Hyundai Creta EV: ఎంజీ జెడ్ఎస్ ఈవీ పోటీగా హ్యూందాయ్ క్రెటా ఈవీ.. లాంచింగ్ ఎప్పుడో తెలుసా?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తమ ఈవీ వ్యూహానికి మరింత పదును పెట్టింది. మొదట్లో ప్రీమియం ఈవీలతో ప్రారంభించిన కంపెనీ తాజాగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే కార్లల్లో కూడా ఈవీ వెర్షన్లు లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.
భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ రంగంలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. చైనా, అమెరికా తర్వాత సమీప భవిష్యత్తులో భారతదేశంలోనే ఈవీలకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. అందువల్ల తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తమ ఈవీ వ్యూహానికి మరింత పదును పెట్టింది. మొదట్లో ప్రీమియం ఈవీలతో ప్రారంభించిన కంపెనీ తాజాగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే కార్లల్లో కూడా ఈవీ వెర్షన్లు లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసిన క్రెటా కార్లల్లో తాజా ఈవీ వెర్షన్ లాంచ్ చేయడానికి హ్యూందాయ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో అగ్రగామిగా ఉన్న హ్యుందాయ్ క్రెటా 2025 నాటికి ఎంజీ జెడ్ఎస్ ఈవీ పోటీగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఈవీని అంతర్గతంగా ఎస్‌యూ 2 ఐ ఈవీగా పిలుస్తున్నారు. ముఖ్యంగా క్రెటా ఈవీ టెస్ట్ ఎడిషన్ ప్రస్తుతం ఉన్న ఎస్‌యూవీ క్రెటా మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ఇది లాంచ్ అయ్యే సమయానికి అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓ సారి చార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేలా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఈవీలో 100 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది దాదాపు 136 హెచ్‌పీ శక్తిని, 395 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఈవీని సంవత్సరానికి దాదాపు 25,000 వాల్యూమ్స్‌ను తయారు చేయాలని కంపెనీ చర్యలు తీసుకుంటుంది. క్రెటా ఈవీ సిరీస్ ఉత్పత్తి 2024 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే సరసమైన క్రెటా ఈవీ మారుతి వైవై8 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ, రెనాల్ట్-నిస్సాన్‌ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..