SBI Festival Offer: కారు కొనాలనుకుంటున్నారా? పండగ సీజన్ లో ఎస్బీఐ బంపర్ ఆఫర్.. ఏమిటంటే..
దసరా పండుగ వస్తోంది. చాలామంది కారు కొనాలని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు కార్ల డీలర్లు మంచి మంచి ఆఫర్లు ఇస్తారు. పండుగ సీజన్ లో కారు కొనడం చౌకైనదిగా ఉంటుంది.

SBI Festival Offer: దసరా పండుగ వస్తోంది. చాలామంది కారు కొనాలని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు కార్ల డీలర్లు మంచి మంచి ఆఫర్లు ఇస్తారు. పండుగ సీజన్ లో కారు కొనడం చౌకైనదిగా ఉంటుంది. కంపెనీ ఇచ్చే డిస్కౌంట్.. కారుతో పాటు వచ్చే డిస్కౌంట్ కాకుండా డీలర్లు కూడా డిస్కౌంట్ ఇస్తారు. ఇదే కాకుండా బ్యాంకులు కూడా వాహనాల రుణాలపై పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకుని వాహనాలు కొనాలనుకునే వారికోసం ప్రత్యెక ఆఫర్లు ప్రకటిస్తాయి. అందుకే ఎప్పుడూ దసరా, దీపావళి సీజన్ ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికీ లాభాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది.
మీరు ఈ పండుగ సీజన్‌లో కారు కొనాలని ఆలోచిస్తుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మీ కోసం ప్రత్యేక ఆఫర్‌ని అందించింది. ఎస్బీఐ కార్ లోన్ వడ్డీ రేటుపై డిస్కౌంట్ అందిస్తోంది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజును కూడా మినహాయించింది.
This festive season drive home your dream car.
Deals on wheels brings you exciting offers on car loans through YONO.
Click here: https://t.co/YibUVRB2OS#SBI #Offers #CarLoan #Discounts #SBI #YONOOffers #DealsOnWheels #YONO pic.twitter.com/rqwpD0MWgo
— State Bank of India (@TheOfficialSBI) October 2, 2021
ఎస్బీఐ చెబుతున్న దాని ప్రకారం, యోనో యాప్ బెనిఫిట్ ప్లాన్ నుండి దరఖాస్తు చేసుకోవడం ద్వారా వడ్డీ రాయితీ లభిస్తుంది. కస్టమర్ యోనో (Yono) యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, అతనికి లేదా ఆమెకు 0.50% వడ్డీ రేటు తగ్గిస్తారు. ఇది కాకుండా, కస్టమర్ ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ కారు యొక్క ఆన్ -రోడ్ ధరలో 90% వరకు రుణాలను అందిస్తోంది.
7.25% వద్ద
ఎస్బీఐ కార్ల రుణం 7.75% నుండి ప్రారంభమవుతుంది. కానీ మీరు ఈ ఆఫర్ కింద రుణం తీసుకుంటే, మీకు 7.25% వడ్డీ రేటు లభిస్తుంది. మీరు 3 నుండి 7 సంవత్సరాల కాలపరిమితితో రుణం తీసుకోవచ్చు.
ఈ బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి
బ్యాంక్ | వడ్డీ రేటు (%) |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 7.05 |
IDBI బ్యాంక్ | 7.40 |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 7.40 |
యాక్సిస్ బ్యాంక్ | 7.45 |
ఐసిఐసిఐ బ్యాంక్ | 7.90 |