AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stocks: అప్పుడు రూ. 700కి 1900 షేర్లు.. ఇప్పుడు వాటి ధర తెలిస్తే టైమ్ మిషిన్ కావాలంటారు

ఓ పెద్దాయన 2002లో రూ. 700 చొప్పున 1900 MRF షేర్లు కొన్నారు. ఇప్పుడు అవి ఒక్కొక్కటి రూ. 1.35 లక్షలకు చేరాయి. ఈ సందర్భంగా బిజినెస్ నిపుణులు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి కీలక విషయాలు చెబుతున్నారు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Stocks: అప్పుడు రూ. 700కి 1900 షేర్లు.. ఇప్పుడు వాటి ధర తెలిస్తే టైమ్ మిషిన్ కావాలంటారు
Business
Ravi Kiran
|

Updated on: Feb 05, 2026 | 12:33 PM

Share

స్టాక్ మార్కెట్ అంటే వైకుంఠపాళీ. ఇది కచ్చితంగా నిజమే.. కానీ పాములు దాటుకుంటూ.. నిచ్చెనలు ఎక్కుతూ గమ్యానికి చేరుకున్నవాడే మొనగాడు. ఇక ఇటీవల కాలంలో చాలామంది స్టాక్ మార్కెట్‌లోకి హర్షద్ మెహతా కథలు విని వచ్చి ఉంటారు. అయితే స్టాక్ మార్కెట్ అనేది భయపడాల్సింది. అందులో సరైన పద్దతిలో పెట్టుబడులు పెడితే.. దీర్ఘకాలికంగా అత్యధిక రాబడులు మనం చూడొచ్చు. ఓ పెద్దాయన 2002లో MRFకి సంబంధించి 1900 షేర్లను రూ. 700 చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ షేర్లలో ఒక్కొక్కటి రూ. 1.35 లక్షలకుపైగా ఉన్నాయి. ఈ అద్భుతమైన వృద్ధి స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి గొప్పతనాన్ని చూపిస్తుంది. MRF (మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ) అనేది దేశంలోని ఒక ప్రముఖ టైర్ల తయారీ సంస్థ. దీనిని 1946లో స్థాపించారు. కంపెనీ తన IPOని 1993లో ప్రకటించింది. ఆ సమయంలో ఒక్కో షేరు ధర రూ. 11 మాత్రమే.

2002లో రూ. 700కి కొనుగోలు చేసిన షేరు విలువ రెండు దశాబ్దాల తర్వాత రూ. 1.35 లక్షలపైగా ఉండటం ఆ సంస్థ వృద్దికి నిదర్శనం. ఆ పెద్దాయన డబ్బు అవసరం లేదు, ఈ షేర్లను ఇప్పుడు అమ్మే ఆలోచన లేదు. భవిష్యత్తులో మరింతగా పెరుగుతుందని.. కనీసం రూ. 2 లక్షలు చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దీనిపై బిజినెస్ నిపుణులు మాట్లాడుతూ.. మంచి డివిడెండ్, అలాగే అధిక రాబడి ఇచ్చే ఇలాంటి స్టాక్స్ పోర్ట్‌ఫోలియోలో ఉంటే.. కచ్చితంగా అమ్మకూడదని అంటున్నారు. ప్రస్తుతం ఈ షేర్ రూ. 3 డివిడెండ్ ఇస్తుంది. భవిష్యత్తులో ఈ షేరు విలువ రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు కూడా చేరవచ్చని అంచనా వేశారు. ఇలాంటి బలమైన షేర్స్ సామాన్య వ్యక్తికి కేవలం ఆర్ధికంగా లాభం చూపించడమే కాదు.. జీవితంలో ఒక రకమైన ఆర్ధిక భద్రతను అందిస్తాయని నిపుణులు వివరించారు. కాగా, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు కచ్చితంగా ఓపిక, సరైన ఎంపిక అవసరం అని స్పష్టం చేశారు.

ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
గుండెనే కాదు, మీ మెదడును కూడా నాశనం చేసే ఆ అలవాటు ఏంటో తెలుసా?
గుండెనే కాదు, మీ మెదడును కూడా నాశనం చేసే ఆ అలవాటు ఏంటో తెలుసా?
మండుతున్న గ్యాస్ ధరలు.. సిలిండర్ ఆదా చేసే చిట్కాలు ఫాలో అయ్యారంటే
మండుతున్న గ్యాస్ ధరలు.. సిలిండర్ ఆదా చేసే చిట్కాలు ఫాలో అయ్యారంటే
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్