AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీఓ!.. ఎదురు చూస్తున్న మదుపరులు..

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు సంబంధించి మరో కీలక సమాచారం వచ్చింది. నవంబర్‎​లోపు...

LIC IPO: ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీఓ!.. ఎదురు చూస్తున్న మదుపరులు..
Lic Ipo
Srinivas Chekkilla
|

Updated on: Oct 03, 2021 | 9:42 PM

Share

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు సంబంధించి మరో కీలక సమాచారం వచ్చింది. నవంబర్‎​లోపు మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’కి ఎల్ఐసీ ఐపీఓ కోసం దరఖాస్తు (డీఆర్‎​హెచ్‎​పీ​) చేసుకునే వీలుందని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఐపీఓను నిర్వహించే బ్యాంకులు ఇవే ఎల్ఐసీ ఐపీఓ కోసం ప్రభుత్వం గత నెలలోనే పది మర్చెంట్ బ్యాంకర్లను నియమించింది. గోల్డ్​మన్​ శాక్స్​(ఇండియా) సెక్యూరిటీస్​ ప్రైవేట్ లిమిటెడ్​, సిటీగ్రూప్​ గ్లోబల్​ మార్కెట్స్​ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​, నోమురా ఫినాన్షియల్ అడ్వైసరీ అండ్ సెక్యూరిటీస్​(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఐపీఓను నిర్వహించనున్నాయి. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్​ లిమిటెడ్​, జేఎం ఫినాన్షియల్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్​ లిమిటెడ్​, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్​ లిమిటెడ్​, కోటక్ మహీంద్రా క్యాపిటల్​ కో లిమిటెడ్​ ప్రభుత్వం ఎంపిక చేసిన బ్యాంకుల జాబితాలో ఉన్నాయి.సిరిల్ అమర్‎​చంద్​ మంగళ్‎​దాస్ ఎల్ఐసీ ఐపీఓకు న్యాయ సలహాదారుగా వ్యవహరించనుంది. ఐపీఓ కోసం సెబీకి ఎల్ఐసీ దరఖాస్తు చేసుకుంటే.. మర్చెంట్​ బ్యాంకర్లు అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రచారం ప్రారంభిస్తాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

ఐపీఓపై మదుపరుల్లో ఆసక్తి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్‌ఐసీ ఐపీఓకు వస్తే.. భారీ స్పందన ఖచ్చితంగా ఉంటే అవకాశం ఉంది. సంస్థాగత మదుపరులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రజల్లోనూ ఈ సంస్థపై విశ్వాసం ఎక్కువే. ఐపీఓకు దరఖాస్తు చేయడం కోసం మార్కెట్లో ఇతర కంపెనీల షేర్లలో ఉన్న డబ్బు ఉపసంహరించుకుని, ఎల్‌ఐసీ ఇష్యూకు దరఖాస్తుకు కేటాయించే అవకాశాలూ లేకపోలేదు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా.. ఎల్ఐసీని ఐపీఓకు తీసుకరావాలని కేంద్రం నిర్ణయించింది. రెండు దశల్లో మొత్తం 10 శాతం వాటను ఐపీఓ ద్వారా విక్రయించే వీలుందని అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ ఐపీఓకు సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు లభించాయి. ఎల్ఐసీ ఐపీఓ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిపోనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లిస్టింగ్ తర్వాత అతిపెద్ద కంపెనీ కూడా ఇదే కానుందని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీఓ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. Read Also.. Stock Market: లక్ష పెట్టుబడి.. ఐదేళ్లలో రూ.40 లక్షల లాభం!.. ఇది సాధ్యమే..

Follow Us
వినాయకుడికి ఇష్టమైన పండుతో అమృతంలాంటి రోటి పచ్చడి
వినాయకుడికి ఇష్టమైన పండుతో అమృతంలాంటి రోటి పచ్చడి
తల లేని వినాయకుడు.. దేవభూమిలోని ఈ అద్భుత ఆలయం గురించి తెలిస్తే..
తల లేని వినాయకుడు.. దేవభూమిలోని ఈ అద్భుత ఆలయం గురించి తెలిస్తే..
కాళ్ళ వాపులతో ఇబ్బందా? ఇవి తింటే వృద్యాప్యంలో కూడా గుర్రంలా
కాళ్ళ వాపులతో ఇబ్బందా? ఇవి తింటే వృద్యాప్యంలో కూడా గుర్రంలా
ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?
ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?
గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే
గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..
మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..
మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు చెక్.. వారందరికీ రేపు స్కిల్ టెస్ట్!
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు చెక్.. వారందరికీ రేపు స్కిల్ టెస్ట్!
90 కాలంనాటి వినాయక చవితి మధుర జ్ఞాపకాలు.. హార్ట్ టచింగ్ స్టోరీ
90 కాలంనాటి వినాయక చవితి మధుర జ్ఞాపకాలు.. హార్ట్ టచింగ్ స్టోరీ