Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Investment Tips: సొంతిల్లు నిర్మించుకోవడం మీ లక్ష్యమా? మీకు 40 ఏళ్లు వచ్చే లోపే సాకారం చేసుకొనే టిప్స్ ఇవే.. అస్సలు మిస్ అవ్వొద్దు..

అటువంటి బెస్ట్ పెట్టుబడి పథకాలలో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. కాస్త రిస్క్ తో కూడుకున్నది అయినా అధిక రాబడులు దీనిలో వస్తాయి. అందుకే మీ సొంతిల్లు నిర్మించుకునేందుకు దీనిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

Best Investment Tips: సొంతిల్లు నిర్మించుకోవడం మీ లక్ష్యమా? మీకు 40 ఏళ్లు వచ్చే లోపే సాకారం చేసుకొనే టిప్స్ ఇవే.. అస్సలు మిస్ అవ్వొద్దు..
Home construction
Follow us
Madhu

|

Updated on: Jun 18, 2023 | 3:26 PM

ప్రతి ఒక్కరి చిరకాల స్వప్నం ఓ సొంత ఇల్లు కలిగి ఉండటం. చిన్నదైనా, పెద్దదైనా ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వారు ఇల్లు నిర్మించుకోవాలని ఆశపడతారు. అందుకోసం శక్తివంచన లేకుండా కష్టపడతారు. అయితే కేవలం మీరు నెలవారీ సంపాదించే జీతంతోనే అది సాధ్యం కాదు. మీరు సంపాదనను తెలివిగా వినియోగించుకోవాలి. కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. మరికొంత పెట్టుబడిని మంచి పథకాలలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీ సొంతింటి కల త్వరగా సాకారం అయ్యే అవకాశం ఉంటుంది. మీరు 20 ఏళ్ల దాటాక ఉద్యోగంలో చేరితే.. 40 ఏళ్లు వచ్చేసరికి ఓ మంచి లగ్జరీ సొంతిల్లు నిర్మించుకోవచ్చు. దానికి కావాల్సిందిల్లా చక్కని ప్లానింగ్, అలాగే దానికి తగినట్టుగా ఖర్చుల నిర్వహణ, సరైన పథకాలలో పెట్టుబడులు పెట్టడం. అటువంటి బెస్ట్ పెట్టుబడి పథకాలలో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. కాస్త రిస్క్ తో కూడుకున్నది అయినా అధిక రాబడులు దీనిలో వస్తాయి. అందుకే మీ సొంతిల్లు నిర్మించుకునేందుకు దీనిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అయితే అంతకన్నా ముందు వాటి గురించి సరైన అవగహన కలిగి ఉండటం అవసరం.

మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయండి.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు, మీరు మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని విశ్లేషించుకోవాలి. మీ ఆదాయం, ఖర్చులు, ప్రస్తుత పొదుపు వివరాలను సరిచూసుకోండి. మీ లక్ష్యాలను చేరుకునే మ్యూచువల్ ఫండ్ పథకాలను ఎంచుకునే ముందు మీ రిస్క్ టోలరెన్స్, పెట్టుబడి పరిమితిని నిర్ణయించండి. మూలధన వృద్ధి, రిస్క్ మేనేజ్‌మెంట్ మధ్య సమతుల్యతను పాటించాలి.

ఆర్థిక లక్ష్యాలను సెట్ చేసుకోండి.. స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను సెట్ చేసుకోండి. డౌన్ పేమెంట్, ఫర్నిచర్, రినోవేషన్ లేదా ఏదైనా ఇతర యాదృచ్ఛిక ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని పక్కన ఉంచండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీలో ఎంత పెట్టుబడి పెట్టాలో దీని వల్ల మీకు అర్థం అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఉత్తమ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోండి.. మీ కలల ఇంటి కోసం మీ పొదుపు లక్ష్యాలను చేరుకోవడానికి సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడం చాలా కీలకం. ఫండ్‌ను ఎంచుకునేటప్పుడు మీ రిస్క్ టోలరెన్స్, పెట్టుబడి పరిమితి, ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోండి. ఈక్విటీ ఫండ్స్‌తో దీర్ఘకాలిక మూలధన వృద్ధి సాధ్యమవుతుంది. అయితే స్థిరత్వం, సాధారణ ఆదాయాన్ని డెట్ ఫండ్స్ అందిస్తాయి. ఈ రెండు నిధులను కలపడం మరింత ప్రయోజనకరంగా ఉండవచ్చు.

ఎస్ఐపీలను వినియోగించుకోండి.. క్రమ పద్ధతిలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (ఎస్ఐపీలు) సమర్థంగా పనిచేస్తాయి. నెలవారీ లేదా త్రైమాసికం వంటి క్రమమైన వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం వల్ల రూపాయి ఖర్చు సగటు, చక్రవడ్డీ కారణంగా లాభం లభిస్తుంది. ఎస్ఐపీలు మీ పెట్టుబడులను నియంత్రిస్తాయి. అలాగే మార్కెట్ అస్థిరత ప్రభావాలను తగ్గిస్తాయి.

మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్.. డైవర్సిఫికేషన్ అనేది కీలకమైన రిస్క్ మేనేజ్‌మెంట్, రిటర్న్ స్ట్రాటజీ. అనేక మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పెట్టుబడిని విభజించండి. ఈ రకమైన డైవర్సిఫికేషన్ మీ మొత్తం పోర్ట్‌ఫోలియోపై నష్టాన్ని తగ్గిస్తుంది. ఒక మ్యూచువల్ ఫండ్ లో లాభాలు వచ్చి, మరొక దానిలో నష్టాలు వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు.

పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించాలి.. మీ డ్రీమ్ హోమ్ కోసం మీ పొదుపు లక్ష్యాలు నెరవేరుతాయని హామీ ఇవ్వడానికి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను క్రమం తప్పకుండా సమీక్షించాలి. మీ ఫండ్ పనితీరును పర్యవేక్షించాలి. మార్కెట్ ట్రెండ్‌లను గమనిస్తుండాలి. మారుతున్న మార్కెట్ పరిస్థితులు లేదా మీ మారుతున్న ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఏవైనా అవసరమైన సర్దుబాట్లు చేయాలి.

ఆర్థిక సలహాదారునితో మాట్లాడండి.. ఆర్థిక సలహాదారు మీ వ్యక్తిగత ఆర్థిక స్థితి, లక్ష్యాల కోసం మీకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించగలరు. మీ రిస్క్ ప్రొఫైల్‌ను విశ్లేషించడంలో, తగిన మ్యూచువల్ ఫండ్‌లను ఎంచుకోవడంలో , మీ కలల ఇంటిని చేరుకోవడంలో మీకు సహాయపడే పెట్టుబడి వ్యూహాన్ని అభివృద్ధి చేయడంలో ఆర్థిక సలహాదారు మీకు సహాయం చేస్తారు. వారు కాలానుగుణ సమీక్షలను కూడా నిర్వహించవచ్చు. తగిన మార్పులను సిఫార్సు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..