E-Vehicles: హైదరాబాద్‌లో కరెంట్​కార్లకు మస్తు క్రేజ్.. పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు… కారణం ఏంటంటే…?

హైదరాబాద్ మహానగరంలో ఏ రోడ్డు మీద చూసినా గ్రీన్ నెంబర్ ప్లేటే కనిపిస్తున్నాయి.. సడన్‌గా భాగ్యనగర రహదారులపై ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగిపోయాయి.

E-Vehicles: హైదరాబాద్‌లో కరెంట్​కార్లకు మస్తు క్రేజ్.. పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు... కారణం ఏంటంటే...?
Electric Vehicles On Hyderabad Roads
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 11, 2021 | 7:10 AM

Electric Vehicles in Hyderabad: పర్యావరణం పట్ల జనంలో అవగాహన పెరుగుతోంది.. మెల్ల మెల్లగా పొల్యూషన్ రహిత వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. ఈ ప్రభావంతో హైదరాబాద్ మహానగరంలో ఏ రోడ్డు మీద చూసినా గ్రీన్ నెంబర్ ప్లేటే కనిపిస్తున్నాయి.. సడన్‌గా భాగ్యనగర రహదారులపై ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగిపోయాయి. ఒకప్పుడు ప్రజలు ఆసక్తి చూపని ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుదలకి కారణం పెరిగిన ఇంధనం ధరలా? ఏదో సగం రేటుకే ఇస్తున్నట్టు జనాలు పిచ్చగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటున్నారు. ఇప్పుడు ప్రతి గల్లీలో కనీసం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కనిపిస్తోంది.

గత ఏడాది నుంచి హైదరాబాదు లో జనాలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ఇష్టపడుతున్నారు. ఎలాంటి గాలి కాలుష్యం, ధ్వని కాలుష్యం లేకుండా సిటీలో తిరుగుతున్న ఈ గ్రీన్ నెంబర్ ప్లేట్స్ వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి. టూ వీలర్ ఏ కాకుండా సిటీలో ఫోర్ వీలర్, త్రీ వీలర్‌తో పాటు గూడ్స్ కేరింగ్ వెహికల్స్ కూడా పెరిగిపోయాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుదలకు వాతావరణ కాలుష్యం ఒక కారణమైతే, అందనంత ఎత్తుకి వెళ్తున్న పెట్రోల్ & డీజిల్ ధరలు ముఖ్య కారణం అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఒక లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది. అదే రూ.100 ఎలక్ట్రిక్ కాస్ట్ తో రెండు రెట్లు తిరగచ్చు అని ఎలక్ట్రిక్ వెహికల్ వాహనదారులు చెప్తున్నారు. ఒక పెట్రోల్ వెహికల్ ఖరీదుతో పాటు దాని మెయింటనెన్స్ ఎలక్ట్రిక్ బండి తో పోలిస్తే చాలా చవకగా ఉంటుందంటున్నారు.

అది మాత్రమే కాకుండా ప్రభుత్వం మొదటి రెండు లక్షలు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ఒక పాలసీ ని కూడా ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు రోడ్ టాక్స్ తోపాటు రిజిస్ట్రేషన్ ఫీజును తీసివేసింది. ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉండడంతో ఈ గ్రీన్ నెంబర్ ప్లేట్స్ వాహనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ఆరు నెలల్లో మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా 929 ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అయ్యాయి. అందులో కేవలం టూ వీలర్ వెహికల్స్-632, ఫోర్ వీలర్ వెహికల్స్-129. ఇవి మాత్రమే కాకుండా గూడ్స్ వెహికల్స్ కూడా ఈ మధ్యన ఎలక్ట్రిక్ వెహికల్స్‌నే వాడుతున్నారు. గూడ్స్ క్యారేజ్ సంఖ్య 168 కాగా, రోడ్డుమీద ఎలక్ట్రిక్ వెహికల్ నడపాలంటే కచ్చితంగా లైసెన్స్‌తో పాటు గ్రీన్ కార్డు కూడా ఉండాలి అని అధికారులు చెప్తున్నారు.

ప్రభుత్వం కూడా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ని చూసి భవిష్యత్తులో ఎక్కువ చార్జింగ్ స్టేషన్స్ సంఖ్యను పెంచేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అలాగే, మెట్రో ఇంకా జీహెచ్ఎంసీ కూడా ఎలక్ట్రిక్ స్టేషన్స్‌లో ఏర్పాటు చేయాలనే ప్లాన్ చేస్తున్నాయి. బహుశా ఇదే కారణం ఏమో ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య రోడ్డు మీద ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read Also…  Viral Video: ఇలాంటి విన్యాసాలు ఎప్పుడైనా చూశారా.. ఇది చూస్తే షాకవ్వాల్సిందే! వైరలవుతోన్న నీరజ్ చోప్రా వీడియో