Indian Startup’s: భారతీయ స్టార్టప్ కంపెనీలకు ఊరట.. ఏకంగా 300 శాతం వృద్ధి

భారతదేశంలో ఇటీవల కాలంలో యువత ఆలోచనా విధానాలు మారాయి. గతంలో బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకునే వారు. కానీ ఇప్పుడు మారిన ఆలోచనా విధానం మేరకు వ్యాపారంలో స్థిరపడాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వినూత్నంగా స్టార్టప్ కంపెనీలను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న భారతీయ స్టార్టప్‌లలో కొన్ని పెట్టుబడుల ఆకర్షణలో ఏకంగా 300 శాతం వృద్ధిని సాధించాయి.

Indian Startup’s: భారతీయ స్టార్టప్ కంపెనీలకు ఊరట.. ఏకంగా 300 శాతం వృద్ధి
Indian Startups List
Follow us

|

Updated on: Oct 20, 2024 | 5:24 PM

ఇటీవల పెట్టుబడుల విషయంలో వెనుకంజలో ఉన్న భారతీయ స్టార్టప్‌ల వ్యవస్థ ప్రస్తుతం నిధుల సేకరణలో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. ఇటీవల 39 స్టార్టప్‌ కంపెనీలు 29 ఒప్పందాల ద్వారా సుమారు 449 మిలియన్ల డాలర్లను సేకరించాయి. గత వారం సేకరించిన 135 మిలియన్ల డాలర్లతో పోల్చి చూస్తే 300 శాతం పెరిగింది. ముఖ్యంగా ఈ వారంలో 12 గ్రోత్ స్టేజ్, 16 ఎర్లీ స్టేజ్ ఒప్పందాలు జరిగాయి. అయితే సీడ్ ఫండింగ్ 26.5 మిలియన్ల వద్ద ఉందని నిపుణులు చెబుతున్నారు. సీడ్ ఫండింగ్ గత వారం 17.8 మిలియన్ల డాలర్లుగా ఉంది. అంటే దాదాపు సీడ్ ఫండింగ్ 48.8 శాతం పెరిగింది. ఈ వృద్ధి రేటును అంచనా వేస్తే స్టార్టప్ వ్యవస్థలో పెట్టుబడి కార్యకలాపాలు ఊపందుకున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా ఎడ్టెక్ స్టార్టప్ ఎరుడిటస్ టీపీజీకు సంబంధించిన ది రైజ్ ఫండ్ నేతృత్వంలో 150 మిలియన్ల డాలర్లను సేకరించింది. ప్రస్తుత పెట్టుబడిదారులు సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2, లీడ్స్ ఇల్యూమినేట్, యాక్సెల్, సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్, చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ భాగస్వామ్యంతో ఈ పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ పెట్టుబడులపై ఎరుడిటస్, ఎమెరిటస్ సీఈఓ అశ్విన్ దామెరా మాట్లాడుతూ ఈ పెట్టుబడితో, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వృద్ధిని, ఆవిష్కరణలను కొనసాగించేందుకు వీలుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రముఖ కంపెనీ ఓమ్నీఛానెల్ బ్యూటీ ప్లాట్‌ఫారమ్ పర్పుల్ తన తాజా నిధుల రౌండ్‌ను రూ. 500 కోట్లకు పొడిగించి తుది ముగింపును రూ. 1,500 కోట్లకు చేరుకుంది. మొత్తం రౌండ్‌కు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ  నాయకత్వం వహించింది. అలాగే ప్రస్తుత పెట్టుబడిదారులైన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, బ్లూమ్ వెంచర్స్ కూడా తమ భాగస్వామ్యాన్ని అందించాయి.

జివా జ్యువెలరీ తన విస్తరించిన సిరీస్ బీ ఫండింగ్ రౌండ్‌ను విజయవంతంగా మూసివేసినట్లు ప్రకటించింది. ఈ కంపెనీ పెట్టుబడిదారుల నుంచి అధిక వాల్యుయేషన్‌లో రూ. 255 కోట్లు సంపాదించింది. దీనికి ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, ఈపీఐక్యూ క్యాపిటల్, ఎడ్విస్ డిస్కవర్ ఫండ్, జివా టాప్ మేనేజ్‌మెంట్ నాయకత్వంలో ఈ పెట్టుబడిని సాఫ్ట్‌వేర్ యాజ్-ఎ-సర్వీస్ (సాస్) స్టార్టప్ ఎయిట్ రోడ్స్ వెంచర్స్ నేతృత్వంలోని ఒక రౌండ్‌లో 30 మిలియన్ల డాలర్లను సంపాదించింది.  ఎలివేషన్ క్యాపిటల్, త్రీవన్ ఫోర్ క్యాపిటల్ భాగస్వామ్యాన్ని కూడా చూసింది. అదే సమయంలో భారతీయ ఫిన్‌టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ జూలై-సెప్టెంబర్ కాలంలో 778 మిలియన్ల డాలర్ల నిధులను పొందింది. మూడో త్రైమాసికంలో సేకరించిన ఫిన్‌టెక్ నిధుల పరంగా యూఎస్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానానికి చేరుకుంది. సాస్ ఆధారంగా పని చేే ఓ నివేదిక ప్రకారం గత ఏడాది క్యూ3లో సేకరించిన 471 మిలియన్ల డాలర్ల నుంచి 66 శాతం పెరుగుదలను, ఈ సంవత్సరం క్యూ2లో సేకరించిన 293 మిలియన్ల డాలర్ల నుంచి 165 శాతం పెరుగుదలను సూచిస్తుందని పేర్కొంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారతీయ స్టార్టప్ కంపెనీలకు ఊరట.. ఏకంగా 300 శాతం వృద్ధి
భారతీయ స్టార్టప్ కంపెనీలకు ఊరట.. ఏకంగా 300 శాతం వృద్ధి
ఈ వ్యాధులున్న స్త్రీలు ప్రెగ్నెన్సీ ప్లాన్ వద్దంటున్న నిపుణులు..
ఈ వ్యాధులున్న స్త్రీలు ప్రెగ్నెన్సీ ప్లాన్ వద్దంటున్న నిపుణులు..
అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ.5 లక్షలు.. చివరికి..
అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ.5 లక్షలు.. చివరికి..
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
రాబోయే కాలంలో వ్యాపార వృద్ధికి భారత్‌ ఓ ఇంజిన్ లాంటిది: శామ్యూల్
రాబోయే కాలంలో వ్యాపార వృద్ధికి భారత్‌ ఓ ఇంజిన్ లాంటిది: శామ్యూల్
టీమిండియా కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం.. లేకుంటే కథ వేరేలా ఉండేది
టీమిండియా కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం.. లేకుంటే కథ వేరేలా ఉండేది
ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికను ఒంటరిగా అడవిలోకి తీసుకెళ్లి..
ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికను ఒంటరిగా అడవిలోకి తీసుకెళ్లి..
కుప్పంలో టీడీపీ Vs వైసీపీ.. సోషల్ మీడియా వార్..
కుప్పంలో టీడీపీ Vs వైసీపీ.. సోషల్ మీడియా వార్..
కార్తీక మాసంలో తులసికి ఈ నివారణలు చేయండి.. సుఖ సంతోషాలు మీ సొంతం
కార్తీక మాసంలో తులసికి ఈ నివారణలు చేయండి.. సుఖ సంతోషాలు మీ సొంతం
అప్పుడు ప్రతిపక్ష నేతగా.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా..
అప్పుడు ప్రతిపక్ష నేతగా.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా..
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!