AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget-2024: మరింత చవకగా హెల్త్ ఇన్సూరెన్స్? ఊరిస్తున్న నిర్మలమ్మ బడ్జెట్..

ముఖ్యంగా ఆరోగ్య బీమా ప్రీమియంలపై ప్రస్తుతం అందిస్తున్న తగ్గింపు పరిమితి సరిపోదని, ప్రత్యేకించి పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఈ రంగం మనుగడకు ప్రోత్సాహాలు అందించాలని కోరుతోంది. ఇతర వ్యక్తులపై ఆధారపడినవారు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల కోసం మినహాయింపు పరిమితిలో గణనీయమైన పెరుగుదలను ఈ రంగం అంచనా వేస్తోంది.

Budget-2024: మరింత చవకగా హెల్త్ ఇన్సూరెన్స్? ఊరిస్తున్న నిర్మలమ్మ బడ్జెట్..
Health Insurance
Madhu
|

Updated on: Jul 05, 2024 | 3:22 PM

Share

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే కొత్త బడ్జెట్ 2024 కోసం అన్ని రంగాలు ఆసక్తిగా ఎదరుచూస్తున్నాయి. కొన్ని రంగాల్లోని నిపుణులు ఇప్పటికే బడ్జెట్లో అవి ఉండొచ్చు.. ఇవి ఉండాలి అంటూ తమ సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో హెల్త్ ఇన్సురెన్స్(ఆరోగ్య బీమా) సెక్టార్ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్ పై చాలా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా తమ పరిశ్రమ విస్తరణకు, పౌరుల ఆర్థిక భద్రతకు కొన్ని కీలకమైన చర్యలు తీసుకుంటుందని నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా ప్రీమియంలపై ప్రస్తుతం అందిస్తున్న తగ్గింపు పరిమితి సరిపోదని, ప్రత్యేకించి పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఈ రంగం మనుగడకు ప్రోత్సాహాలు అందించాలని కోరుతోంది. ఇతర వ్యక్తులపై ఆధారపడినవారు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల కోసం మినహాయింపు పరిమితిలో గణనీయమైన పెరుగుదలను ఈ రంగం అంచనా వేస్తోంది. ఇది ఆరోగ్య బీమాను మరింత సరసమైనదిగా చేస్తుందని తద్వారా బీమా రంగం వృద్ధి కారణమవుతుందని చెబుతోంది. ఈ క్రమంలో ఆరోగ్య బీమా రంగం అంచనా వేస్తున్న ప్రధాన అంశాలను నిపుణులు అందిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చేతి ఖర్చులను తగ్గించడం.. బీమా తీసుకున్నప్పటికీ ఆస్పత్రుల్లో వ్యక్తుల చేతుల నుంచి మళ్లీ కొంత మొత్తం ఖర్చువుతోంది. దీనిని తగ్గించడం కీలకం. ప్రస్తుతం, ఈ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తోంది.

2047 నాటికి అందరికీ బీమా.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి శతాబ్దికాలం పూర్తయినందున, 2047 నాటికి అందరికీ బీమాను సాధించాలనే లక్ష్యంతో ఐఆర్డీఏఐ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్నారు.

జీఎస్టీ భారాన్ని తగ్గించడం.. ఆరోగ్య బీమా వంటి ముఖ్యమైన సేవలపై ప్రస్తుత 18% జీఎస్టీ రేటు ఉంది. దీనిని తగ్గించాలని నిపుణులు కోరుతున్నారు. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను ఎదుర్కోవడానికి కష్టపడుతున్న మధ్య-ఆదాయ, సీనియర్ సిటిజన్ విభాగాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని వివరిస్తున్నారు.

పన్ను ప్రయోజనాలు.. ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడంపై పన్ను ప్రయోజనాలను అందించడం ద్వారా ఎక్కువ మంది వీటివైపు చూసే అవకాశం ఉంటుంది. సెక్షన్ 80డి పన్ను మినహాయింపు ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉండాలి. కాలానుగుణంగా సవరణ జరగాలి. పన్ను మినహాయింపుల కోసం ప్రస్తుతం ఉన్న రూ. 1 లక్ష పరిమితిని పెంచడం వల్ల ఎక్కువ మంది ఆరోగ్య బీమాను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పాలసీదారులు 60 ఏళ్లలోపు వారికి రూ. 25,000, 60 ఏళ్లు పైబడిన వారికి రూ. 50,000 వరకు తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. ఈ పరిమితులను రూ. 50,000, రూ. 1 లక్షకు పెంచడం వల్ల వృద్ధ తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

యూనివర్సల్ హెల్త్ స్కీమ్.. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ను మరింత పక్కగా అమలు చేయాలి. మల్టీ-స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రుల భాగస్వామ్యం చేయాలి. అర్హులైన బీపీఎల్ కుటుంబాలకు మెరుగైన వైద్యాన్ని అందించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..