AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Electric Scooter: వరద నీటిలో సబ్ మెరైన్‌లా దూసుకెళ్లిన ఓలా స్కూటర్.. చివరికి ఇలా అయ్యిందేంటి?

గుజరాత్‌లోని వడోదరలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు నీటితో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఓ యువకుడు అనూహ్యంగా పరీక్షించాడు. స్కూటర్ హెడ్‌లైట్ మాత్రమే నీటి పైకి కనిపిస్తోంది. మిగిలిన స్కూటర్ మొత్తంలో నీటిలో మునిగి ఉంది. అయినప్పటికీ అది ఎంచక్కా వెళ్లగలిగింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Ola Electric Scooter: వరద నీటిలో సబ్ మెరైన్‌లా దూసుకెళ్లిన ఓలా స్కూటర్.. చివరికి ఇలా అయ్యిందేంటి?
Ola Ev In Flooded Street
Madhu
|

Updated on: Jul 05, 2024 | 3:47 PM

Share

లాంగ్ సమ్మర్ ఎట్టేకేలకు ముగిసింది. వరుణిడి రాకతో అంతా సాంత్వన పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో సాధారణంగా రోడ్లు జలమయం అవుతూ ఉంటాయి. ఆ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ రోడ్డు ఉందో.. ఎక్కడ గొయ్యి ఉందో అర్థం కాదు. పైగా బండి ఇంజిన్ లోపలికి వర్షం నీరు వెళ్లిందంటే అంతే సంగతులు. అందుకే వర్షాలు, వరదల సమయంలో వాహనాల విషయంలో జాగ్రత్త వహించాల్సిందే. అయితే ఇలాంటి వరదల సమయంలో ఓ ఔత్సాహిక యువకుడు తన ఎలక్ట్రిక్ స్కూటర్ తో ప్రయోగం చేశాడు. దాదాపు వరద నీటిలో మునిగిపోయిన ద్విచక్ర వాహనంపై రైడ్ చేసుకుంటూ వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

గుజరాత్‌లోని వడోదరలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు నీటితో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఓ యువకుడు అనూహ్యంగా పరీక్షించాడు. స్కూటర్ హెడ్‌లైట్ మాత్రమే నీటి పైకి కనిపిస్తోంది. మిగిలిన స్కూటర్ మొత్తంలో నీటిలో మునిగి ఉంది. అయినప్పటికీ అది ఎంచక్కా వెళ్లగలిగింది. వాస్తవానికి సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్లలో సైలెన్సర్ ఉంటుంది. దాని ద్వారా ఇంజిన్ నుంచి పొగ బయటకు వెళ్తుంది. అయితే ఈవీల్లో ఉండదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత వరద నీటిలోనూ వెళ్లగలిగింది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయయడంతో అప్పటి నుంచి 2 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. ఇది వరదలతో నిండిన వీధిలో దాదాపు పూర్తిగా ఈవీని రైడ్ చేస్తున్న రైడర్‌ని చూపిస్తుంది.

ఇది సురక్షితమేనా?

స్కూటర్ పూర్తిగా మునిగిపోయినప్పటికీ.. అది సురక్షితంగా జలమార్గాలను దాటింది. అయితే, ఇలాంటి ప్రయత్నం చేయడం నిజంగా సురక్షితమేనా? అని ఆలోచిస్తే.. వాహనం రకంతో సంబంధం లేకుండా సాధారణంగా వరద నీటిలో ఇలా ప్రయాణించడం వల్ల కోరి ప్రమాదాలను తెచ్చుకున్నట్లు ఉంటుంది. అవేంటో ఓ సారి చూద్దాం..

విద్యుత్ షాక్.. సాధారణంగా బాగా సీల్ చేయబడినప్పటికీ, బ్యాటరీ ప్యాక్‌లు పూర్తిగా జలనిరోధితమైనవి కావు. డీప్ వాటర్ ఎక్స్‌పోజర్ వల్ల తుప్పు, విద్యుత్ సమస్యలు వస్తాయి. మరింత తీవ్రమైన సందర్భాల్లో విద్యుత్ షాక్‌ కూడా తగలొచ్చు. అగ్ని ప్రమాదాలకు కారణమవ్వొచ్చు.

మోటారుకి దెబ్బ.. కొన్ని సందర్భాల్లో, నీటి లోతు కంటే, నీటిలో గడిపిన సమయం ఆందోళన కలిగించే అంశం. ఎక్కువసేపు నీటికి గురికావడం వల్ల మోటారుకు గణనీయమైన నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఫలితంగా ఖరీదైన మరమ్మతులు అవసరం అవుతాయి.

కనపబడని ప్రమాదాలు.. వరదలతో నిండిన వీధులు తరచుగా గుంతలు లేదా స్వర్ కవర్లు వంటి కనిపించని ప్రమాదాలను దాచిపెడతాయి. నీటి అడుగున వీటిని ఢీకొట్టడం వల్ల స్కూటర్ అండర్ క్యారేజ్, మోటారుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కొన్నిసార్లు, అవి పెద్దవిగా ఉంటే, అది స్కూటర్‌తో పాటు రైడర్‌ను పూర్తిగా ముంచెత్తుతుంది, ఇద్దరి భద్రతను తీవ్ర ప్రమాదంలో పడేస్తుంది.

వారంటీ కష్టాలు.. తయారీదారు వారెంటీలు సాధారణంగా నిర్లక్ష్యపు రైడింగ్, నీటి ప్రవేశం వల్ల కలిగే నీటి నష్టాన్ని కవర్ చేయవు. వీడియోలో వలె ఉద్దేశపూర్వకంగా చేసిన సందర్భాల్లో ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..