PM Modi Photo: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫోటో.. వివరణ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
టీకా సర్టిఫికెట్‌లో ప్రధాని ఫోటోలను ముద్రించడంపై పార్లమెంటులో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కుమార్ కేత్కర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానం ఇచ్చారు.
PM Modi’s Photo on Covid-19 Vaccination Certificates: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఫోటో ప్రచరణపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణకు టీకాలు వేసిన తర్వాత కోవిడ్- యాప్ ద్వారా సర్టిఫికేట్ పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ ధ్రువపత్రంపై ప్రధాని మోడీ ఫోటో ముద్రణ ఉంటుంది. అయితే, దీనిపై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. టీకా సర్టిఫికెట్‌లో ప్రధాని ఫోటోలను ముద్రించడం అవసరమా, తప్పనిసరి కాదా అని, పార్లమెంటులో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు, మాజీ జర్నలిస్ట్ కుమార్ కేత్కర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానం ఇచ్చారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న స్వభావం కారణంగా, కోవిడ్‌కు తగిన యాప్‌ను అనుసరించడం వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అత్యంత కీలకమైన చర్యలలో ఒకటిగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానమిచ్చారు. కోవిన్ యాప్ ద్వారా జారీ చేయబడుతున్న కోవిడ్ -19 టీకా సర్టిఫికెట్‌ల ఫార్మాట్‌లు ప్రామాణీకరించబడ్డాయన్నారు. ధృవీకరించదగిన టీకాల సర్టిఫికెట్‌లపై డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయని మంత్రి పవార్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అత్యంత కీలకమైన చర్యలలో ఒకటిగా కేంద్రం వినియోగిస్తోంది. కరోనాపై పోరాటంలో తమ అనుభవాలు, వనరులు వంటి వాటిని ఈ యాప్ ద్వారా ప్రజలకు అందించేందుకు సులువుగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఇదే క్రమంలో జూన్ 21, 2021 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త వ్యాక్సినేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రజలకు అందిస్తున్న వ్యాక్సీన్ల వివరాలను ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతోంది.
ఇదే క్రమంలో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో ప్రధానమంత్రి సందేశంతో పాటు ఫోటోగ్రాఫ్, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, టీకా తర్వాత కూడా కోవిడ్ -19 యాప్ ద్వారా దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి సందేశాన్ని బలపరుస్తుందని మంత్రి పవార్ చెప్పారు. అటువంటి క్లిష్టమైన సందేశాలు అత్యంత ప్రభావవంతమైన రీతిలో ప్రజలకు చేరవేసేలా చూడడం ప్రభుత్వ నైతిక బాధ్యత అని ఆమె అన్నారు. “అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ -19 టీకా కోసం కోవిన్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నాయి. టీకా సర్టిఫికేట్‌లు ప్రామాణిక ఆకృతిలో కోవిన్ ద్వారా తీసుకోవచ్చని” అని మంత్రి చెప్పారు.