Google WFH Employees: వర్క్ ఫ్రమ్ హోం చేసేవారికి గూగుల్ షాకింగ్ న్యూస్.. ఇకపై..

వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు గూగుల్ సంస్థ షాకింగ్ న్యూస్ ఇవ్వనుందా.? అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. శాశ్వతంగా ఇంటి నుంచి..

Google WFH Employees: వర్క్ ఫ్రమ్ హోం చేసేవారికి గూగుల్ షాకింగ్ న్యూస్.. ఇకపై..
Google
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 11, 2021 | 9:36 AM

వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు గూగుల్ సంస్థ షాకింగ్ న్యూస్ ఇవ్వనుందా.? అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడానికి గూగుల్ ఉద్యోగులు మారితే.. వారి వేతనంలో 25 శాతం కోత విధించాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పుడు ఈ విషయంపై సిలికాన్ వ్యాలీలో విపరీతంగా చర్చ జరుగుతోంది.

శాలరీ కాలిక్యులేటర్ ఆధారంగా ఉద్యోగుల పే కట్ నిర్ణయించబడుతుందని గూగుల్ పేర్కొంది. కంపెనీ ఉన్న నగరంలోనే పని చేస్తోన్న ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం ఎంచుకుంటే వేతనాల్లో ఎలాంటి కోత ఉండదని గూగుల్ తెలిపింది. వేతనం అనేది నగరం నుంచి నగరానికి.. అలాగే రాష్ట్రానికి భిన్నంగా ఉంటుంది. అందుకే పట్టణాలు, ప్రాంతాలు ఆధారంగా ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడానికి మారితే గూగుల్ సంస్థ వేతనాల్లో 25 శాతం వరకు కోత విధించనున్నట్లు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగుల లొకేషన్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే అవకాశం ఉంది.

కాగా, గూగుల్ కంపెనీ వర్క్ లొకేషన్ టూల్ జూన్ నెలలో ప్రారంభమైంది. అటు ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థలు కూడా తక్కువ ఖరీదైన ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి.

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!

ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

8 పరుగులకే నాలుగు వికెట్లు.. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు ఖాతానే తెరవలేదు.. టీమిండియా వరస్ట్ రికార్డు