MSSC Vs FD: ఇది మహిళలకు ప్రత్యేకం.. పొదుపు చేయాలని భావిస్తే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ కన్నా ఇదే బెస్ట్ ఆప్షన్..
ప్రజల్లో అత్యంత ఆదరణ పొందిన పథకాలలో ఒకటైన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)కి ఇది ప్రత్యామ్నాయం అవుతుంది. ప్రధానంగా మహిళలకు ఎఫ్‌డీ కన్నా ఎంఎస్ఎస్సీ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఓ ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. దాని పేరు మహిళా సమ్మన్ సేవింగ సర్టిఫికెట్(ఎంఎస్ఎస్సీ) పథకం. ఇది మహిళలకు ప్రత్యేకించిన పథకం. దీనిలో పెట్టే పెట్టుబడులకు 7.5శాతం వడ్డీని ప్రభుత్వం అందిస్తోంది. దీని మెచ్యూరిటీ పీరియడ్ రెండేళ్లు. కనీసం రూ. 1000 నుంచి రూ. 2 లక్షల వరకూ దీనిలో మహిళలు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే 2025 మార్చి 31 వరకూ మాత్రమే పథకం అందుబాటులో ఉంటుంది. ఆ తేదీ వరకూ మాత్రమే పెట్టుబడులను స్వీకరిస్తారు. ఇది ప్రజల్లో అత్యంత ఆదరణ పొందిన పథకాలలో ఒకటైన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)కి ప్రత్యామ్నాయం అవుతుంది. ప్రధానంగా మహిళలకు ఎఫ్‌డీ కన్నా ఎంఎస్ఎస్సీ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికెట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రెండింటిలో ఏది మంచిది? దేనిలో అధిక వడ్డీ వస్తుంది? వంటి వివరాలు చూద్దాం..
ప్రధాన వ్యత్యాసాలు ఇవి..
- ఈ రెండు పథకాలు మంచి ప్రయోజనాలు ఇచ్చేవే అయినా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పథకం.. దాని పేరులోనే తెలుస్తోంది.. మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికెట్ అంటే ఇది కేవలం మహిళలకు ఉద్దేశించిన పథకం. మహిళలు మాత్రమే దీనిలో పెట్టుబడులు పెట్టగలరు. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్ లో అయితే ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు. పురుషులు, మహిళలు, వృద్ధలు ఎవరైనా పథకాన్ని ప్రారంభించవచ్చు.
- మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ లో మీరు పెట్టిన పెట్టుబడికి రెండేళ్లు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అయితే ఒక ఏడాది పూర్తయిన తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం నుంచి రూ. 40,000 వరకూ పెట్టుబడులు పెట్టొచ్చు. దీనిలో పెట్టే పెట్టుబడులకు ఆదాయ పన్ను మినహాయింపులు ఉండవు. అలాగే వచ్చే వడ్డీపై కూడా ట్యాక్స్ పడుతుంది.
- అదే రెండేళ్ల కాల వ్యవధితో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో పెట్టే పెట్టుబడికి కూడా ఆదాయ పన్ను మినహాయింపులు ఉండవు. రెండేళ్ల కాల వ్యవధితో కూడిన ఎఫ్ డీ ల్లో రూ. 2 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టొచ్చు. దీనిలో కొంత మొత్తాన్ని మెచ్యూరిటీ కి కన్నా ముందే విత్ డ్రా చేయాలంటే బ్యాంకులు పెనాల్టీ విధిస్తాయి. ఆ చార్జీలు బ్యాంకును బట్టి మారుతుంటుంది.
- బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికెట్ రెండింటిలోనూ రెండేళ్ల వ్యవధికి ఎటువంటి ట్యాక్స్ మినహాయింపులు ఉండవు. కానీ వడ్డీ కి వచ్చేసరికి బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఈ మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో ఎక్కువగా వస్తుంది. కొన్ని బ్యాంకులు వయో వృద్ధులకు ఈ ఎంఎస్ఎస్సీ పథకం కన్నా ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. కానీ మహిళలకు మాత్రం ఈ మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికెట్ బెటర్ ఆప్షన్ అని చొప్పొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..