AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Traffic: అక్టోబర్‌ 4 నుంచి 7 వరకు ట్రాఫిక్‌ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్‌.. ఈ వార్తపై పోలీసులు ఏమని స్పందించారంటే.

Hyderabad Traffic: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సమాచారం ఎంత త్వరగా మార్పిడి జరుగుతుందో అదే స్థాయిలో ఫేక్‌ న్యూస్‌ కూడా...

Hyderabad Traffic: అక్టోబర్‌ 4 నుంచి 7 వరకు ట్రాఫిక్‌ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్‌.. ఈ వార్తపై పోలీసులు ఏమని స్పందించారంటే.
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 03, 2021 | 12:16 PM

Hyderabad Traffic: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సమాచారం ఎంత త్వరగా మార్పిడి జరుగుతుందో అదే స్థాయిలో ఫేక్‌ న్యూస్‌ కూడా వైరల్‌ అవుతోంది. అసలు ఊహకు అందని పుకార్లు సోషల్‌ మీడియా వేదికగా పుట్టుకొస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలను చూస్తుంటే.. నిజమైన వార్తలను కూడా నమ్మలేని పరిస్థితి వస్తోంది. మళ్లీ సంబంధిత వర్గాలకు చెందిన వారు అధికారికంగా స్పందిస్తే తప్ప అది ఫేక్‌ వార్త అనే విషయం తెలియడం లేదు. ఈ క్రమంలోనే ఇలాంటి వార్తలు రోజుకోటి నెట్టింట సందడి చేస్తున్నాయి.

తాజాగా అలాంటి ఓ వార్తే నెట్టింట వైరల్‌గా మారింది. అదే వాహనాలపై విధించే చలాన్ల విషయమై. అక్టోబర్‌ 4 నుంచి 7 వరకు మూడు రోజులపాటు ట్రాఫిక్‌ లోక్‌ అదాలత్‌లో భాగంగా వాహనాలపై ఉన్న పెండింగ్‌ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్‌తో చెల్లించే అవకాశం కల్పించారని వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల పేరుతో ఈ వార్త గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టిలో కూడా పడడంతో.. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ట్రాఫిక్‌ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్‌ అంటూ వస్తోన్న వార్తలపై ఎలాంటి నిజం లేదని, అది పూర్తిగా అవాస్తవమని, ఎవరూ అలాంటి వార్తలను నమ్మవద్దు అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఇలాంటి వార్తలే సోషల్‌ మీడియాలో వచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్పుడు కూడా అవన్నీ ఫేక్‌ వార్తలేనని స్పష్టత నిచ్చారు.

ట్రాఫిక్‌ పోలీసుల ట్వీట్..

Also Read: Shah Rukh Khan Son: ముంబై డ్రగ్స్‌ కేసులో మరో ట్విస్ట్.. బాలీవుడ్‌ బడా హీరో కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌

Celebrity Divorce Couples: ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న జంటలు వీళ్లే..

Viral Video: పెళ్లి వేదికపై నవ వరుడి చెత్త ప్రవర్తన.. పెళ్లి కూతురు ప్రేమగా స్వీట్ ఇస్తుంటే ఏం చూశాడో చూడండి.

బియ్యం నీళ్లతో చిటికెలో మెరిసే అందం మీ సొంతం.. ఎలా వాడాలంటే?
బియ్యం నీళ్లతో చిటికెలో మెరిసే అందం మీ సొంతం.. ఎలా వాడాలంటే?
ఆ శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే అగ్ని ప్రమాదాలు తప్పవా...వైశాఖంలో
ఆ శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే అగ్ని ప్రమాదాలు తప్పవా...వైశాఖంలో
చనిపోయినా.. మనశరీరంలో గోళ్లు, వెంట్రుకలు ఎందుకు పెరుగుతాయో తెలుసా
చనిపోయినా.. మనశరీరంలో గోళ్లు, వెంట్రుకలు ఎందుకు పెరుగుతాయో తెలుసా
Viral Video: పెద్దపులికే ఝలక్‌ ఇచ్చిన ఎలుగుబంటి...
Viral Video: పెద్దపులికే ఝలక్‌ ఇచ్చిన ఎలుగుబంటి...
ఏపీ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారు..
ఏపీ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారు..
ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..
ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..
వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
హైవేపై యువతి రచ్చరచ్చ.. మత్తులో కార్లను ఆపి.. ఎక్కి కూర్చొని
హైవేపై యువతి రచ్చరచ్చ.. మత్తులో కార్లను ఆపి.. ఎక్కి కూర్చొని
మతం చెప్పడానికి భయపడం అంటూ.. ఉగ్రదాడికి కాశీ వాసుల వింత నిరసన
మతం చెప్పడానికి భయపడం అంటూ.. ఉగ్రదాడికి కాశీ వాసుల వింత నిరసన
రాస్తున్న పరీక్ష మధ్యలో ఆపించి..విద్యార్ధితో కోడి కోయించిన టీచర్!
రాస్తున్న పరీక్ష మధ్యలో ఆపించి..విద్యార్ధితో కోడి కోయించిన టీచర్!