Viral Video: రెస్టారెంట్‌కు వచ్చిన వీధి కుక్క.. చివరకు ఏం జరిగిందో చూడండి.. వీడియో వైరల్!
Viral Video: ఇది మొదటి సంఘటన కాదని స్థానిక ప్రజలు అంటున్నారు. కొంతకాలంగా కన్నూర్, పరిసర ప్రాంతాలలో వీధికుక్కల బెడద పెరుగుతోంది. కుక్కలు దాదాపు ప్రతిరోజూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు భయంతో జీవిస్తున్నారు. వీధి కుక్కల భయంతో బయటకు..

Viral Video: ఈ మధ్య కాలంలో కుక్కల భయం పెరిగిపోయింది. వీధి కుక్కులు జనాలపై దాడులకు తెగబడుతున్నాయి. అయితే కేరళలోని కన్నూర్ జిల్లా నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వీధి కుక్క రెస్టారెంట్‌లోకి ప్రవేశించి హంగామా సృష్టించింది. రెస్టారెంట్‌లో కూర్చున్న ప్రజలు కుక్కను చూసి అకస్మాత్తుగా భయపడియారు. దీంతో దాన్ని తరిమివేసేందుకు రెస్టారెంట్ సిబ్బంది ప్రయత్నించగా, వారిపైనే తిరగబడింది. దీంతో కొద్దిసేపు భయభ్రాంతులకు గురి చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi China Visit: ఏడేళ్లకు అడుగుపెట్టిన మోదీకి చైనాలో రెడ్ కార్పెట్.. ఒకే వేదికపై ఆ ముగ్గురు..!
వెయిటర్ కుక్కను చూడగానే కర్ర సహాయంతో దాన్ని తరిమికొట్టడానికి ప్రయత్నించాడు. కానీ కుక్క పదే పదే పరిగెత్తి వెయిటర్‌పై దాడికి ప్రయత్నించింది. వెయిటర్ చాలా సేపు కర్రను ఊపుతూ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాడు. చివరికి చాలా ప్రయత్నం తర్వాత ఆ కుక్క ఏదో విధంగా రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లిపోయింది. మరోవైపు, రోడ్డుపై వెళుతున్న ఒక వ్యక్తిపై మరో వీధి కుక్క దాడి చేసింది. సమీపంలో ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తిని రక్షించి కుక్కను తరిమికొట్టడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికి కుక్క ఆ వ్యక్తిని దారుణంగా కరిచింది. ఈ సంఘటనతో అక్కడ ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు భయంతో అక్కడికి పరుగులు తీశారు.
ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు ఊహించని దెబ్బ.. రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధర!
ఈ ప్రాంతంలో వీధి కుక్కల భయం పెరిగింది.
ఇది మొదటి సంఘటన కాదని స్థానిక ప్రజలు అంటున్నారు. కొంతకాలంగా కన్నూర్, పరిసర ప్రాంతాలలో వీధికుక్కల బెడద పెరుగుతోంది. కుక్కలు దాదాపు ప్రతిరోజూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు భయంతో జీవిస్తున్నారు.
KANNUR, KERALA: Stray dogs have become so aggressive that they are entering restaurants, scaring away diners and biting innocent bystanders. People who want stray dogs should take them home with them. Animal love remains till the first bite. pic.twitter.com/afyhW1pS7U
— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) August 29, 2025




