Indian Railways: రైల్వే శాఖ షాకింగ్ నిర్ణయం.. రూ. 30వేల కోట్ల వందేభారత్ రైళ్ల టెండర్ రద్దు.. కారణం ఏమిటంటే..

భారతీయ రైల్వే టెండర్ ను రద్దు చేసుకున్న విషయాన్ని ఆల్‌స్టోమ్ ఎండీ ఒలివియర్ లోయిసన్ ధ్రువీకరించారు. ఆర్డర్‌ను రద్దు చేసినప్పటికీ భవిష్యత్తులో అవసరమైతే మద్దతు ఇవ్వడానికి తమ కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఒక్కో రైలుకు ఈ కంపెనీ వేసిన రూ.150.9 కోట్ల ధర ఎక్కువగా ఉందని రైల్వే టెండర్ ప్యానెల్ గుర్తించింది. దాన్ని రూ. 140 కోట్లకు పరిమితం చేయాలని కోరింది.

Indian Railways: రైల్వే శాఖ షాకింగ్ నిర్ణయం.. రూ. 30వేల కోట్ల వందేభారత్ రైళ్ల టెండర్ రద్దు.. కారణం ఏమిటంటే..
Vande Bharat
Follow us
Madhu

|

Updated on: Aug 14, 2024 | 2:17 PM

దేశంలో ప్రముఖ రవాణా సాధనమైన రైల్వే ను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా నూతనంగా వందేభారత్ రైళ్లను నడుపుతోంది. వీటిని మరింత గా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. దీనిలో భాగంగా వంద వందే భారత్ రైళ్ల తయారీకి ఆల్‌స్టోమ్ ఇండియా కంపెనీతో గతంలో ఒప్పదం కుదుర్చుకుంది. కానీ ఈ 30 వేల కోట్ల టెండర్ ను ఇటీవల భారతీయ రైల్వే రద్దు చేసుకుంది. ఈ నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.

ఒక్కో రైలుకు రూ.150.9 కోట్ల బిడ్..

వందే భారత్ రైళ్ల కోసం 2023 మే 30వ తేదీన తెరిచిన టెండర్లలో ఆల్‌స్టోమ్ కంపెనీ అత్యల్ప బిడ్డర్ గా నిలిచింది. ఈ కంపెనీ ఒక్కో రైలు తయారీకి రూ.150.9 కోట్ల బిడ్ వేసింది. అయితే ఈ ధర ఎక్కువగా ఉందని రూ.140 కోట్లకు తగ్గించుకోవాలని రైల్వే కోరింది. కానీ రూ.145 కోట్లకు ఒప్పందం కుదుర్చుకోవాలని ఆ కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ధర ఎక్కువగా ఉండడంతో రైల్వే ఈ రూ. 30 వేల కోట్ల టెండర్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వంద వందే భారత్ అల్యూమినియం బాడీ రైళ్ల తయారీతో పాటు నిర్వహణ కోసం ఈ టెండర్ ను వేశారు.

రద్దు విషయం నిజమే..

భారతీయ రైల్వే టెండర్ ను రద్దు చేసుకున్న విషయాన్ని ఆల్‌స్టోమ్ ఎండీ ఒలివియర్ లోయిసన్ ధ్రువీకరించారు. ఆర్డర్‌ను రద్దు చేసినప్పటికీ భవిష్యత్తులో అవసరమైతే మద్దతు ఇవ్వడానికి తమ కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఒక్కో రైలుకు ఈ కంపెనీ వేసిన రూ.150.9 కోట్ల ధర ఎక్కువగా ఉందని రైల్వే టెండర్ ప్యానెల్ గుర్తించింది. దాన్ని రూ. 140 కోట్లకు పరిమితం చేయాలని కోరింది. అయితే ఒక్కో రైలు సెట్‌కు రూ.145 కోట్లతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆల్ స్టోమ్ భావించింది. రైల్వే తెరిచిన రూ. 30వేల కోట్ల టెండర్‌కు వీరిదే అత్యల్ప బిడ్. మరో బిడ్ అయిన స్విస్ తయారీదారు స్టాడ్లర్ రైల్, హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్‌లతో కూడిన కన్సార్టియం ఒక్కో రైలు సెట్‌కు రూ. 170 కోట్ల బిడ్ వేసింది.

గతంలో ఇలా..

గతంలో 200 వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్‌ల తయారీకి ఒక రేక్‌కు రూ. 120 చొప్పున గతంలో కాంట్రాక్ట్ మంజూరు చేసినట్లు రైల్వే అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉన్న బిడ్ లో ఈ ధర ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి టెండర్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం కొన్ని నిబంధనలను సవరించనున్నారు. గతంలో మాదిరిగా కేవలం రెండు కంపెనీలే కాకుండా ఈసారి ఎక్కువ కంపెనీలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటారని సమాచారం.

అర్హతలు..

టెండర్ కు వచ్చే కంపెనీలకు కొన్ని అర్హతలు ఉండాలి. అవి ఏడాదికి కనీసం ఐదు రైలుసెట్లను తయారు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇందుకోసం వాటికి పరిశోధన మరియు అభివృద్ధి సౌకర్యం అవసరం. రైల్వే కాాంట్రాక్ట్ ప్రకారం.. ఏడు సంవత్సరాలలోపు వంద రైలు సెట్టు డెలివరీ చేయాలి. గెలిచిన బిడ్డర్ డెలివరీ తర్వాత రూ.13 వేల కోట్లు అందుకుంటారు. ఆ తర్వాత 35 ఏళ్ల పాటు నిర్వహణ కోసం అదనపు రూ.17 వేల కోట్లు అందిస్తారు. హర్యానాలోని సోనేపట్ లో ఈ రైళ్లను తయారు చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..