Telangana: ఆ కిక్కులో చెత్తకుప్ప దగ్గర సోయి లేకుండా.. దగ్గరకెళ్లి తట్టి లేపగా
అది జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి.. పొద్దున్నే మద్యం షాప్ దగ్గర క్యూ కట్టారు. అయితే ఆ పక్కన ఉన్న ఓ చెత్త కుప్ప నుంచి దుర్వాసన రావడం మొదలైంది. ఏంటా అని చూడగా.. ఓ వ్యక్తి పడి ఉన్నాడు.. మద్యం కిక్కు ఎక్కి సోయి లేకుండా పడి ఉన్నాడనుకునేరు.. ఆ వివరాలు ఇలా..

ఆ మద్యం షాప్ యజమాని యధావిధిగా ఉదయాన్నే షట్టర్ తెరిచేందుకు వచ్చాడు. అయితే ఓ చోట నుంచి దుర్వాసన రావడాన్ని గమనించాడు. ఏమై ఉంటుందా అని దగ్గరకు వెళ్లి చూడగా దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ చెత్త కుప్పలో కనిపించిన ఆకారాన్ని చూసి బెంబేలెత్తిపోయాడు. ఈ ఘటన హైదరబాద్‌లోని జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చెత్తకుప్పలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లమ్మబండలోని ఓ మద్యం దుకాణం దగ్గర చెత్తకుప్పలో ఓ వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించి స్థానికుల సహాయంతో మృతి చెందిన వ్యక్తిని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్‌లో నివసించే రుస్తుం(43)గా గుర్తించారు. మృతుడు పెయింటర్‌గా పని చేస్తాడని, నిన్న రాత్రి మద్యం సేవించాక, మద్యం మత్తులో చెత్తకుప్పలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




