Viral Video: సంస్కారవంతమైన పామును మీరెప్పుడైనా చూశారా? మొబైల్‌లో రొమాంటిక్ పాటను చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఈ రోజుల్లో రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ వీడియో ఇంటర్నెట్‌లో చాలా వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు వినియోగదారులు. ఈ పాము చాలా సంస్కారవంతమైనదని వ్యాఖ్యానిస్తున్నారు..

Viral Video: ఈ రోజుల్లో రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు హృదయాలను కదిలించేవిగా ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా పాములు, ముసళ్లు, సింహాలు, పులులలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ పాముకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే ఈ పాము సంస్కారవంతమైనదని గమనించవచ్చు. చాలా మంది తమ మొబైల్‌లలో రకరకాల వీడియోలు చూస్తుంటాము. కొన్ని వీడియోలు అశ్లీలం వంటివి ఉంటాయి.
ఇది కూడా చదవండి: Jio Plan: అంబానీయా మజాకా.. రూ.100తో డేటా ప్లాన్.. 90 రోజుల వ్యాలిడిటీ!
@NazneenAkhtar23 అనే ఎక్స్ యూజర్ ఓ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక స్మార్ట్‌ఫోన్‌ను స్టాండ్‌పై ఉంచి వీడియో ప్లే చేశారు. ఆ ఫోన్‌లో భోజ్‌పురి పాట ప్లే అవుతోంది. ఆ వీడియోలో హీరో, హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అంతలో ఒక పాము అక్కడకు వచ్చి కాసేపు ఆ పాటను చూసింది. ఆ తర్వాత తన నాలుకతో ఆ పాటను ఆపేసింది. ఆ పాట నచ్చలేనట్టుగా అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది. పాము ఇలా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీంతో ఇది ఏఐ వీడియో అని చాలా మంది అనుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: TVS EV: టీవీఎస్ నుంచి మరో సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 158 కి.మీ.. తక్కువ ధరల్లోనే..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కొన్ని లక్షల మంది వీక్షించారు. వందలాది లైక్‌లు వస్తున్నాయి. నాగ్ బాబాకు భోజ్‌పురి పాట అస్సలు నచ్చలేదని ఒకరు కామెంట్ చేస్తుంటే, ఆ పాటకు, డ్యాన్స్‌కు నాగరాజు ఇచ్చిన రివ్యూ అది అని మరొకరు పేర్కొన్నారు. మరొక వినియోగదారు ఇది చాలా సంస్కారవంతమైన పాము అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో నిజమైనదేనా అని మరొకరు ప్రశ్నించారు. ఈ వీడియోకు ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
लगता है नाग बाबा को ये भोजपुरी गाना पसंद नहीं आया, तभी इसने बंद कर दिया🤣
बस यही देखना रह गया था,, pic.twitter.com/yfwiEm5IB3
— Adv.Nazneen Akhtar (@NazneenAkhtar23) August 25, 2025
ఇది కూడా చదవండి: Hyderabad Richest People: హైదరాబాద్‌లో టాప్ ధనవంతులు వీరే.. ఏయే రంగాల్లో..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




