AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPS Calculation: నెలకు రూ. 1లక్ష పెన్షన్ కావాలా? ఇలా చేస్తే.. సాధ్యమే..

మీరు పదవీ విరమణ చేసిన తర్వాత మీ ఎన్‌పీఎస్ పెట్టుబడుల నుంచి నెలవారీ రూ. 1 లక్ష పెన్షన్ పొందాలనుకుంటే కొన్ని అంశాలు ప్రాథమికంగా గుర్తుంచుకోవాలి. అవేంటంటే.. మీరు పెట్టుబడి ప్రారంభించే వయసు, ప్రతి ఏటా పెట్టుబడి పెంచుకుంటూ వెళ్లే ప్రణాళిక ఉండాలి. అప్పుడే మీకు అంది సాధ్యమవుతుంది.

NPS Calculation: నెలకు రూ. 1లక్ష పెన్షన్ కావాలా? ఇలా చేస్తే.. సాధ్యమే..
Nps
Madhu
|

Updated on: Aug 14, 2024 | 1:56 PM

Share

మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పెన్షన్ పథకాలలో నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) ఒకటి. దీనిలోని ఫీచర్లు, ప్రయోజనాలు అందరినీ ఆకర్షిస్తాయి. వాస్తవానికి ఇది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రారంభించిన పథకం. అయితే ఆ తర్వాత ఇది వేగంగా అప్ డేట్ అవుతూ విస్తరించింది. ఈ పథకాన్ని 2004లో ప్రవేశపెట్టారు. ఎస్పీఎస్ సాయిధ దళాల్లోని వారిని మినహాయించి, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత 2009 మేలో భారత పౌరులందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ పథకంలో 18ఏళ్లు నిండి 70 ఏళ్ల మధ్య ఉన్న వారు ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు. భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకునేందుకు ఇది విలువైన ఎంపికగా పనిచేస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఈ ఎన్‌పీఎస్ పనిచేస్తుంది. ఇది మార్కెట్-లింక్డ్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ స్కీమ్. పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని అందించే కార్పస్ ను నిర్మిస్తుంది. ఇప్పుడు ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రూ. లక్ష నెలవారీ పెన్షన్ పొందే అవకాశం కూడా ఉంది. అది సాధ్యమా అంటే.. అవుననే చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ఎన్‌పీఎస్ ద్వారా నెలకు రూ. లక్ష పెన్షన్ రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎన్ని సంవత్సరాలు పెట్టాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రూ. 1 లక్ష నెలవారీ పెన్షన్ రావాలంటే..

మీరు పదవీ విరమణ చేసిన తర్వాత మీ ఎన్‌పీఎస్ పెట్టుబడుల నుంచి నెలవారీ రూ. 1 లక్ష పెన్షన్ పొందాలనుకుంటే కొన్ని అంశాలు ప్రాథమికంగా గుర్తుంచుకోవాలి. అవేంటంటే.. మీరు పెట్టుబడి ప్రారంభించే వయసు, ప్రతి ఏటా పెట్టుబడి పెంచుకుంటూ వెళ్లే ప్రణాళిక ఉండాలి. అప్పుడే మీకు అంది సాధ్యమవుతుంది. ఉదాహరణకు 35 ఏళ్ల వయస్సులో ఎన్‌పీఎస్ ప్రారంభించి, 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ పొందుతారు అనుకుందాం.. ఆ సమయానికి మీకు రూ. లక్ష పెన్షన్ రావాలంటే..

మీ పెట్టుబడులు వార్షికంగా 10 శాతం పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మీరు 6 శాతం వార్షిక రాబడితో యాన్యుటీని కొనుగోలు చేయడానికి మీ మొత్తం కార్పస్లో 60 శాతాన్ని ఉపయోగిస్తే, మీరు నెలకు రూ. 17,000 కంట్రీబ్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో మీరు యాన్యుటీ కోసం మీ కార్పస్లో 40 శాతాన్ని ఉపయోగిస్తే, మీరు నెలకు రూ. 34,000 విరాళంగా ఇవ్వాలి. ఈ రెండు రెండు సందర్భాల్లోనూ మీరు పదవీ విరమణ తర్వాత నెలవారీ రూ. 1 లక్ష పెన్షన్ పొందుతారు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ వల్ల ప్రయోజనాలు..

నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ప్రధానమైనది పన్ను ప్రయోజనాలు. అలాగే పదవీ విరమణ కోసం క్రమపద్ధతిలో ఆదా చేసే సామర్థ్యం. క్రమశిక్షణతో కూడిన పొదుపులను ప్రోత్సహించడం ద్వారా, ఇది వ్యక్తులు ఆర్థికంగా సురక్షితమైన పదవీ విరమణ కోసం ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..