HDFC Bank: వచ్చే వారం ఆ బ్యాంకు సేవలకు తీవ్ర అంతరాయం.. ఏకంగా 12 గంటల పాటు సేవల నిలిపివేత
అన్ని బ్యాంకులు కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతర సేవలను అందిస్తున్నాయి. కానీ బ్యాంకుల సైట్స్ నిర్వహణకు కూడా వీలు ఇవ్వకుండా సేవలను ఖాతాదారులు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ నిర్వహణ నిమిత్తం వచ్చే వారం బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందని ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారుల బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రాబోయే సిస్టమ్ అప్‌గ్రేడ్ గురించి తెలియజేసింది.
భారతదేశంలో ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగం కీలక వృద్ధిని సాధించింది. ప్రతి ఒక్కరికీ రెండు నుంచి మూడు బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రజలు నగదు లావాదేవీలకు పూర్తిగా బ్యాంకులపై ఆధారపడిపోయారు. అన్ని బ్యాంకులు కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతర సేవలను అందిస్తున్నాయి. కానీ బ్యాంకుల సైట్స్ నిర్వహణకు కూడా వీలు ఇవ్వకుండా సేవలను ఖాతాదారులు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ నిర్వహణ నిమిత్తం వచ్చే వారం బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందని ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారుల బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రాబోయే సిస్టమ్ అప్‌గ్రేడ్ గురించి తెలియజేసింది. ఈ అప్‌గ్రేడ్ పనితీరు వేగాన్ని మెరుగుపరుస్తుంది. అధిక ట్రాఫిక్‌ను నిర్వహించడానికి సాయం చేస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డౌన్‌టైమ్ గురించి కీలక వివరాలను తెలుసుకుందాం.
నిర్వహణ సమయంలో యొక్క కొన్ని ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. సిస్టమ్ నిర్వహణ జూలై 13, శనివారం ఉదయం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు పూర్తవుతుందని భావిస్తున్నారు. ఖాతాదారుల అసౌకర్యాన్ని తగ్గించడానికి మేము ఈ అప్‌గ్రేడ్‌ని రెండో శనివారం, బ్యాంక్ సెలవుదినం రోజున షెడ్యూల్ చేశామని ఆ ప్రకటనలో తెలిపారు. కాబట్టి ఖాతాదారులు బ్యాంకింగ్ కార్యకలాపాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అయితే నిర్వహణ సమయంలో కొన్ని సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. నగదు ఉపసంహరణ విషయంలో ఎలాంటి అసౌకర్యం ఉండదని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. షాపింగ్ సమయంలో కార్డుల ద్వారా చెల్లింపులకు అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. అయితే యూపీఐ ద్వారా చెల్లింపులు సజావుగా ఉన్నప్పటికీ జూలై 13, శనివారం ఉదయం 3:00 నుండి 3:45 వరకు, 9:30 నుండి 12:45 వరకు అందుబాటులో ఉండదని పేర్కొన్నారు.
ముఖ్యంగా కార్డు నిర్వహణ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కార్డ్‌ని హాట్‌లిస్ట్ చేయడం, పిన్‌ను రీసెట్ చేయడం, ఇతర కార్డ్-సంబంధిత కార్యకలాపాలను కొనసాగించవచ్చు. ముఖ్యంగా వ్యాపారులు కార్డ్‌ల ద్వారా చెల్లింపులను స్వీకరించవచ్చు. అయితే, అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత మాత్రమే ఖాతాకు అప్‌డేట్‌లు అందుబాటులో ఉంటాయి. నిర్వహణ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారులు యూపీఐ విషయంలో డబ్బును రిక్వెస్ట్ చేయలేరని హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే బ్యాలెన్స్ విచారణ, క్యూఆర్ చెల్లింపుల్లో కూడా ఇబ్బంది ఎదురుకావచ్చని తెలిపారు. కాబట్టి జులై 12న రాత్రి 7:30 గంటలకు ముందుగా తగినన్ని నిధులను విత్‌డ్రా చేసుకోవాలని కస్టమర్‌లందరికీ హెచ్‌డీఎఫ్‌సీ సూచించింది. షెడ్యూల్ చేసిన నిర్వహణ వ్యవధిలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారి ఫండ్ బదిలీలన్నింటినీ ప్లాన్ చేసుకోవాలని కోరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..