ATM Fraud: సాయం పేరుతో స్వాహా చేసేస్తారు! ఏటీఎం కార్డు ఇరుక్కుందా.. ఇరుకున పడ్డట్టే!
ఇటీవల కాలంలో బ్యాంకు ఏటీఎం కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రకరకాల మార్గాల్లో నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. వివిధ రకాల టెక్నిక్‌లను వినియోగించి వ్యక్తుల ఏటీఎం కార్డు వివరాలు, పిన్ వంటివి సేకరించి వారి ఖాతాలు గుల్ల చేసేస్తున్నారు.

కొత్తగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికత ఎంత ప్రయోజనాన్ని చేకూరుస్తోందో.. అంతే రీతిలో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. సెక్యూరిటీ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నేరగాళ్లు కొత్త మార్గాలను వెతుక్కొంటున్నారు. ఇటీవల కాలంలో బ్యాంకు ఏటీఎం కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రకరకాల మార్గాల్లో నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఏటీఎం కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ ట్రాపింగ్, క్యాష్ ట్రాపింగ్, షోల్డర్ సర్ఫింగ్, ఫిషింగ్ వంటి టెక్నిక్‌లను వినియోగించి వ్యక్తుల ఏటీఎం కార్డు వివరాలు, పిన్ వంటివి సేకరించి వినియోగదారుల ఖాతాలు గుల్ల చేసేస్తున్నారు.
ముఖ్యంగా ఎటువంటి సెక్యూరిటీ లేని బ్యాంకు ఏటీఎంల వద్ద వ్యక్తుల ఏటీఎం కార్డులు ఏటీఎం మెషీన్లలో ఇరుక్కుపోయేలా చేసి.. వారికి సాయం చేస్తున్నట్లుగా నటిస్తూ ఇరుక్కుపోయిన కార్డు స్థానంలో నకిలీ కార్డుతో మార్చేస్తున్నారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. వీరు ఓ గ్యాంగ్ గా ఏర్పడి ఆ ఏటీఎం వద్ద పహారా కాస్తూ.. తేలికగా మోసం చేయగలం అనుకున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. వారి డెబిట్ కార్డును క్లోనింగ్ అంటే అలాంటి కార్డునే అక్కడిక్కడే క్రియేట్ చేయడం లేదా మరో కార్డుతో రిప్లేస్ చేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు.
రూ. 258 కోట్లకు పైగానే లూటీ..
కార్డు క్లోనింగ్ గురై.. రూ. వేలు, రూ. లక్షల్లో నష్టపోతున్న వారు దేశ వ్యప్తంగా ఉంటున్నారు. ఆర్‌బీఐ డేటా ప్రకారం.. 2021–22 లో కార్డ్/ఇంటర్నెట్/ ఏటీఎం/ డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన 65,893 మోసాలు రికార్డయ్యాయి. ఈ మోసాల విలువ రూ.258.61 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
సాయం చేస్తామంటూ నామం.. ఒకే రోజు రెండు ఘటనలు..
నేరగాళ్లు చేస్తున్న కార్డు క్లోనింగ్‌నకు గురై నష్టపోయిన పలువురు ఇప్పుడు బహిరంగంగా ఆ వివరాలను తెలియజేస్తున్నారు. ఒక ఏటీఎం దగ్గర తన కార్డును మోసగాళ్లు నకిలీ కార్డుతో స్వాపింగ్ చేశారని ఢిల్లీకి చెందిన ఓ జర్నలిస్ట్ వివరించారు. తన ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ డెబిట్ కార్డును ప్రభుత్వ బ్యాంక్ డెబిట్ కార్డుతో మార్చారని వెల్లడించారు. ఏటీఎం మెషిన్‌లో తన కార్డు ఇరుక్కుపోయినప్పుడు సాయం చేస్తున్న నెపంలో ఇలా చేశారని గుర్తు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కేవలం 10 నిమిషాల్లోనే మనీ విత్‌డ్రా అయినట్టు తన ఫోన్‌కు మెసేజ్ వచ్చిందని వాపోయారు. కార్డును బ్లాక్ చేయడానికి వెంటనే బ్యాంక్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసినా అది కనెక్ట్ అవడానికి ఫిర్యాదు తీసుకోడానికి చాలా ఎక్కువ సమయం పట్టిందని వివరించారు. ఒకవైపు తన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా అవుతుంటే, కార్డును డీయాక్టివేట్ చేయడానికి బ్యాంక్ ఉద్యోగులు చాలా సమయం తీసుకున్నారని ఆ ఢిల్లీ జర్నలిస్ట్ వెల్లడించారు. సంబంధిత బ్యాంకు వద్ద ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వివరించారు. ఆర్‌బీఐ అంబుడ్స్మన్ కూడా తొందరగా కేసు ఫైల్ చేయాల్సిందని పేర్కొందని అన్నారు. అయితే బ్యాంకు చోరీకి గురైన నగదును రీఫండ్ చేయలేమని చేతులెత్తేసిందని జర్నలిస్ట్ వివరించారు. ‘ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్‌లోని క్లాజ్ 16(2) (ఏ) ప్రకారం, సర్వీస్‌లో ఎటువంటి అంతరాయం లేదు. అందుకే ఫిర్యాదు రిజెక్ట్ అయ్యింది’ అనే మెసేజ్ అంబుడ్స్మన్ నుంచి వచ్చిందన్నారు.
