AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Investment Plans: పిల్లల కోసం ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. అధిక రాబడితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా..

పిల్లల విషయంలో పెట్టుబడి పెట్టాలనుకొంటే ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ మేలు జరుగుతుంది. పిల్లలకు సంబంధించిన పెట్టుబడి పథకాలన్నీ దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చేవే ఉంటాయి. అయితే ఏ పథకంలో పెట్టుబడి పెట్టాలి? 

Best Investment Plans: పిల్లల కోసం ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. అధిక రాబడితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా..
best investments for children
Madhu
|

Updated on: Jun 14, 2023 | 3:30 PM

Share

ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని భావిస్తారు. అన్ని వారు అడగకముందే తెచ్చిస్తారు. ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు ప్లానింగ్ విషయంలో మాత్రం కాస్త వెనుకబడతారు. కారణం సరైన అవగాహన లేకపోవడమే. సాధారణంగా పన్ను ఆదా చేసుకోవడం కోసం.. అలాగే పదవీ విరమణ సమయంలో పలు ప్రయోజనాలు పొందడం కోసం ఎక్కువగా వివిధ పెట్టుబడి పథకాలలో పెట్టుబడి పెడుతుంటారు. అయితే పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం మర్చిపోతుంటారు. ఎప్పుడో పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత గుర్తొచ్చి.. అప్పుడు ప్రారంభిస్తారు. అయితే పిల్లల విషయంలో పెట్టుబడి పెట్టాలనుకొంటే ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ మేలు జరుగుతుంది. పిల్లలకు సంబంధించిన పెట్టుబడి పథకాలన్నీ దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చేవే ఉంటాయి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పథకాలు ప్రారంభిస్తే వారి ఉన్నత చదువులు, పెళ్లిళ్ల సమయానికి మంచి అధిక మొత్తంలో రాబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఏ పథకంలో పెట్టుబడి పెట్టాలి? దేనిలో అధిక రాబడి ఉంటుంది? ఏ పథకంలో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి? తెలుసుకుందాం రండి..

సుకన్య సమృద్ధి పథకం..

ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం సుకన్య సమృద్ధి యోజన. దీనిలో మీ కుమార్తెకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, మీరు ఏదైనా పోస్టాఫీసులలో లేదా బ్యాంకులలో ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం కోసం ప్రతి సంవత్సరం కనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు.

సావరిన్ గోల్డ్ బాండ్స్..

అస్థిరమైన ఈక్విటీ మార్కెట్లతో పోల్చితే బంగారం ఎల్లప్పుడూ ఉత్తమ రక్షణగా ఉంటుంది. భౌతిక రూపంలో బంగారం నిల్వతో సంబంధం ఉన్న ప్రమాదాన్ని తొలగించడానికి, నిపుణులు అసలు బంగారంలో పెట్టుబడి పెట్టవద్దని సలహా ఇస్తారు. దానికి బదులుగా గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ లేదా ఇ-గోల్డ్‌లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రికరింగ్, ఫిక్సెడ్ డిపాజిట్లు..

మీరు మీ పిల్లల కోసం ప్రారంభించగల ఉత్తమ పథకాలలో ఈ ఎఫ్డీ, ఆర్డీలు ఉంటాయి. మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కంటే ఇవి మీకు తక్కువ రాబడిని అందించినప్పటికీ, అవి దాదాపు రిస్క్ లేనివి. కాబట్టి అవి మీ పిల్లలకు ఉత్తమమైన పెట్టుబడులు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్..

మీరు 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉన్న ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో మీరు చేసే పెట్టుబడి మీ ఉత్తమ పెట్టుబడిగా ఉంటుంది. తప్పనిసరిగా కనీసం రూ. లక్ష పెట్టుబడి పెట్టాలని కూడా గుర్తుంచుకోవాలి.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌..

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అని పిలువబడే పొదుపు బాండ్ పథకం పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తుంది, ప్రధానంగా తక్కువ నుంచి మితమైన ఆదాయం ఉన్నవారు సెక్షన్ 80సీ పన్ను ప్రయోజనాన్ని పొందుతూ పెట్టుబడి పెట్టడానికి ఇది అనుమతి ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..