Best Double Door Refrigerators: ఫ్రిడ్జ్ కొనాలనుకొంటున్నారా? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
ముఖ్యంగా ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీతో కూడిన డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లకు ప్రజల నుంచి డిమాండ్ ఏర్పడుతోంది. కాస్త స్పేషియస్ గా ఉండటంతో పాటు ఐస్ చాంబర్ విడిగా ఉండటం, ధర కూడా బడ్జెట్ లోనే ఉండటంతో అందరూ డబుల్ డోర్ వైపు మొగ్గుచూపుతున్నారు.

రిఫ్రిజిరేటర్ అనేది ఇటీవల కాలంలో ప్రతి కుటుంబానికి ఓ నిత్యావసరంలా మారిపోయింది. ప్రతి ఇంటి వంటగదిలో ఇది ఉండాల్సిందే. ప్రజావసరాలకు అనుగుణంగా కంపెనీలు కూడా అనేక రకాల రిఫ్రిజిరేటర్ లను అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వీటిల్లో సింగిల్ డోర్, డబుల్ డోర్ వంటి మోడళ్లు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీతో కూడిన డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లకు ప్రజల నుంచి డిమాండ్ ఏర్పడుతోంది. కాస్త స్పేషియస్ గా ఉండటంతో పాటు ఐస్ చాంబర్ విడిగా ఉండటం ధర కూడా సింగిల్, డోర్ కి డబుల్ డోర్ కి పెద్దగా తేడా లేకపోవడంతో అందరూ డబుల్ డోర్ కి మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో లభించే బెస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ల గురించి తెలుసుకోండి..
ప్యానసోనిక్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్..
ఈ 260లీటర్ల డబుల్ డోర్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ మోడ్రన్ హౌస్ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. రెండు లేదా ముగ్గురు ఉండే కుటుంబాలకు సరిగ్గా సరిపోతుంది. ఇది ఏజీ క్లీన్ టెక్నాలజీతో వస్తుంది. 99శాతం మౌల్డ్ బ్యాక్టీరియా ను తొలగిస్తుంది. దీనిలో స్థిరమైన టెంపరేచర్ మెయింటేన్ అవుతుంది. కూరగాయల కోసం 30 లీటర్ల స్థలం ఉంటుంది. దీనిలో షెల్ఫ్ లు కఠినమైన ట్యాపర్డ్ గ్లాస్ తో వస్తుంది. ఇది 100కేజీల వరకూ బరువును మోస్తుంది. దీని ధర రూ. 26,990గా ఉంటుంది.
ఎల్‌జీ 3 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్..
ఎల్ జీ నుంచి వస్తున్న ఈ 242 లీటర్ల రిఫ్రిజిరేటర్ ఎక్కువ సేపు ఆహార పదార్థాలను ఫ్రెష్ గా ఉంచడానికి సాయపడుతుంది. దీనిలో ఆహార పదార్థాలు పెట్టుకునేందుకు 181లీటర్ల స్పేస్ ఉంటుంది. ఫ్రీజర్ కోసం 61 లీటర్ల స్థలం కేటాయించారు. దీనిలో 90 నిమిషాల్లో ఐస్ ను తయారు చేసే జెట్ ఐస్ టెక్నాలజీ ఉంటుంది. దీని ధర రూ 24,990గా ఉంది.
శామ్సంగ్ 2 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్..
ఈ శామ్సంగ్ 236 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మన దేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ మోడల్స్ లో ఒకటి. డిజిటల్ ఇన్వెర్టర్ కంప్రెషర్ ఆటోమేటిక్ గా స్పీడ్ ని మోడిఫై చేస్తుంది. దీనిలో షెల్ఫ్ లు 175 కేజీల బరువును మోయగలుగుతుంది. దీని ధ రూ. 22,890గా ఉంది.
వర్ల్ పూల్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్..
242 లీటర్ల సామర్థ్యంతో వస్తున్న ఈ రిఫ్రిజిరేటర్ మన దేశంలోని బెస్ట్ మోడళ్లలో ఒకటి. దీనిలో ఐదు రకాల మోడ్లు ఉంటాయి. లోపల లోడ్ ని బట్టి టెంపరేచర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలో హానీ కాంబ్ మాయిశ్చర్ లాక్ టెక్నాలజీని వినియోగించారు. దీని ధర 28,170గా ఉంది.
టూషీబా డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్..
661లీటర్ల ఈ టూషీబా రిఫ్రిజిరేటర్ లో ఆటోమేటిక్ ఐస్ మేకర్ ఉంటుంది. ఇది పెద్ద కుటుంబాలకు కూడా సరిపోతుంది. కొన్ని కూరగాయల నుంచి వచ్చే ఇథిలీన్ ను ఎల్ఈడీ హై బ్రీడ్ డియోడోరైజర్ టెక్నాలజీ ద్వారా తొలగిస్తుంది. ఎల్ఈడీ లైట్లు రెండు ఫోటో క్యాటలిస్ట్ లుగా ఉపయోగపడతాయి. దీని ధర రూ. 75,490గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..