Indian Railway: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. పండుగ వేళ.. రైళ్లలో వాటిని తీసుకెళ్తే రూ.1000 జరిమానా
దీపావళి పండుగ నేపథ్యంలో రైల్వే ప్రయాణాలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. ట్రైన్‌లలో ప్రయాణించేప్పుడు ప్రయాణీకులు భద్రతకు, రైల్వే ఆస్తులకు నష్టం వాటించే మండే స్వభావం గల వస్తువులు ,పేలుడు పదార్దాలను తీసుకెళ్లొద్దని హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత వస్తువును ట్రైన్‌లో తీసుకెళ్తే రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.1000 వరకు జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ విధిస్తారని అధికారులు తెలిపారు

దీపావళి పండుగ నేపథ్యంలో రైల్వే ప్రయాణాలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. ట్రైన్‌లలో ప్రయాణించేప్పుడు ప్రయాణీకులు భద్రతకు, రైల్వే ఆస్తులకు నష్టం వాటించే మండే స్వభావం గల వస్తువులు ,పేలుడు పదార్దాలను తీసుకెళ్లొద్దని హెచ్చరించింది. రైళ్లలో లేదా స్టేషన్లలో అటువంటి వస్తువులను తీసుకెళ్లడం వలన భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని.. ఇది చుట్టుపక్కల ఉన్న ప్రయాణీకులందరికీ అత్యంత ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు.
రైలులో మండే, పేలుడు స్వభావం గల వస్తువులను తీసుకెళ్లడం రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164 మరియు 165 ప్రకారం రూ.1000 వరకు జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ విధించదగిన నేరమని అధికారులు చెబుతున్నారు. కాబట్టి రైల్వేశాఖ నిషేదాలను దృష్టిలో ఉంచుకొని రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణంలో బాణసంచా లేదా ఇతర పేలుడు, మండే స్వభావం గల వస్తువులను లగేజీ, పార్శిల్‌గా తీసుకెళ్లవద్దని ప్రయాణికులకు రైల్వేశాఖ హెచ్చరిస్తోంది.
ప్రజా భద్రత దృష్ట్యా, రైళ్లలో లేదా స్టేషన్లలో బాణసంచా లేదా ఏదైనా ఇతర అనుమానాస్పద, ప్రమాదకరమైన పేలుడు , స్వభావం గల పదార్థాలను గమనించినట్లయితే, రైల్వే వారు అవసరమైన చర్యలను తీసుకునే నిమిత్తం వెంటనే సమీపంలోని రైల్వే సిబ్బందికి తెలియజేయవచ్చు లేదా భద్రతా హెల్ప్‌లైన్ -139 కాల్ చేయగలరని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




