AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: ఆ చిన్న తప్పు వల్లే ఆగడు మూవీ పోయింది.. శ్రీను వైట్ల నాకు ఫోన్ చేసి..

అనిల్ రావిపూడి ఆగడు సినిమా సెకండ్ హాఫ్‌పై తన నిరాశను వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైటర్‌గా దర్శకుడి విజన్‌కు ప్రాధాన్యత ఇస్తూ, సినిమా విజయం, అపజయానికి డైరెక్టర్ బాధ్యత వహించాలని ఆయన నమ్ముతానన్నారు. శ్రీను వైట్లతో జరిగిన చర్చలు, పటాస్ సెకండ్ హాఫ్ లాంటి ఆలోచనలను పంచుకోలేకపోవడం పట్ల ఆయన బాధను వ్యక్తం చేశారు.

Anil Ravipudi: ఆ చిన్న తప్పు వల్లే ఆగడు మూవీ పోయింది.. శ్రీను వైట్ల నాకు ఫోన్ చేసి..
Anil Ravipudi
Ravi Kiran
|

Updated on: Feb 04, 2026 | 1:54 PM

Share

దర్శకుడు అనిల్ రావిపూడి ఆగడు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోకపోవడానికి గల కారణాలపై గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. ఒక రైటర్‌గా, డైరెక్టర్‌గా తన పనితీరును వివరిస్తూ, ఒక సినిమా విజయం లేదా అపజయానికి పూర్తి బాధ్యత దర్శకుడిదేనని ఆయన బలంగా నమ్ముతానన్నారు. రేపు సినిమా ఆడకపోతే రైటర్‌కు ఇంకో నాలుగు సినిమాలు వచ్చే అవకాశముంటుందని, కానీ దర్శకుడికి మాత్రం ఆ సినిమానే చివరిది కావచ్చని అభిప్రాయపడ్డారు. అందువల్ల, ఒక రైటర్‌గా తాను ఎప్పుడూ దర్శకుడి నిర్ణయాలపై ఒత్తిడి తీసుకురాలేదని, దర్శకుడి విజన్‌కు తగ్గట్టుగా పనిచేశానని పేర్కొన్నారు.

తాను ఆగడు సినిమాకు మాటలు, స్క్రిప్ట్ రచనలో ఓ పార్ట్ అయ్యానని, ముఖ్యంగా సినిమా మొదటి భాగానికి పూర్తిగా నిమగ్నమయ్యానని అనిల్ రావిపూడి వెల్లడించారు. అయితే, రెండో భాగానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం పట్ల ఆయన బాధపడ్డారు. ఆగడు స్క్రిప్టింగ్‌ జరుగుతున్న సమయంలోనే, తాను కళ్యాణ్ రామ్‌తో తన ఫస్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నానని తెలిపారు. ఈ రెండు పనులు సమాంతరంగా సాగడం వల్ల, ఆగడు రెండో భాగానికి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయానని ఆయన వివరించారు.

ఆగడు సెకండ్ హాఫ్ గురించి శ్రీను వైట్లతో చర్చలు జరిగినప్పటికీ, తన మనసులో ఉన్న పటాస్ తరహా ఎమోషనల్, హీరోయిజం నిండిన సెకండ్ హాఫ్ ఆలోచనను పూర్తిగా పంచుకోలేకపోయానని రావిపూడి పేర్కొన్నారు. శ్రీను వైట్ల అప్పటికే ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్లిపోవాలని అనుకున్నారని.. దానిని తాను కూడా నమ్మి పనిచేశానని చెప్పారు. ఒకవేళ ఆ సమయంలో తాను మరింత చొరవ తీసుకుని పటాస్ మోడల్ సెకండ్ హాఫ్ గురించి సూచించి ఉంటే, ఆగడు ఫలితం వేరేలా ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై శ్రీను వైట్ల సరదాగా “నువ్వు నాకు సెకండ్ హాఫ్‌కు కూర్చోకుండా వెళ్లిపోయావు” అని అంటుంటారని ఆయన గుర్తు చేసుకున్నారు. దీనిని ఆయన ఒక చిన్న రిగ్రెట్‌గా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా, తాను వరుణ్ సందేశ్‌తో కలిసి పనిచేసిన హ్యాపీ హ్యాపీగా(2010) సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాకు తాను మాటలు రాశానని, అయితే తమిళ దర్శకుడు శరణ్ దర్శకత్వం వహించడం వల్ల, తాను రాసిన కొన్ని ఫన్నీ సీన్స్, పంచులు లేకపోవడం వల్ల సినిమా ఆశించిన స్థాయిలో పండలేదని అని అన్నారు. ఒక రైటర్‌గా తాను రాసిన సీన్స్ దర్శకుడి మేకింగ్ వల్ల చెడిపోయిన సందర్భాలు ఎదురవ్వలేదని, కానీ హ్యాపీ హ్యాపీగా విషయంలో ఈ అంశం కొంత ప్రభావితం చేసి ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు.

ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..