TVS Ntorq 125: ఆ టీవీఎస్ స్కూటర్‌కు నయా లుక్.. సూపర్ కలర్స్‌తో మతిపోతుందిగా..!

మార్కెట్‌లో పెరుగుతున్న పోటీను తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఆయా స్కూటర్స్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ఆకర్షణీయమైన రంగుల్లో లాంచ్ చేస్తున్నారు. తాజాగా టీవీఎస్ కంపెనీ తన ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను మరో రెండు ఆకర్షణీయ రంగుల్లో లాంచ్ చేసింది ఎన్‌టార్క్ 125 స్కూటర్ స్టాండర్డ్, రేస్ ఎక్స్‌పీ మోడళ్లకు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఎన్‌టార్క్ 125 స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

TVS Ntorq 125: ఆ టీవీఎస్ స్కూటర్‌కు నయా లుక్.. సూపర్ కలర్స్‌తో మతిపోతుందిగా..!
Tvs Ntorq 125
Follow us
Srinu

|

Updated on: Aug 14, 2024 | 3:45 PM

భారతదేశంలో గత పదేళ్ల నుంచి స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా మన అవసరాలకు స్కూటర్ కొనుగోలు చేస్తే ఇంట్లో ఆడవాళ్లు కూడా డ్రైవ్ చేయవచ్చు కదా? అనే ఉద్దేశంతో చాలా మంది స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ వల్ల ప్రతిసారి గేర్‌లు వేసే బాధ లేకుండా స్కూటర్ అయితే సౌకర్యంగా ఉంటుదనే ఉద్దేశంతో కొనుగోలు చేసే వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలన్నీ స్కూటర్లను లాంచ్ చేశాయి. అయితే మార్కెట్‌లో పెరుగుతున్న పోటీను తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఆయా స్కూటర్స్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ఆకర్షణీయమైన రంగుల్లో లాంచ్ చేస్తున్నారు. తాజాగా టీవీఎస్ కంపెనీ తన ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను మరో రెండు ఆకర్షణీయ రంగుల్లో లాంచ్ చేసింది ఎన్‌టార్క్ 125 స్కూటర్ స్టాండర్డ్, రేస్ ఎక్స్‌పీ మోడళ్లకు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఎన్‌టార్క్ 125 స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

టీవీఎస్ స్టాండర్డ్  ఎన్‌టార్క్ 125 ఇప్పుడు టర్కోయిస్, హారెక్విన్ బ్లూ, నార్డో గ్రేకు సంబంధించిన కొత్త షేడ్‌తో లాంచ్ చేవారు. అయితే ఎన్‌టార్క్ 125 రేస్ ఎక్స్‌పీ వేరియంట్‌ను సొగసైన మాట్ బ్లాక్ ఫినిషింగ్‌తో అందుబాటులో తీసుకువచ్చారు. ఈ స్కూటర్ బేస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 86,871గా ఉంటే రేస్ ఎక్స్‌పీ వేరియంట్ ధర రూ. ఢిల్లీలో రూ.97,501గా ఉంది. బేస్ ఎన్‌టార్క్ 125లో ఫ్రంట్ ఆప్రాన్, అండర్-సీట్ ప్యానెల్ పైరంగులను అప్‌డేట్ చేశారు. కొత్త రేస్ ఎక్స్‌పీ మోడల్‌పై పియానో బ్లాక్ బాడీవర్క్, ఆప్రాన్ పై చెకర్డ్ గ్రాఫిక్స్, రెడ్ అల్లాయ్ వీల్స్ కలయికతో స్టైలిష్ లుక్‌తో లాంచ్ చేశారు. 

ఇక ఈ రెండు స్కూటర్ల ఫీచర్ల విషయానికి వస్తే రేస్ ఎక్స్‌పీకు సంబంధించి 124.8 సీసీ ఇంజిన్ ద్వారా ప్రామాణిక వేరియంట్ కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది. బేస్ మోడల్ 9.25 బీహెచ్‌పీ శక్తిని, 10.05 టార్క్‌ను విడుదల చేస్తుంది. రేస్ ఎక్స్‌పీ మోడల్ 10.6 బీహెచ్‌పీ శక్తిని, 10.8 ఎన్ఎం ఉత్పత్తి చేస్తుంది. అదనంగా రేస్ ఎక్స్‌పీ మోడల్‌లో రెండు రైడింగ్ మోడ్లు, వాయిస్ అసిస్టెంట్ ఫంక్షన్లు అందుబాటులో ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డేటా-రిచ్ ఎల్‌సీడీ కన్సోల్ రెండు వేరియంట్స్ ఉంటాయి. అలాగే ఈ రెండు మోడల్స్‌లో టెలిస్కోపిక్ ఫోర్కులు, మోనోషాక్ అబ్జార్బర్‌లు మంచి సస్పెన్షన్‌ను అందిస్తాయి. ఈ రెండు వేరియంట్లు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్లతో ముందు వైపు ఒక డిస్క్ బ్రేక్‌తో వస్తాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

PSLకి భారీ దెబ్బ: స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లేకుండానే లీగ్..
PSLకి భారీ దెబ్బ: స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లేకుండానే లీగ్..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు