక్కలు చనిపోయేవి.. దీంతో అసలు తక్కువ ప్లేస్ లో ఆరోగ్యంగా మొక్కలను ఎలా పెంచాలి.. అనే విషయం పై ఆసక్తి పెరిగింది. దీంతో ఇంటర్నెట్ లో గార్డెనింగ్ ఎలా చేయాలి? మొక్కలను ఎలా పెంచాలి? అనే విషయంపై ఇంటర్నెట్ లో శోధించాడు. ఫేస్ బుక్ లో గార్డెనింగ్ కు సంబంధించిన మెళకువలను నేర్చుకున్నాడు. వెంటనే తన ఇంటి మీద గార్డెనింగ్ చేయడం ప్రారంభించాడు.
మరోవైపు అర్బన్ గార్డెనింగ్ కు సంబంధించి వివరాలను ఫేస్ బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే .. తన ఇంటిపై ఉన్న డాబా గార్డెన్ పై పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు, పువ్వుల మొక్కలను పెంచడం ప్రారంభించాడు. సరదాగా ప్రారంభించిన గార్డెనింగ్ ఇప్పుడు ఓ వ్యాపకంగా మారింది. రోజూ మొక్కలను చూడక పొతే తనకు నిద్రపట్టదు అంటున్నాడు గణేష్. అంతేకాదు తన మొక్కల కోసం కంపోస్ట్ ఎరువు తయారు చేయడం.. మొక్కలకు ప్రూనింగ్, నీళ్లు పోయడం వంటివి అన్నీ తానే స్వయంగా చేస్తానని చెబుతున్నాడు గణేష్.
ఇక కరోనా సమయంలో గణేశ్ కొత్త ఇంట్లోకి షిప్ట్ అయ్యాడు.. అక్కడ కూడా తన ఇంటి మీద మొక్కలు పెంచడం ప్రారంభించాడు. అలా.. ప్రస్తుతం తన ఇంటి మీద 200 రకాల కూరగాయలు, పండ్లు, పువ్వుల చెట్లను పెంచుతున్నాడు. ఇప్పుడు గణేష్ గార్డెనింగ్ లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్థానికులు గణేష్ డాబా పై ఉన్న మొక్కలను చూసి ముచ్చటపడుతున్నారు. తక్కువ ఖర్చుతో తనకు కావాల్సిన పండ్లు, కూరగాయలు తానే పండించుకుంటున్నాడు. మరోవైపు మార్కెట్ లో వాటిని అమ్మి డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. తాను సోషల్ మీడియా ద్వారా నేర్చుకున్న గార్డెనింగ్ లోని మెలకులను ఇపుడు పది మందికి నేర్పుతున్నాడు. వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి.. పది మందికి అర్బన్ గార్డెనింగ్ గురించి అవగాహన కల్పిస్తున్నాడు గణేష్. తమకు గణేష్ ఆదర్శం అంటూ స్తానికులు చెబుతున్నారు.
Also Read: Mango Leaves Online: ఆన్‌లైన్‌లో అమ్మకానికి మామిడాకులు..నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్.. కలికాలం అంటున్న పెద్దలు (photo gallery)