అదే రోజు ఈస్ట్ ఢిల్లీలో ఇలాంటి సంఘటననే మరొకటి చోటు చేసుకుంది. ఈసారి ఓ హౌస్‌వైఫ్ ఇదే తరహా కార్డు మోసానికి బలయ్యారు. ఏటీఎం మెషిన్‌లో ఇరుక్కున్న తన కార్డును మోసగాళ్లు అదే బ్యాంక్ కార్డుతో రిప్లేస్ చేశారని, తన కార్డును దొంగలించి షాపింగ్ చేశారని, రూ. లక్ష వరకు నష్టపోయాక గాని కార్డును డీయాక్టివేట్ చేయలేకపోయానని ఆమె వివరించారు. ప్రజలను మోసం చేయడానికి మోసగాళ్లు కొత్త కొత్త విధానాలను ఫాలో అవుతున్నారు. కానీ, అంతే వేగంగా గ్రీవెన్స్ రిడ్రస్సల్ సిస్టమ్ పనిచేయడం లేదు.
బ్యాంకులు ఏమి చేయలేకపోతున్నాయి..
మోసానికి గురయ్యామని తెలుసుకున్నా, కార్డు హోల్డర్లు వెంటనే డెబిట్, క్రెడిట్ కార్డులను డీయాక్టివేట్ చేసుకోలేకపోతున్నారు. బ్యాంకులు కూడా ఈ ఇష్యూకి సంబంధించి ప్రత్యేకమైన లైన్‌ను కేటాయించకపోవడంతో కార్డు డీయాక్టివేషన్ ప్రాసెస్‌కు చాలా టైమ్ పడుతోంది. ఫ్రాడ్ జరిగిన తర్వాత సైబర్ క్రైమ్ బ్రాంచ్, బ్యాంక్ బ్రాంచుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదు. ‘మీ పిన్ నెంబర్‌తోనే విత్‌డ్రా జరిగిందని, మనీ రీఫండ్ కాదని’ బ్యాంకులు సమాధానమిస్తుండగా, కేసును పరిష్కరించడానికి సైబర్ క్రైమ్ బ్రాంచుల దగ్గర టైమ్ ఉండడం లేదు. వీరి దగ్గర పరిష్కారం కాని కేసులు చాలా ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు ఇన్‌వాల్వ్ అయి ఉంటే బ్యాంకుల మధ్య కో–ఆర్డినేషన్ సమస్యగా మారుతోంది.
ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయొచ్చు..
ఏదైనా బ్యాంక్/ఎన్‌బీఎఫ్ లేదా పేమెంట్ సిస్టమ్ పార్టిసిపెంట్‌పై మీ ఫిర్యాదు తిరస్కారానికి గురైనా లేదా సంబంధిత ఎంటిటీ ద్వారా మీకు సంతృప్తికర పరిష్కారం చూపకపోతే, మీరు కంప్లైంట్ మేనేజ్‌మెంట్‌సిస్టమ్ లేదా సీఎంఎస్ పోర్టల్ లేదా ఆర్‌బీఐ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.