AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!

టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ గొప్ప వ్యక్తిత్వాన్ని, వినయం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, స్టార్‌డమ్ ఉన్నా బాలకృష్ణ అందరినీ గౌరవిస్తారని, చిన్నపిల్లల మనస్తత్వం కలవారని పేర్కొన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Tollywood: ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!
Tollywood
Ravi Kiran
|

Updated on: Feb 04, 2026 | 2:16 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం, గొప్పతనం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలకృష్ణను “మహా గొప్ప వ్యక్తి”గా అభివర్ణించారు. బాలయ్య బాబులోని వినయం, సంస్కారం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. షూటింగ్ సమయంలో తాను ఎంట్రీ ఇవ్వగానే, బాలకృష్ణ వెంటనే లేచి నిలబడి, “కూర్చోండి గురువుగారు” అని తనను బలవంతంగా కూర్చోబెట్టేవారని గుర్తు చేసుకున్నారు. ఈ గౌరవం తనకు మాత్రమే కాదని, ఎవరైనా సరే బాలకృష్ణ అంత మర్యాద ఇస్తారని జయప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

బాలకృష్ణలో పెద్ద హీరోననే, గొప్ప కుటుంబం నుంచి వచ్చాననే గర్వం ఏమాత్రం లేదని, ఆయన మనస్తత్వం చిన్న పిల్లవాడిలా ఉంటుందని జయప్రకాష్ రెడ్డి అన్నారు. తన వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి జ్ఞాపకాలను కూడా బాలకృష్ణ ఇతరులతో పంచుకుంటారని చెప్పారు. బాలకృష్ణను “హ్యూమన్ కంప్యూటర్”గా అభివర్ణిస్తూ, ఆయన తండ్రి నటించిన సినిమాల్లోని పాత్రలు, మాటలు, పెద్ద డైలాగ్స్ అన్నింటినీ అవలీలగా చెబుతారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేర్చుకోవాలనే తపన ఆయనలో ఎప్పుడూ ఉంటుందని, మంత్రాలు, ఇతర విషయాలను నేర్చుకుని, “కరెక్టేనా?” అని అడుగుతారన్నారు. తనకు శివుడంటే ఇష్టమని బాలకృష్ణకు తెలుసని, అందుకే ఆయన తనను, తనికెళ్ళ భరణిని “ఓం నమశ్శివాయ” అంటూ పలకరిస్తారని చెప్పారు. బాలకృష్ణ కనపడితే ఐదుసార్లు “ఓం నమశ్శివాయ” అనాలని పట్టుబడతారని సరదాగా గుర్తు చేసుకున్నారు.

అలాగే తాను టీచర్‌గా పనిచేసినప్పటి నుంచి ఇతరుల కష్టనష్టాల్లో ఆదుకోవాలనే గుణం తనకు ఉందని జయప్రకాష్ రెడ్డి అన్నారు. తన మాట వినేవారికి, టాలెంట్ ఉన్నవారికి వేషాలు ఇప్పించాలని ప్రయత్నిస్తుంటానని తెలిపారు. చిన్న చిన్న ఆర్టిస్టులకు నెలకు రెండు మూడు రోజులు పని దొరికితే, ఇంటి అద్దె, పిల్లల పోషణ వంటి ఖర్చులు గడుస్తాయని, వారికి ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!
ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!
ఈ పండు పోషకాల గని.. కానీ ఆ రోగులకు మాత్రం హాని!
ఈ పండు పోషకాల గని.. కానీ ఆ రోగులకు మాత్రం హాని!
చిరుతిళ్లు ఇష్టంగా లాగించేస్తున్నారా.? లోనికి వచ్చి చూడగా
చిరుతిళ్లు ఇష్టంగా లాగించేస్తున్నారా.? లోనికి వచ్చి చూడగా
చనిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూడొచ్చు.. కళ్ల దానం గురించి..
చనిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూడొచ్చు.. కళ్ల దానం గురించి..
చపాతీలు అప్పడాల్లా మారుతున్నాయా? ఈ తప్పులు చేయకండి!
చపాతీలు అప్పడాల్లా మారుతున్నాయా? ఈ తప్పులు చేయకండి!
ఏపీలోని విద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 16 నుంచే.. అది ఫ్రీ..
ఏపీలోని విద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 16 నుంచే.. అది ఫ్రీ..
ఎరుపు రంగు చూస్తే నిజంగానే ఎద్దులు రెచ్చిపోతాయా?దీని వెనుక రహస్యం
ఎరుపు రంగు చూస్తే నిజంగానే ఎద్దులు రెచ్చిపోతాయా?దీని వెనుక రహస్యం
ఆ చిన్న తప్పు వల్లే ఆగడు పోయింది.. శ్రీను వైట్ల నాకు ఫోన్ చేసి..
ఆ చిన్న తప్పు వల్లే ఆగడు పోయింది.. శ్రీను వైట్ల నాకు ఫోన్ చేసి..
లోన్ కట్టలేదని బ్యాంకులు టార్చర్ చేస్తున్నాయా.?
లోన్ కట్టలేదని బ్యాంకులు టార్చర్ చేస్తున్నాయా.?
లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్.. అసలేం జరిగిందంటే..
లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్.. అసలేం జరిగిందంటే..