Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: మహిళలకు ఊహించని దెబ్బ.. రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం ధర!

Gold Price: బంగారం ధరల పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో మార్పులు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికంగా ఉండటం ఇవన్నీ ప్రధాన కారణాలు అని చెబుతున్నారు. అంతేకాదు ద్రవ్యోల్బణం పెరిగిన..

Gold Price: మహిళలకు ఊహించని దెబ్బ.. రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం ధర!
మీరు ఆభరణాలు తయారు చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, తాజా ధరలను ఒకసారి తప్పకుండా తనిఖీ చేయండి. బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అటువంటి పరిస్థితిలో సరైన సమాచారం లేకుండా కొనుగోలు చేయడం వల్ల మీరు నష్టపోవచ్చు.
Subhash Goud
|

Updated on: Aug 30, 2025 | 4:11 PM

Share

Gold Price: దేశంలో బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. మహిళలకు ఊహించని దెబ్బ కొట్టింది. తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా రికార్డు స్థాయిలో దూపుకుపోతోంది. తలం బంగారం ధర ఇప్పుడు లక్షా 5 వేల రూపాయల వరకు ఉంది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నమాట. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఎగబాకింది. మరి దేశంలో తులం బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మీరే షాకవుతారు.

ఇది కూడా చదవండి: DMart vs Reliance Retail: డిమార్ట్ vs రిలయన్స్ రిటైల్.. చౌకైన షాపింగ్‌ కోసం ఏది బెస్ట్‌?

శనివారం మధ్యాహ్నం సమయానికి బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. తులం బంగారంపై ఏకంగా 1640 రూపాయలు పెరిగింది. దీని బట్టి చూస్తే ఇంకా ఎంత పెరుగుతుందో ఊహించవచ్చు. తగ్గిటప్పుడు తక్కువ నమోదు అవుతున్నప్పటికీ పెరిగేటప్పుడు మాత్రం రెట్టింపు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1640 పెరిగి 1,04,950కు చేరుకుంది. అంటే దాదాపు రూ.లక్షా 5వేల వద్ద నమోదైనట్లే. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1200 పెరిగి 96,200 రూపాయల వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: September-2025: సెప్టెంబర్‌ 1 నుంచి మారనున్న బ్యాంకుల నియమాలు.. ఇక ఛార్జీల మోత!

ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా నేనెందుకు తగ్గాలి అన్నట్లు 1100 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,21,000 ఉంది. ఇక హైదరాబాద్‌, కేరళ, చెన్నై నగరాల్లో అయితే మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో సిల్వర్‌ ధర 1,31,000 ఉంది.

ఇదిలా ఉంటే.. భారతదేశంలో బంగారం ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయనే చెప్పాలి. ఇప్పటికే ఆకాశాన్నంటిన బంగారం ధరలు.. సామాన్యుడు సైతం కొనలేని పరిస్థితి ఉంది. సామాన్యుడు కూతురు పెళ్లి కోసం తులం బంగారం కొనాలంటేనే లక్షా 5 వేల వరకు చెల్లించుకునే పరిస్థితి ఉంది. అలాంటిది సామాన్యుడు కొనాలంటేనే భయపడిపోతున్నాడు. ఇక ఇప్పుడు పండుగ సీజన్ కొనసాగుతోంది. రానున్న రోజుల్లో దసరా, దీపావళి పండలు ఉన్నాయి. ఇంకా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు నెలలో ధరలు తగ్గుతాయని చాలా మంది భావించినప్పటికీ అవేమి జరగలేదు.

ధరలు పెరగడానికి కారణాలు ఏంటి?

బులియన్‌ మార్కెట్‌ నిపుణుల ప్రకారం.. బంగారం ధరల పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో మార్పులు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికంగా ఉండటం ఇవన్నీ ప్రధాన కారణాలు అని చెబుతున్నారు. అంతేకాదు ద్రవ్యోల్బణం పెరిగిన సందర్భాల్లో చాలా మంది పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లడం వల్ల ధరలు ఇంకా ఎగబాకుతున్నాయి. ఇక రానున్న పండుగ సీజన్‌లో భారత్‌లో బంగారం డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి