Long Term Investment: స్టాక్ మార్కెట్.. రియల్ ఎస్టేట్… ధీర్ఘకాలిక రాబడి కోసం ఏది బెటర్?
మార్కెట్ నిపుణులు మాత్రం ధీర్ఘకాలిక రాబడి కోసం స్టాక్ మార్కెట్‌తో పాటు రియల్ ఎస్టేట్ పెట్టుబడితో మంచి రాబడి పొందవచ్చని సూచిస్తున్నారు. అయితే ఈ రెండు రంగాల్లో ఏదీ మంచిదో తెలుసుకోవడానికి చాలా మంది నిపుణులను ఆశ్రయిస్తున్నారు. ఈ రెండు మార్గాలు పెట్టుబడికి అనువైనవిగా ఉన్నా దేనికదే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నయని వివరిస్తున్నారు.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన సంపాదన ఉన్నప్పుడే భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడి పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే పెట్టుబడుల విషయంలో స్వల్పకాలంలో రాబడి ఇచ్చే వాటి కంటే ధీర్ఘకాలిక పొదుపు మార్గాల్లో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుంది. కానీ ధీర్ఘకాలంలో పెట్టుబడికి ఏ రంగం మంచిదో తెలియక చాలా మంది తికమక పడుతూ ఉంటారు. మార్కెట్ నిపుణులు మాత్రం ధీర్ఘకాలిక రాబడి కోసం స్టాక్ మార్కెట్‌తో పాటు రియల్ ఎస్టేట్ పెట్టుబడితో మంచి రాబడి పొందవచ్చని సూచిస్తున్నారు. అయితే ఈ రెండు రంగాల్లో ఏదీ మంచిదో తెలుసుకోవడానికి చాలా మంది నిపుణులను ఆశ్రయిస్తున్నారు. ఈ రెండు మార్గాలు పెట్టుబడికి అనువైనవిగా ఉన్నా దేనికదే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నయని వివరిస్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్‌తో పాటు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో నష్టాలతో పాటు లాభాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు
లాభాలు
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఒకేసారి సొమ్ము కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మార్కెట్‌లో భూమి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాకే పెట్టుబడి ఉత్తమం. అయితే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే ధీర్ఘాకాలంలో చాలా లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి అంటే ప్రత్యక్ష ఆస్తికి నమూనా. మన పెట్టుబడి ఎల్లప్పుడూ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో ద్రవ్యోల్బణం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇలాంటి సందర్భంగా మార్కెట్‌లో భూముల ధరలు పెరుగుతాయి. తద్వారా పెట్టుబడిపై మంచి రాబడి వస్తుంది. మనం కొంటున్న భూమి మంచి ప్రైమ్ ఏరియాలో ఉంటే దానితో స్థిర ఆదాయం వస్తుంది. ముఖ్యంగా భూమి అద్దెకివ్వడంతో పాటు అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి భాగస్వామ్య పద్ధతి డెవలప్ చేసుకుంటే మంచి రాబడి వస్తుంది.
నష్టాలు
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి లిక్విడ్ క్యాష్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మనకు ఏదైనా అవసరం వచ్చి డబ్బు అర్జెంట్‌గా కావాల్సి వస్తే నగదు రూపంలో డబ్బు అందుబాటులో ఉండదు. ఎందుకంటే మనం కొన్న భూమి వేరే వాళ్లకు అమ్మేదాకా డబ్బు చేతికి రాదు. అయితే ప్రైమ్ ఏరియాల్లో భూమిని కొంటే మంచి రాబడి వచ్చినా ప్రభుత్వం ఏదైనా రహదారి విస్తరణకు నామమాత్రపు ధరకు భూమిని స్వాధీం చేసుకునే అవకాశం ఉంటుంది.
స్టాక్ మార్కెట్‌లు
లాభాలు
స్టాక్ మార్కెట్ ప్రతి పెట్టుబడిదారుడికి అవకాశాలు ఉంటాయి. అయితే నష్టాల విషయంలో అవగాహనతో మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లు అంటే లిక్విడ్ క్యాష్‌కు అనువైన పెట్టుబడి ఎంపిక. మనకు సొమ్ము అవసరమైనప్పుడు మన స్టాక్‌లను విక్రయించి నగదు పొందవచ్చు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడితో ఊహించని రీతిలో రాబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్‌తో పోల్చితే స్టాక్ మార్కెట్‌లో చాలా చిన్న మొత్తంతో పెట్టుబడి పెట్టవచ్చు.
నష్టాలు
స్టాక్ మార్కెట్‌లు అధిక అస్థిరతను కలిగి ఉంటాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు స్టాక్ మార్కెట్‌లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్ నష్టాలు అనేవి అనివార్యమని గమనించాలి. నిర్దిష్ట పరిశోధన లేకుండా పెట్టుబడి పెడితే రాబడి విషయం పక్కన పెడితే అసలును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..