AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIG CEO Samuel: రాబోయే కాలంలో వ్యాపార వృద్ధికి భారతదేశం ఓ ఇంజిన్ లాంటిది: సీఈవో శామ్యూల్

ప్రోడక్ట్‌ను ప్యాకేజింగ్ చేయడానికి ఉపయోగించే అన్ని ఆప్షన్‌లతో పోలిస్తే మనకు తక్కువ కార్బన్ వినియోగం ఉందని ఆయన చెప్పారు. ఎస్‌ఐజీలో అల్యూమినియం ఫాయిల్‌ను వెలికితీస్తామని, ఇది కార్బన్ 30 నుండి 40 శాతం వరకు తగ్గించామన్నారు. అదనంగా మా పానీయాల బాక్స్‌లలో 100 శాతం రీసైక్లింగ్ కోసం తయారు చేసినట్లు చెప్పారు..

SIG CEO Samuel: రాబోయే కాలంలో వ్యాపార వృద్ధికి భారతదేశం ఓ ఇంజిన్ లాంటిది: సీఈవో శామ్యూల్
Subhash Goud
|

Updated on: Oct 20, 2024 | 5:33 PM

Share

మార్కెట్ పరంగా భారత్ అందరికీ ఇష్టమైన దేశంగా మారుతోంది. భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందడమే ఇందుకు కారణం. గత దశాబ్దంలో భారతదేశంలో అంతా మారిపోయింది. అభివృద్ధిలో భారతదేశం వేగంగా మార్పులు చెందుతోంది. 4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ, 8 శాతం వృద్ధి రేటు కలిగిన ఏకైక దేశం భారతదేశం. చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలో తమ వ్యాపారాన్ని స్థాపించాలని కోరుకోవడానికి ఇదే కారణం. అసెప్టిక్ కార్టన్ ప్యాకేజింగ్ కోసం ప్రముఖ సిస్టమ్స్, సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఎస్‌ఐజీ CEO శామ్యూల్ సిగ్రిస్ట్ రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని కంపెనీ వృద్ధి ఇంజిన్‌గా అభివర్ణించారు. ఇటీవల తన భారత పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం గురించి శామ్యూల్ సిగ్రిస్ట్ వివరించారు. ప్రపంచంలోనే ఇలాంటి మార్కెట్‌ను నేను ఎక్కడా చూడలేదని, భారత్‌లో వేగంగా వ్యాపారాన్ని స్థాపించగలిగామని సిగ్రిస్ట్ చెప్పారు. రానున్న కాలంలో కంపెనీ వృద్ధికి భారత ఓ ఇంజిన్ లాంటిదని అన్నారు.

తన ఇటీవలి భారత పర్యటన సందర్భంగా శామ్యూల్‌ మీడియాతో మాట్లాడారు. 2018లో ఎస్‌ఐజీ భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించినప్పటి నుండి కంపెనీ వృద్ధి గురించి శామ్యూల్ వెల్లడించారు. మేము రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని మా గ్రోత్ మరింతగా చూస్తామని, ఎందుకంటే మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటి నుండి గత నాలుగు నుండి ఐదు సంవత్సరాలలో స్థాపించడం ఒ అద్భుతమైన వేదిక అని అన్నారు. శామ్యూల్ సిగ్రిస్ట్ స్విస్ 2017 నుండి మిడిల్ ఈస్ట్ జాయింట్ వెంచర్‌కు చెందిన సీఎఫ్‌వో, ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అతను జనవరి 1, 2021 నుండి ఎస్‌ఐజీ గ్రూప్ CEO అయ్యారు. 2018లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత కంపెనీ అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించిందని సిగ్రిస్ట్ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ అనేక ప్రముఖ భారతీయ డైరీ, పానీయాల కంపెనీలతో కలిసి పని చేస్తోంది.

గతేడాది వార్షిక ఆదాయం 10 నుంచి 13 శాతం:

2023లో భారతదేశం నుండి ఎస్‌ఐజీ (SIG) వార్షిక ఆదాయం 10 నుండి 13 శాతం మధ్య ఉందని ఆయన చెప్పారు. అదే సమయంలో మార్కెట్ శాశ్వతంగా 10 శాతానికి పైగా వృద్ధి చెందుతోంది. మార్కెట్ కంటే ఎస్‌ఐజీ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందని అంచనా. భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత సిగ్రిస్ట్ కంపెనీ ఎస్‌ఐజీ ఇప్పటి వరకు అమూల్, పార్లే ఆగ్రో, కోకా-కోలా, పెప్సికో, మిల్కీ మిస్ట్, హమ్‌దార్డ్ వంటి సంస్థలతో కలిసి పని చేసిందన్నారు. దానితో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పడిందన్నారు. అనేక అధునాతన ప్యాకేజింగ్స్‌ను అందించామన్నారు.

ప్రోడక్ట్‌ను ప్యాకేజింగ్ చేయడానికి ఉపయోగించే అన్ని ఆప్షన్‌లతో పోలిస్తే మనకు తక్కువ కార్బన్ వినియోగం ఉందని ఆయన చెప్పారు. ఎస్‌ఐజీలో అల్యూమినియం ఫాయిల్‌ను వెలికితీస్తామని, ఇది కార్బన్ 30 నుండి 40 శాతం వరకు తగ్గించామన్నారు. అదనంగా మా పానీయాల బాక్స్‌లలో 100 శాతం రీసైక్లింగ్ కోసం తయారు చేసినట్లు చెప్పారు. భారతదేశంలో ఇప్పటివరకు సిగ్రిస్ట్ అనుభవం చాలా సానుకూలంగా ఉంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎస్‌ఐజి ద్వారా అసెప్టిక్ ప్యాకేజింగ్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. సిగ్రిస్ట్ కంపెనీ ఇందులో సుమారు 100 మిలియన్ యూరోలు పెట్టుబడి పెడుతోంది. ఈ ప్లాంట్ 2025 చివరి నాటికి పూర్తి సామర్థ్యంతో ప్రారంభం అవుతుందని అన్నారు. భారతదేశం ఆధునికంగా మారుతున్న కొద్దీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మెరుగుపడుతుందని అన్నారు. ఎస్‌ఐజీ రాబోయే సంవత్సరాల్లో ప్యాకేజింగ్‌లో ఫైబర్ కంటెంట్‌ను పెంచడానికి చర్యలు చేపడుతుందని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?