AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఈ ప్రైవేట్‌ బ్యాంకుపై ఆర్బీఐ రూ.45 లక్షల జరిమానా.. కారణం ఇదే!

RBI: ఆర్‌బిఐ ఈ కఠినమైన చర్య బ్యాంకింగ్ రంగానికి ఒక పెద్ద సందేశంగా పరిగణించింది. పారదర్శకత కొనసాగించడానికి, కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకోవడానికి అన్ని బ్యాంకులు నియమాలు, మార్గదర్శకాలను సరిగ్గా పాటించేలా కేంద్ర బ్యాంకు పదే పదే ప్రయత్నిస్తోంది. ఖాతాలలో కొన్నింటి డేటాను ట్యాంపరింగ్ చేసిందని

RBI: ఈ ప్రైవేట్‌ బ్యాంకుపై ఆర్బీఐ రూ.45 లక్షల జరిమానా.. కారణం ఇదే!
Subhash Goud
|

Updated on: Aug 30, 2025 | 7:08 PM

Share

దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకు బంధన్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 45 లక్షల జరిమానా విధించింది. బంధన్ బ్యాంక్ కొన్ని నియమ నిబంధనలను పాటించనందున భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆ బ్యాంకుపై రూ.44.7 లక్షల జరిమానా విధించింది. మార్చి 31, 2024 వరకు బ్యాంకు ఆర్థిక స్థితిని తనిఖీ చేయడానికి చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించినట్లు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది.

ఇది కూడా చదవండి: Mahindra: ఇదేం క్రేజ్‌ బ్రో.. కేవలం 135 సెకన్లలో 999 కార్లు సేల్‌.. 682కి.మీ రేంజ్.. అంత ప్రత్యేకత ఏంటి?

ఈ దర్యాప్తులో బ్యాంకు ఆర్‌బిఐ సూచనలను పాటించలేదని తేలింది. దీని తరువాత నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా ఎందుకు విధించకూడదని అడుగుతూ బ్యాంకుకు నోటీసు పంపింది. కొంతమంది ఉద్యోగులకు కమిషన్‌గా బ్యాంకు చెల్లింపు చేసిందని ఆర్‌బిఐ తెలిపింది. బ్యాంకు ఆర్‌బిఐ అనేక నియమాలను ఉల్లంఘించింది. దీని కారణంగా నియంత్రణ బ్యాంకు ప్రైవేట్ రంగ బ్యాంకుపై ఈ జరిమానా విధించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు ఊహించని దెబ్బ.. రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం ధర!

బంధన్ బ్యాంక్ తన దర్యాప్తులో ఖాతాలలో కొన్నింటి డేటాను ట్యాంపరింగ్ చేసిందని, సిస్టమ్‌లోని ఆడిట్ ట్రయల్స్/లాగ్‌లను సరిగ్గా నమోదు చేయలేదని, అందులో యూజర్ వివరాలు నమోదు చేలేదని ఆర్‌బిఐ తన దర్యాప్తులో కనుగొంది. బంధన్ బ్యాంక్‌పై విధించిన జరిమానా బ్యాంకు చట్టపరమైన నియమాలను పాటించకపోవడం వల్ల మాత్రమే అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. బ్యాంకు కస్టమర్లకు దీనితో ప్రత్యక్ష సంబంధం లేదు. బ్యాంకు కస్టమర్లతో చేసుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందాన్ని ప్రశ్నించడం జరుగుతుందని దీని అర్థం కాదని కూడా ఆర్‌బిఐ తెలిపింది.

ఆర్‌బిఐ ఈ కఠినమైన చర్య బ్యాంకింగ్ రంగానికి ఒక పెద్ద సందేశంగా పరిగణించింది. పారదర్శకత కొనసాగించడానికి, కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకోవడానికి అన్ని బ్యాంకులు నియమాలు, మార్గదర్శకాలను సరిగ్గా పాటించేలా కేంద్ర బ్యాంకు పదే పదే ప్రయత్నిస్తోంది.

September-2025: సెప్టెంబర్‌ 1 నుంచి మారనున్న బ్యాంకుల నియమాలు.. ఇక ఛార్జీల మోత!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి