AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day Sale: వన్ ప్లస్ ఫోన్లపై వావ్ అనే ఆఫర్లు.. ఏకంగా రూ.20 వేల వరకూ తగ్గింపు

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వన్ ప్లస్ కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్లు ఆకట్టుకుంటున్నాయి. వాటితో పాటు ఆఫర్లు, నో కాస్ట్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (ఈఎంఐ) ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై దాదాపు రూ. 20 వేల వరకూ తగ్గింపు పొందవచ్చు. వన్ ప్లస్ నోర్డ్ 4, వన్ ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్, ఫ్లాగ్‌షిప్ వన్ ప్లస్ 12 సిరీస్ ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి.

Independence Day Sale: వన్ ప్లస్ ఫోన్లపై వావ్ అనే ఆఫర్లు.. ఏకంగా రూ.20 వేల వరకూ తగ్గింపు
One Plus Smartphones
Madhu
|

Updated on: Aug 14, 2024 | 4:19 PM

Share

దేశంలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఫ్రైవేటు సంస్థలలో తిరంగా జెండాలను అలంకరిస్తూ డెకరేషన్లు చేస్తున్నారు. ఈ పండగ వేళ ప్రజలకు వన్ ప్లస్ శుభవార్త చెప్పింది. వన్ ప్లస్ 12, ఓపెన్, నోర్డ్, మరికొన్నింటిపై తగ్గింపు ధరలను ప్రకటించింది. జెండా పండగ సందర్బంగా సెల్ ఫోన్ల ను కొనుగోలు చేసుకుని సంతోషాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం కల్పించింది. ఇటీవల విడుదల చేసిన వన్ ప్లస్ నోర్డ్ 4కు సంబంధించి బ్యాంకు కార్డులపై రూ.3 వేలు తగ్గింపు ప్రకటించింది. ఆగస్టు 31వ తేదీ వరకూ కొనసాగే ఈ ఆఫర్ లో అందుబాటులో ఉన్న ఫోన్లు, వాటి ధరల వివరాలు, డిస్కౌంట్లను తెలుసుకుందాం.

అదిరే ఆఫర్లు..

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వన్ ప్లస్ కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్లు ఆకట్టుకుంటున్నాయి. వాటితో పాటు ఆఫర్లు, నో కాస్ట్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (ఈఎంఐ) ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై దాదాపు రూ. 20 వేల వరకూ తగ్గింపు పొందవచ్చు. వన్ ప్లస్ నోర్డ్ 4, వన్ ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్, ఫ్లాగ్‌షిప్ వన్ ప్లస్ 12 సిరీస్ ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి.

వన్ ప్లస్ నోర్డ్ 4..

ఈ ఫోన్ పై వన్ ప్లస్ కంపెనీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు, వన్ కార్డ్ కలిగిన ఖాతాదారులు 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లపై రూ. 3వేలు, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై రూ. 2 వేల తగ్గింపును పొందవచ్చు. అలాగే వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలో వన్ ప్లస్ నోర్డ్ 4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు కంపెనీ 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికలను అందిస్తోంది. ఈ ఫోన్ కు సంబంధించి 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29 వేలు, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 32,999, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.35,999కు అందుబాటులో ఉన్నాయి.

వన్ ప్లస్ ఓపెన్..

వన్ ప్లస్.ఇన్, అమెజాన్.ఇన్, వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్ల నుంచి వన్ ప్లస్ ఓపెన్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ సమయంలో ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులు, వన్ కార్డు వినియోగదారులకు రూ. 20 వేల తగ్గింపు లభిస్తుంది. ఆఫ్‌లైన్ స్టోర్‌ల కూడా ఎంచుకోవచ్చు. అదనంగా కంపెనీ ట్రేడ్-ఇన్ డీల్స్‌పై రూ.8 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. 12 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ కోసం ఎంపికలు ఉన్నాయి. వన్ ప్లస్ ఓపెన్ 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.1,39,999, అలాగే 16 జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ (అపెక్స్ ఎడిషన్) వేరియంట్ రూ 1,49,999కు అందుబాటులో ఉన్నాయి.

వన్ ప్లస్ 12..

వన్ ప్లస్.ఇన్, అమెజాన్.ఇన్, వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్ల లో ఈ ఫోన్ పై రూ. 5 వేల తగ్గింపు పొందవచ్చు. అలాగే ఆగస్టు 15 వరకు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. వీటికి అదనంగా ఐసీఐసీఐ, వన్ కార్డులపై రూ. 7 వేల తగ్గింపు పొందవచ్చు. ట్రేడ్-ఇన్ డీల్స్‌పై కంపెనీ రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర విషయానికి వస్తే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 64,999, అలాగే 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 69,999కు అందుబాటులో ఉంది.

వన్ ప్లస్ 12 ఆర్..

దీనిలోని ఎంపిక చేసిన వేరియంట్లపై ఆగస్టు 15 వరకూ రూ.వెయ్యి తగ్గింపు లభిస్తుంది. వన్ ప్లస్.ఇన్, అమెజాన్.ఇన్, వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్ల లో ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులు, వన్ కార్డులపై దాదాపు రూ.2 వేలు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి 31 వరకూ స్టోర్లు, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కంపెనీ ట్రేడ్-ఇన్ డీల్స్‌పై రూ. 5 వేల వరకూ ఎక్స్చేంజ్ బోనస్‌ లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 9 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఈ ఫోన్ లోని 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.39,999, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 42,999, అలాగే 16 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ రూ.45,999కు అందుబాటులో ఉన్నాయి.

మరికొన్ని ఆఫర్లు..

ఐసీఐసీఐ, వన్ కార్డుల వినియోగదారులకు వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 స్మార్ట్‌ఫోన్‌పై రూ. 3వేలు, నోర్డ్ సీఈ 4 లైట్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ.2 వేల తగ్గింపు లభిస్తుంది. నోర్డ్ సీఈ4కు ఆరు నెలలు, నోర్డ్ సీఈ4 లైట్ కు 3 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికలు కూడా ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us