పార్లమెంట్ లో అదే రభస..రాజ్యసభలో చైర్మన్ సీటుపైకి ఫైల్స్ విసిరేసిన కాంగ్రెస్ ఎంపీ
పార్లమెంటులో విపక్షాల రభస కొనసాగుతూనే ఉంది. మరో రెండు రోజుల్లో వర్షాకాల సమావేశాలు ముగియనుండగా ప్రతిపక్షాల కారణంగా ఒక్క రోజు కూడా సభా కార్యకలాపాలు సవ్యంగా జరగలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆరోపించారు.
పార్లమెంటులో విపక్షాల రభస కొనసాగుతూనే ఉంది. మరో రెండు రోజుల్లో వర్షాకాల సమావేశాలు ముగియనుండగా ప్రతిపక్షాల కారణంగా ఒక్క రోజు కూడా సభా కార్యకలాపాలు సవ్యంగా జరగలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆరోపించారు. వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలంటూ విపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని, బిల్లులు సభ ఆమోదం పొందకుండా చూస్తున్నారని ఆయన అన్నారు. వ్యవసాయంపై ఈ పార్టీలు ఇచ్చిన నోటీసుపై చర్చకు ప్రభుత్వం ఆంగీకరించి చర్చ చేపట్టేలోగా కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు నిన్న రాజ్యసభలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బాజ్వా ఉన్నట్టుండి ఫైళ్లను చైర్మన్ సీటుపైకి విసిరేశారు. ఆప్, తృణమూల్ సభ్యులు కూడా ఆయనతో జత కలుస్తూ.. జైజవాన్, జై కిసాన్ అని నినాదాలు చేశారు. సభ వెల్ లోకి దూసుకుపోయారు.మూడు రైతు చట్టాలను రద్దు చేసేంతవరకు రైతులు ఆందోళన విరమించబోరని, ప్రభుత్వం వీటిని రద్దు చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఇవి రద్దయ్యేంతవరకు సభా కార్యకలాపాలను సాగనివ్వబోమన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంటులో తమ ఎంపీలు విపక్షాలను ఎదుర్కోలేకపోతున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ఈ నెల 9 న ఎవరెవరు బీజేపీ సభ్యులు గైర్ హాజరయ్యారో ఆయన తెలుసుకోగోరారు. ఈ వర్షాకాల సమావేశాల్లో ఏ రోజూ పార్లమెంట్ ప్రజల అభిమతానికి అద్దం పట్టేలా జరగలేదన్నారు. ఇలా ఉండగా బుధవారం కూడా పార్లమెంటును స్తంభింపజేయాలని విపక్షాలు నిర్ణయించాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : ప్రాణాలకు తెగించి బావిలో పడ్డ పిల్లిని రక్షించిన యువతి..మహిళా సాహసంకు నెటిజన్లు ఫిదా..!:Woman Savs Cat Video.
నోరుజారిన లాస్య.. రవి ఆ హౌజ్‌లోకి అంటూ.. సైలెంట్ సెటైర్..(వీడియో): Anchor Ravi In BiggBoss5.