- Telugu News Photo Gallery Technology photos Ceiling Fan: Best fan placement to move air through the house
Ceiling Fan: మీ ఇంట్లో ఫ్యాన్ గాలి సరిగ్గా రావడం లేదా? ఈ చిన్న ట్రిక్స్‌తో ఏసీలాంటి కూలింగ్.. ట్రై చేసి చూడండి!
Ceiling Fan: సిలింగ్ ఫ్యాన్ గాలి సరిగ్గా రాకపోతే కొంత మంది తమ ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. కొందరు కూలర్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ చాలామంది సీలింగ్ ఫ్యాన్‌తోనే సరిపెట్టుకోవాలని ఆలోచిస్తుంటారు. ఈ ట్రిక్స్ తో ఏసీలాంటి గాలి ఉంటుంది..
Updated on: Aug 27, 2025 | 8:52 PM

Ceiling Fan: భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇళ్లలో సిలింగ్ ఫ్యాన్లు ఉంటాయి. ఉన్నత వర్గాల వారు మాత్రం ఏసీలు వాడుతుంటారు. అయితే ప్రతి ఒక్కరి నిరుపేద ఇండ్లలో ఉండేది సిలింగ్ ఫ్యాన్. అయితే కొన్ని సార్లు ఫ్యాన్ గాలి సరిగ్గా రాదు. ఏదో చిన్నపాటి సమస్య ఉన్నప్పటికీ దానిని పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు. దీని వల్ల ప్యాన్ గాలి సరిగ్గా రాదు. అన్ని మూలాలకు చేరదు. కొంతమంది తమ ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. కొందరు కూలర్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ చాలామంది సీలింగ్ ఫ్యాన్‌తోనే సరిపెట్టుకోవాలని ఆలోచిస్తుంటారు. మీ గదిలో ఫ్యాన్ మాత్రమే ఉంటే మీరు వేడిని నివారించవచ్చు. మీరు ఫ్యాన్ గాలిని AC లాగా చల్లగా మార్చుకోవచ్చు.

సీలింగ్ ఫ్యాన్ స్థానం: ఇంట్లో అమర్చిన సీలింగ్ ఫ్యాన్ వేడి గాలి వస్తుంటే దాని స్థానం సరైనది కాదని గుర్తించుకోండి. అంటే చల్లని గాలి వీచడానికి ఫ్యాన్ బ్లేడ్లు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ఫ్యాన్‌కు ఉండే బ్లేడ్స్‌తో చిన్నపాటి తేడా ఉన్నా సరైన గాలి రాదు. కొద్దిగా వంకరగా, వంగినట్లుగా ఉన్నా గాలి రాదు. కానీ ఫ్యాన్ బ్లేడ్లు తేడా ఉన్నట్లు కూడా పెద్దగా తెలియదు. ఫ్యాన్ బ్లేడ్ వంకరగా లేదా వదులుగా ఉంటే వెంటనే దాన్ని రిపేర్ చేయండి.

కెపాసిటర్లను మార్చండి: కెపాసిటర్ పాతదైపోయినా, లేదా చెడిపోయినా ఫ్యాన్ వేగాన్ని తగ్గించడానికి కారణమవుతుంది. మీరు కొత్త కెపాసిటర్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని పెంచవచ్చు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

తడి టవల్ సహాయం: వేసవి చాలా మంది తలపై తడి తువ్వాలతో బయటకు వెళ్తుంటారు. దీని వల్ల చుట్టూ ఉన్న వేడి గాలి చల్లగా అనిపిస్తుంది. ఫ్యాన్ గాలిని చల్లబరచడానికి మీరు ఈ పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. మీరు ఏదైనా సహాయంతో టేబుల్ ఫ్యాన్ ముందు తడి టవల్‌ని వేలాడదీయవచ్చు. దీనివల్ల గాలి చల్లగా అనిపిస్తుంది. అయితే మీరు ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు.

క్రాస్ వెంటిలేషన్: మీ గది కిటికీ పక్కన ఉంటే లేదా గదిలో కిటికీ ఉంటే దానిని తెరిచి ఉంచండి. క్రాస్ వెంటిలేషన్ కారణంగా చల్లని గాలి గదిలోకి వస్తుంది. మీరు కిటికీ మీద చిన్న టేబుల్ ఫ్యాన్ కూడా ఉంచవచ్చు. ఇది గదిలో గాలి వ్యాపించడం కొనసాగుతుంది.




