Indian Railways: భారతీయ రైల్వే మరో ఘనత.. భారీ టార్గెట్‌కు చేరువలో..
ఓ కీలక ప్రకటన రైల్వే మంత్రిత్వ శాఖ చేసింది. మన దేశంలోని రైల్వే లైన్లు త్వరలోనే 100శాతం ఎలక్ట్రిఫై అవుతాయని వివరించింది. పూర్తిస్థాయిలో ఎలక్ట్రిఫికేషన్ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందని పేర్కొంది. మిషన్ 100% ఎలక్ట్రిఫికేషన్లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం లక్ష్యానికి చేరువగా ఉన్నట్లు ప్రకటించింది. #MissionNetZeroCarbonEmission" అని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది.
భారతీయ రైల్వే.. మన దేశంలో రవాణా వ్యవస్థల్లో అతి పెద్దది, అత్యంత కీలకమైనది. లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు ఈ వ్యవస్థ చేర్చడంతో పాటు సరుకు రవాణాలో చాలా ప్రాధాన్య పాత్రను పోషిస్తోంది. ఈ వ్యవస్థలో కొత్త సంస్కరణలను రైల్వే శాఖ చేస్తూ కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఈక్రమంలో ఓ కీలక ప్రకటన రైల్వే మంత్రిత్వ శాఖ చేసింది. మన దేశంలోని రైల్వే లైన్లు త్వరలోనే 100శాతం ఎలక్ట్రిఫై అవుతాయని వివరించింది. పూర్తిస్థాయిలో ఎలక్ట్రిఫికేషన్ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందని పేర్కొంది. మిషన్ 100% ఎలక్ట్రిఫికేషన్లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం లక్ష్యానికి చేరువగా ఉన్నట్లు ప్రకటించింది. #MissionNetZeroCarbonEmission” అని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది.
भारतीय रेल जल्द हासिल करने वाली है #Mission100PercentElectrification का लक्ष्य।#MissionNetZeroCarbonEmission pic.twitter.com/uo6s17oXP1
— Ministry of Railways (@RailMinIndia) July 2, 2024
ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుదీకరణ ప్రాజెక్టుల కోసం మధ్యంతర బడ్జెట్‌లో రూ.6,500 కోట్లు కేటాయించారు. పూర్తిగా విద్యుదీకరించిన తర్వాత, భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ రైల్వే వ్యవస్థగా ర్యాంక్ పొందుతాయి. భారతదేశంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికే పూర్తి విద్యుదీకరణను సాధించాయి.
డీజిల్ టు ఎలక్ట్రిక్..
2014 నుంచి రైల్వేలు విద్యుదీకరణ కోసం రూ.46,425 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ల వైపు చెప్పుకోదగ్గ మార్పుతో డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ ఇంజిన్‌లకు మారడం కొనసాగుతోంది. డిసెంబర్ 2023 నాటికి, భారతీయ రైల్వేలు 10,238 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను, 4,543 డీజిల్ లోకోమోటివ్‌లను నడుపుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే, రైల్వేలు అహ్మదాబాద్-రాజ్‌కోట్-ఓఖా (499 కిమీ), బెంగళూరు-తాల్‌గుప్పా (371 కిమీ), భటిండా-ఫిరోజ్‌పూర్-జలంధర్ (301 కిమీ) వంటి మార్గాలతో సహా 7,188 కిలోమీటర్ల రైలు నెట్‌వర్క్‌ను విద్యుదీకరించింది. విద్యుత్ ట్రాక్షన్‌కు ఈ మార్పు 2027-28 నాటికి కార్బన్ ఉద్గారాలను 24% తగ్గించగలదని అంచనా.
2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి భారతీయ రైల్వేలు బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో 40,000 రూట్ కిలోమీటర్లకు పైగా విద్యుదీకరించింది. 2014కి ముందు అన్ని సంవత్సరాల్లో విద్యుద్దీకరించబడిన 2,180 కి.మీ కంటే గణనీయమైన పెరుగుదల. భారతీయ రైల్వేలు 2030 నాటికి సున్నా కార్బన్ ఉద్గారాలతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ రైల్వేగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగానే అనేక సంస్కరణలను ప్రారంభించింది. అవి సత్ఫలితాలనే అందిస్తున్నాయి. ఇదే క్రమంలో కొనసాగితే అనుకున్న లక్ష్యం సులభంగానే అందుకునే వీలుంది.
అంతేకాక భారతీయ రైల్వే ఆధునిక సాంకేతికతను కూడా అందిపుచ్చుకుంటోంది. అత్యాధునిక సదుపాయాలతో వందే భారత్ రైళ్లు కొత్త దిశను మన రైల్వేకు చూపించాయి. విశేష జనాదరణను సొంతం చేసుకుని, దిగ్విజయంగా ముందుకు సాగుతున్నాయి. రానున్న కాలంలో మరిన్ని సంస్కరణల దిశగా మన రైల్వే ముందుకు సాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..