AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vida V1: హీరో ఈవీ స్కూటర్‌పై బంపర్ ఆఫర్.. రూ.32 వేల వరకు తగ్గింపు

మార్కెట్‌లో పెరుగుతున్న పోటీను తట్టుకునేందుకు కొన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్ మోడల్స్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా హీరో మోటోకార్ప్ కంపెనీ తన ఈవీ స్కూటర్ విడా వీ1 ప్లస్ ఈవీ స్కూటర్‌పై రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఈవీ స్కూటర్‌పై ఏకంగా రూ.32 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉండగా అమెజాన్‌లో మాత్రం రూ.32,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు.

Vida V1: హీరో ఈవీ స్కూటర్‌పై బంపర్ ఆఫర్.. రూ.32 వేల వరకు తగ్గింపు
Hero Vida V1 Pro
Nikhil
|

Updated on: Aug 14, 2024 | 3:26 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లను ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు ఈవీ స్కూటర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే మార్కెట్‌లో పెరుగుతున్న పోటీను తట్టుకునేందుకు కొన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్ మోడల్స్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా హీరో మోటోకార్ప్ కంపెనీ తన ఈవీ స్కూటర్ విడా వీ1 ప్లస్ ఈవీ స్కూటర్‌పై రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఈవీ స్కూటర్‌పై ఏకంగా రూ.32 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉండగా అమెజాన్‌లో మాత్రం రూ.32,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో విడా వీ1 ప్లస్ ఈవీ స్కూటర్ తగ్గింపుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

హీరో విడా వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను స్పాట్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.27,000 తగ్గింపు పొందవచ్చు. అలాగే ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.32,000 తగ్గింపు అందిస్తున్నారు. తాజాగా తగ్గింపులతో ఈ స్కూటర్‌ను రూ.91,000 నుంచి రూ.94,000 మధ్య కొనుగోలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ హీరో మోటోకార్ప్ దాని విడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ స్కూటర్ హీరో సబ్-బ్రాండ్ విడా పేరుతో విక్రయాలు చేస్తున్నారు. ఈ స్కూటర్ బోల్డ్, మస్కులర్ డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ ఫీచర్లు యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఈవీ స్కూటర్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లు, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, ఏడు అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ ప్లేతో పాటు కీలెస్ ఎంట్రీ, 26 లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, మూడు విభిన్న రైడింగ్ మోడ్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. 

ఈ ఈవీ స్కూటర్ మెరుగైన సస్పెన్షన్ డ్యూటీ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌తో వస్తుంది. అలాగే విడా వీ 1 ప్లస్ 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆధారంగా అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 143 కిమీ వరకు సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో 3.4 సెకన్లలో 0-40 కిలోమీటరల్ వేగాన్ని అందుకుంటుంది. విడా వీ 1 ప్లస్ స్కూటర్‌కు ఐదేళ్ల వారెంటీ లేదా 50,000 కిమీ వారెంటీ లభిస్తుంది అలాగే బ్యాటరీ ప్యాక్ మూడు సంవత్సరాలు లేదా 30,000 కిమీ వారెంటీను అందిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..