SCSS Scheme: వృద్ధులకు ఆ పథకంతో ఆర్థిక భద్రత.. నిబంధనలు ఏంటంటే..?
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన రాబడి ఉన్నప్పుడే భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తూ ఉంటారు. కాబట్టి పదవీ విరమణ తర్వాత సౌకర్యవంతమైన జీవనానికి తగినంత నిధులు కలిగి ఉండాలి. ఇలాంటి వారికి కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పథకంలో భారతదేశంలో ఏళ్లుగా ఆదరణ పొందుతుంది. ఇది ప్రభుత్వ మద్దతుతో వచ్చే పథకం కాబట్టి చాలా సురక్షితమైనదిగా పరిగణిస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన రాబడి ఉన్నప్పుడే భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తూ ఉంటారు. కాబట్టి పదవీ విరమణ తర్వాత సౌకర్యవంతమైన జీవనానికి తగినంత నిధులు కలిగి ఉండాలి. ఇలాంటి వారికి కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పథకంలో భారతదేశంలో ఏళ్లుగా ఆదరణ పొందుతుంది. ఇది ప్రభుత్వ మద్దతుతో వచ్చే పథకం కాబట్టి చాలా సురక్షితమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎస్ఎస్ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఖాతాను 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న తెరవవచ్చు. ఒకవేళ 55 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్యన ఉన్న వ్యక్తులు ప్రత్యేక వీఆర్ఎస్ స్కీమ్ కింద పదవీ విరమణ చేసిన వ్యక్తి ఎస్‌సీఎస్ఎస్ ఖాతాను తెరవవచ్చు. డిఫెన్స్ సర్వీసెస్‌కు సంబంధించిన రిటైర్డ్ సిబ్బంది (సివిలియన్ డిఫెన్స్ ఉద్యోగులు మినహా) ఇతర పేర్కొన్న షరతుల నెరవేర్పుకు లోబడి యాభై సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత కూడా ఖాతాను తెరవవచ్చు. డిపాజిటర్ వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో సంయుక్తంగా ఖాతాను తెరవవచ్చు. ఎస్‌సీఎస్ఎస్ ఖాతాను సీనియర్ సిటిజన్ బ్యాంకు లేదా పోస్టాఫీసులో తెరవవచ్చు. ఖాతాను తెరవడానికి కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ. 30 లక్షల డిపాజిట్‌తో ఖాతాను ప్రారంభించవచ్చు.
ఎస్‌సీఎస్ఎస్ డిపాజిట్లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి. సెప్టెంబర్ 30, 2024తో ముగిసే త్రైమాసికంలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు సంవత్సరానికి 8.2 శాతం త్రైమాసిక ప్రాతిపదికన చెల్లిస్తారు. వడ్డీ డిపాజిట్ తేదీ నుండి మార్చి 31, 30 జూన్, 30 సెప్టెంబర్, 31 డిసెంబర్ వరకు ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి మొదటి వర్కింగ్ డే రోజున చెల్లిస్తారు. ఎస్‌సీఎస్ఎస్ ఖాతా తెరిచిన తేదీ నుంచి 5 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత ఖాతాను మూసివేయవచ్చు. డిపాజిటర్ ఖాతాను మరో 3 సంవత్సరాల పాటు పొడిగించవచ్చు. కొన్ని షరతులకు లోబడి అకాల మూసివేత అనుమతిస్తారు. ఎవరైనా ఈ ఖాతాలో సుమారు రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే వారు రూ. 2.46 లక్షల వార్షిక వడ్డీని పొందుతారు. అంటే దాదాపు నెలకు దాదాపు రూ. 20,000 వడ్డీ పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..