AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home: అద్దె ఇల్లా లేదంటే సొంత ఇల్లా ..? ఏది బెటర్ ఆప్షన్​..! ఆర్థిక నిపుణుల సలహా తప్పనిసరి..

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల.. ఈ కల కోసం చాలా మంది ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. రూపాయి రూపాయి పొదుపు చేస్తుంటారు. ఇంటి విషయంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడూ తలెత్తే ఒక ప్రధాన ప్రశ్న ఏమిటంటే, మనం సొంత ఇంటిని కొనడం మంచిదా..? లేదా అద్దెకు తీసుకోవడం మంచిదా? సరైన నిర్ణయం తీసుకోవడానికి మీ ఆదాయం, పొదుపు, భవిష్యత్తు ప్రణాళికను పరిగణనలోకి తీసుకోవడం చాలా కీలకమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Home: అద్దె ఇల్లా లేదంటే సొంత ఇల్లా ..? ఏది బెటర్ ఆప్షన్​..! ఆర్థిక నిపుణుల సలహా తప్పనిసరి..
Rent Vs Buy
Jyothi Gadda
|

Updated on: Oct 24, 2025 | 5:50 PM

Share

ఇల్లు కొనడం లేదా అద్దెకు తీసుకోవడం అనేది ప్రతి పట్టణ కుటుంబంలో తరచుగా మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న. పెరుగుతున్న ఆస్తి ధరలు, గృహ రుణ EMIలు, అద్దె, పొదుపుల మధ్య, ఇల్లు కొనడం, అద్దెకు ఉండటం ఏది మంచిది అనే అయోమయంలో చాలా మంది ఉంటున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సరైన ఎంపికను ఎంచుకోవడం అంటే మీ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళిక, కెరీర్ స్థిరత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఆర్థిక సలహాదారుల అభిప్రాయం ప్రకారం..ఎవరైనా ఎక్కువ కాలం స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉండి, రాబోయే 10–15 సంవత్సరాలు అదే నగరంలో ఉండాలని ప్లాన్ చేసుకుంటే, మీరు సొంత ఇంటిని కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది అద్దెను ఆదా చేస్తుంది. ఆస్తి విలువ పెరుగుదలకు కూడా వీలు కల్పిస్తుంది. అయితే, మీరు మీ కెరీర్ లేదా ఉద్యోగం కారణంగా వేర్వేరు నగరాలకు మకాం మార్చాల్సి వస్తుంటే..అప్పుడు మీరు అద్దెకు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

ఇంటి కొనుగోలు ఖర్చులు:

ఇవి కూడా చదవండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇల్లు కొనే ముందు డౌన్ పేమెంట్, EMI, నిర్వహణ, ఇతర ఖర్చులను జాగ్రత్తగా పరిగణించాలి. చాలా మంది ఇల్లు కొనే సమయంలో ఆస్తి ధరపై మాత్రమే దృష్టి పెడతారు. కానీ, నిజ జీవితంలో, ఆ ఇంటి నిర్వహణ, గృహ రుణ వడ్డీ, ఇతర ఖర్చులు నెలవారీ బడ్జెట్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయనే విషయం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. కాబట్టి, ముందుగా పూర్తి ఆర్థిక ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయాలని సూచిస్తున్నారు.

అద్దె ప్రయోజనాలు:

అద్దె ఇంటితో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అద్దెకు తీసుకోవడం వల్ల మీ నగదు చెల్లింపుల్లో లోన్‌ ఈఎంఐ కంటే తక్కువగా ఉంటుంది. పైగా ఉద్యోగం, నగరాలను మార్చుకునే స్వేచ్ఛ లభిస్తుంది. ఇంకా, మీరు డౌన్ పేమెంట్లు, నెల నెల గృహ రుణాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, దీర్ఘకాలికంగా అద్దెకు ఉండటం వల్ల పెట్టుబడి సంపద సృష్టికి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మరి మనం ఏమి చేయాలి?:

అందువల్ల, నిర్ణయం తీసుకునే ముందు మీ కెరీర్ ప్రణాళికలు, నెలవారీ బడ్జెట్, పొదుపులు, మీ పెట్టుబడి సామర్థ్యాలను జాగ్రత్తగా అంచనా వేయాలని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా, స్థిరంగా ఉంటే ఇల్లు కొనడం మంచి పెట్టుబడి కావచ్చు. అయితే, మీరు మీ కెరీర్ ప్రారంభంలో ఉంటే లేదా తరచుగా నగరాలకు మారుతుంటే, మీరు ఇంటిని అద్దెకు తీసుకోవడం, ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టడం తెలివైన పనిగా నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..