Electric Bike: స్పోర్టీ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న ఈ-బైక్.. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 200 కిమీ.. పూర్తి వివరాలు..
దేశీయ స్టార్టప్ కంపెనీ ఓర్క్సా(Orxa) 2015లో బెంగళూరులో ప్రారంభమైంది. ఈ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ మోడల్ బైక్ ని 2019 గోవాస్ ఇండియన్ బైక్ వీక్ లో ఆవిష్కరించింది. దాని పేరు మన్‌టిస్ ఈ స్పోర్ట్స్. దీనిని 2023 జూన్ నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది.

అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై ఫోకస్ చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీలతో పాటు స్టార్టప్ లు కూడా అత్యాధునిక ఫీచర్లు, డిఫరెంట్ లుక్ తో ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. సంప్రదాయ ఇంధన ఇంజిన్ వేరియంట్లో అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లు విద్యుత్ శ్రేణిలో కూడా వస్తున్నాయి. ఇదే క్రమంలో దేశీయ స్టార్టప్ కంపెనీ ఓర్క్సా(Orxa) ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్స్ ను ఉత్పత్తి చేస్తోంది. 2015లో బెంగళూరులో ప్రారంభమైన ఈ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక స్పోర్ట్స్ మోడల్ బైక్ ని 2019 గోవాస్ ఇండియన్ బైక్ వీక్ లో ఆవిష్కరించింది. దాని పేరు మన్‌టిస్ ఈ స్పోర్ట్స్. దీనిని 2023 జూన్ నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. ఈ నేపథ్యంలో ఈ మన్‌టిస్ ఈ స్పోర్ట్స్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
బ్యాటరీ, రేంజ్..
ఈ మన్‌టిస్ ఈ స్పోర్ట్స్ బైక్ లో 18 కిలోవాట్ల సామర్థ్యంతో మోటార్ ఉంటుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. కేవలం ఎనిమిది సెకన్ల కన్నా తక్కువ సమయంలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. దీనిలో 9kwh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే సిటీ పరిధిలో అయితే 200కిలోమీటర్లు, హైవేపై అయితే 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో ఉండే 15యాంపియర్స్ చార్జర్ తో బ్యాటరీ 5.5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. అలాగే ఫాస్ట్ చార్జర్ సదుపాయంతో 2.5 గంటల్లోనే పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు.
ఫీచర్లు ఇవే..
ఈ స్పోర్ట్స్ బైక్ లో 5 అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ ప్లే ఉంటుంది. దీనిని స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. అన్ని వైపులా ఎల్ఈడీ లైటింగ్ ఇచ్చారు. మోనో షాక్, టెలిస్కోపిక్ ఫోర్క్ ఉంటుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేకులతో ఈ బైక్ వస్తుంది. అల్లాయ్ వీల్స్ ఉంటాయి. 810ఎంఎం ఎత్తు, 175 కిలోల బరువుతో ఈ బైక్ ఉంటుంది. 180ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.



ధర, లభ్యత..
ఓర్క్సా మన్ టిస్ ఈ స్పోర్ట్స్ బైక్ 2023 జూన్ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ బైక్ ధర రూ. 3 లక్షలు ఎక్స్ షోరూం ఉంటుందని అంచనా.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..