Independence Day Sale: అతి తక్కువ ధరకే బిజినెస్ క్లాస్ ప్రయాణం.. అదిరే ఆఫర్ ప్రకటించిన స్టార్ ఎయిర్..
ఈ ఆఫర్‌ను పొందేందుకు, ప్రయాణికులు 5 ఆగస్టు 15వ తేదీ లోపు వెబ్ సైట్ ని సందర్శించి, ప్రమోషనల్ రేటుతో తమ టికెట్‌లను బుక్ చేసుకోవచ్చు. సీట్లు పరిమితంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇష్టపడే ప్రయాణ తేదీలను సురక్షితంగా ఉంచుకోవడానికి ముందస్తు బుకింగ్ చేయడం మంచిది.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు యావత్ భారతావని సంసిద్ధంగా ఉంది. అన్ని చోట్ల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక కంపెనీలు కూడా పలు ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇప్పటికే ఆన్ లైన్ ప్లాట్ ఫారంలలో ఆఫర్ల జోరు కొనసాగుతోంది. కేవలం వస్తువులు, గృహోపకరణాలు, టెక్ గ్యాడ్జెట్లపైనే కాకుండా ట్రావెలర్స్ కోసం కొన్ని ఎయిర్ లైన్ సంస్థలు ఆఫర్లను అందిస్తున్నాయి. అలాంటి వాటిల్లో స్టార్ ఎయిర్ ఒకటి. ఇది ఫ్రీడమ్ సేల్ ప్రారంభించింది. ఈ ప్రత్యేక సేల్ ఆగస్ట్ 5 నుంచే ప్రారంభమైంది. రేపటితో అంటే ఆగస్ట్ 15తో ముగియనుంది. ఈ ఫ్రీడమ్ సేల్లో భాగంగా ఎకానమీ, బిజినెస్ క్లాస్ చార్జీలలో ప్రయాణికులకు అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది.
స్టార్ ఎయిర్ సేవలు ఇలా..
ప్రయాణికులు స్టార్ ఎయిర్ లో విలాసవంతమైన బిజినెస్ క్లాస్ అనుభవాన్ని పొందగలగుతారు. విశాలమైన సీటింగ్, గౌర్మెట్ భోజనం, వ్యక్తిగతీకరించిన సేవలను కలిగి ఉంటాయి. కాగా ఈ ఫ్రీడమ్ సేల్లో కస్టమర్‌లు స్టార్ ఎయిర్ అధికారిక వెబ్‌సైట్లో తమ విమానాలను బుక్ చేసుకోవచ్చు. ఎకానమీ చార్జీలు కేవలం రూ.1999 నుంచి.. బిజినెస్ క్లాస్ చార్జీలు రూ.5555 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ అసాధారణమైన ఆఫర్ ఆగస్టు 6 నుంచి అక్టోబరు 30 వరకు ప్రయాణానికి చెల్లుబాటు అవుతుంది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి, స్టార్ ఎయిర్ అందించే సౌలభ్యం, సౌకర్యాన్ని అనుభవించడానికి అవకాశం కల్పిస్తున్నారు.
చాలా సంతోషిస్తున్నాం..
ఈ సందర్భంగా ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ సేల్లో భాగంగా ఆఫర్లను తమ విలువైన కస్టమర్లకు అందించడం పట్ల సంతోషిస్తున్నట్లు స్టార్ ఎయిర్ కమర్షియల్ వీపీ మన్ను ఆనంద్ తెలిపారు. ఈ సేల్ భారతదేశ చరిత్రలో ఈ ముఖ్యమైన రోజును గుర్తుచేసుకోవడానికి, ప్రయాణికులకు తమ నెట్‌వర్క్‌లో సరసమైన, సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
ఆఫర్ ఎలా పొందాలంటే..
ఈ ఆఫర్‌ను పొందేందుకు, ప్రయాణికులు 5 ఆగస్టు 15వ తేదీ లోపు వెబ్ సైట్ ని సందర్శించి, ప్రమోషనల్ రేటుతో తమ టికెట్‌లను బుక్ చేసుకోవచ్చు. సీట్లు పరిమితంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇష్టపడే ప్రయాణ తేదీలను సురక్షితంగా ఉంచుకోవడానికి ముందస్తు బుకింగ్ చేయడం మంచిది. స్టార్ ఎయిర్ అనేది ప్రాంతీయ విమానయాన సంస్థ. దేశ వ్యాప్తంగా 22 డెస్టినేషన్స్ ను కనెక్ట్ చేస్తుంది. తక్కువ ధరలో సౌకర్యవంతమైన
స్టార్ ఎయిర్ గురించి..
స్టార్ ఎయిర్ భారతదేశంలోని ప్రముఖ ప్రాంతీయ విమానయాన సంస్థ, రియల్ ఇండియాను కనెక్ట్ చేయడానికి, అసాధారణమైన ప్రయాణ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉంది. కస్టమర్ సంతృప్తి, సమయపాలన, విశ్వసనీయతపై దృష్టి సారించడంతో, వారు దేశవ్యాప్తంగా ప్రయాణికులకు విశ్వసనీయ ఎంపికగా స్థిరపడ్డారు. 22 గమ్యస్థానాలలో పనిచేస్తూ, వారు మా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన మరియు ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి ఒక ఆధునిక విమానాలను నిర్వహిస్తారు మరియు అనేక రకాల సేవలను అందిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..