Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI ATM New Rule: మనీ విత్‌డ్రా మోసాలకు ఓటీపీతో చెక్.. ఎలా ఉపయోగించాలో తెలుసా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంల నుంచి ఓటీపీ (OTP)లను కూడా ఉపయోగించి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. దీంతో ఏటీఎంలలో జరిగే మోసాల బారి నుంచి మనం సేఫ్‌గా ఉండొచ్చు.

SBI ATM New Rule: మనీ విత్‌డ్రా మోసాలకు ఓటీపీతో చెక్.. ఎలా ఉపయోగించాలో తెలుసా?
Sbi Fraud Alert
Follow us
Venkata Chari

|

Updated on: Oct 27, 2021 | 3:43 PM

SBI ATM New Rule: దేశవ్యాప్తంగా ఏటీఎంలలో జరిగే మోసాలు సర్వసాధారణంగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఏటీఎం కార్డ్ వినియోగదారులను ఇలాంటి ట్రాప్‌లో పడకుండా రక్షించడానికి ఓ చక్కని పరిష్కారం తీసుకొచ్చింది. దీంతో భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏటీఎంలో జరిగే నేరాలను తగ్గించాలని లక్ష్యంగా ఇలాంటి కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. ఇది తమ ఖాతాదారులకు వారి ఆర్థిక అవసరాలతోపాటు ఇలాంటి నేరాల నుంచి రక్షించేందుకు భద్రతతో కూడిన ఆఫ్షన్‌లను తీసుకొచ్చింది.

మెరుగైన భద్రతలో భాగంగా ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏటీఎంల నుంచి ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ చేసుకునే పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని కింద, బ్యాంక్ అదనపు సెక్యూరిటీని డెబిట్ కార్డు యూజర్లకు అందిస్తోంది. దీని ద్వారా ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసే ఖాతాదారులు వారి మొబైల్ ఫోన్‌లలో ఓటీపీని అందుకుంటారు. కార్డు యూజర్లకు వచ్చిన ఏటీఎంను కన్ఫాం చేసిన తరువాతే వారు తమ డబ్బును విత్‌డ్రా చేసుకోగలుగుతారు.

ఈ మేరకు అక్టోబర్ 24, శనివారం నాడు ట్విట్టర్‌లో బ్యాంక్ కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. “ఎస్‌బీఐ ఏటీఎంలలో లావాదేవీల కోసం మా ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థతో మోసగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది” అని ఎస్‌బీఐ తెలిపింది. “మోసాల నుంచి మిమ్మల్ని రక్షించడం మా బాధ్యత” అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో ఒక చిన్న వీడియో కూడా ఉంది.

ఎలా పని చేస్తుంది? అయితే ఓటీపీ ఆఫ్షన్‌ను 2020లోనే బ్యాంక్ ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం మరో మెట్టు ఎక్కింది. ఓటీపీ వ్యవస్థలో మరిన్ని మార్పులు చేర్చి వినియోగదారులకు అందించింది. కార్డు వినియోగదారులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపిస్తోంది. ఓటీపీని కన్ఫాం చేయకపోతే మాత్రం ఎవరూ ఏటీఎం నుంచి డబ్బును విత్‌డ్రా చేయలేరు.

ఓటీపీ సేవలను ఎలా పొందాలి? మీ ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి మీ ఎస్‌బీఐ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే ఈ సేవలను వాడుకోగలరు. ఇతర ఏటీఎంలను ఉపయోగిస్తుంటే మాత్రం ఈ సదుపాయాన్ని పొందలేరు. ఎందుకంటే ఈ వ్యవస్థ నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (NFS)లో లేదు.

ఎలా ఉపయోగించాలి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓటీపీ సదుపాయాన్ని ఉపయోగించేందుకు ఇలా చేయండి. ఎస్‌బీఐ ఏటీఎంలో మీకార్డును ఉపయోగిస్తున్నప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ మీ ఫోన్‌కు వచ్చిన తరువాత ఏటీఎంలో ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడే మీరు ఏటీఎం నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోగలరు.

ఎస్‌బీఐ దేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్యాంకు గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 5 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. బ్యాంక్ రూ. 75,937 కోట్ల ఆటో లోన్ బుక్‌ను కలిగి ఉంది. డిసెంబర్ 31, 2020 నాటికి, బ్యాంక్ రూ. 35 లక్షల కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్ బేస్‌ను కలిగి ఉంది. సీఏఎస్‌ఏ నిష్పత్తి 45 శాతంతో రూ. 26 లక్షల కోట్ల కంటే ఎక్కువ అడ్వాన్సులను కలిగి ఉంది.

ఎస్‌బీఐ గృహ రుణాలలో 34 శాతానికి పైగా మార్కెట్ వాటాను, వాహన రుణాల విభాగంలో 33 శాతానికి పైగా ఉంది. బ్యాంక్ భారతదేశంలో దాదాపు 58,000 ఏటీఎం/ సీడీఎం నెట్‌వర్క్‌తో 22,000 కంటే ఎక్కువ శాఖలను కలిగి ఉంది. మొత్తం 71,000 కంటే ఎక్కువ ఔట్‌లెట్‌లను కలిగి ఉంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న కస్టమర్ల సంఖ్య వరుసగా 85 మిలియన్లు, 19 మిలియన్లుగా ఉంది.

Also Read: PM Kisan scheme: రైతులకు గమనిక..! పీఎం కిసాన్‌ పథకంలో చేరాలంటే ఇప్పుడు ఈ కార్డు తప్పనిసరి..

Jio Fuel Station: రిలయన్స్‌ ఇండస్ట్రీ మరో సంచలనం.. పెట్రోల్‌ బంక్‌ల వ్యాపారంలోకి అడుగు పెట్టిన జియో..!