Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ విషయంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆ పరిమితి భారీగా పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'బల్క్ డిపాజిట్' నిర్వచనాన్ని ఒకే డిపాజిట్‌లో రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువకు సవరించింది. ప్రస్తుతం ఇది రూ. 2 కోట్లు అంతకంటే ఎక్కువ ఉన్న బ్యాంక్ ఎఫ్‌డీలను బల్క్ ఎఫ్‌డీలుగా పరిగణిస్తున్నారు. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ నిర్ణయం సీనియర్ సిటిజన్లకు చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్థిర ఆదాయాన్ని ఇచ్చే పథకంగా ప్రజాదరణ పొందింది. పెట్టుబడికి భద్రతతో పాటు రాబడికి హామీనిచ్చే పథకంగా నిలిచిన ఫిక్సడ్ డిపాజిట్లపై ఆర్‌బీఐ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘బల్క్ డిపాజిట్’ నిర్వచనాన్ని ఒకే డిపాజిట్‌లో రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువకు సవరించింది. ప్రస్తుతం ఇది రూ. 2 కోట్లు అంతకంటే ఎక్కువ ఉన్న బ్యాంక్ ఎఫ్‌డీలను బల్క్ ఎఫ్‌డీలుగా పరిగణిస్తున్నారు. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ నిర్ణయం సీనియర్ సిటిజన్లకు చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా అధిక మొత్తంలో లిక్విడిటీ అందుబాటులో ఉన్న హెచ్‌ఎన్‌ఐలపై దృష్టి సారించడానికి ఇది బ్యాంకులను అనుమతిస్తుంది. ముఖ్యంగా వారికి సమర్థవంతంగా సేవలను అందించడానికి వీలు కల్పిస్తుంది. బల్క్ డిపాజిట్ పరిమితిని సమీక్షించినప్పుడు ఎస్‌సీబీలు, ఎస్ఎఫ్‌ల కోసం బల్క్ డిపాజిట్ల నిర్వచనాన్ని ‘రూ. 3 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ రూ. టర్మ్ డిపాజిట్’గా సవరించాలని ప్రతిపాదించారు. స్థానిక ప్రాంత బ్యాంకులకు బల్క్ డిపాజిట్ పరిమితిని ‘రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ ఉన్న ఒకే రూపాయి టర్మ్ డిపాజిట్లు’గా నిర్వచించాలని కూడా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఆర్ఆర్‌బీల విషయంలో వర్తిస్తుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్‌సీబీలు అనగా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్‌బీ మొదలైన షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులను అర్థం. ఆర్ఆర్‌బీలు అనగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు నిలుస్తాయి.
సాధారణ డిపాజిట్లతో పోలిస్తే బల్క్ డిపాజిట్లపై బ్యాంకులు తరచుగా అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి.ఇఫ్పుడు పరిమితి పెరగడంతో బ్యాంకులు కొత్త పరిమితి చుట్టూ తమ వడ్డీ రేట్లతో పాటు డిపాజిట్ల నిబంధనలను సర్దుబాటు చేయవచ్చు. ఇది ఎఫ్‌డీ డిపాజిట్ హోల్డర్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఆర్‌బీఐ తాజా ‘బల్క్ డిపాజిట్’ నిర్ణయం తర్వాత రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బ్యాంకుల్లో ఒకేసారి డిపాజిట్ చేసే వారికి రూ.3 కోట్లకు పైగా డిపాజిట్ చేసిన వారితో పోలిస్తే ఇప్పుడు తక్కువ వడ్డీ రేట్లు లభిస్తాయి. అలాగే బ్యాంకుల లిక్విడిటీ నిర్వహణకు బల్క్ డిపాజిట్లు ముఖ్యమైనవి. ఈ మార్పు బ్యాంకులు పెద్ద డిపాజిట్లను ఎలా నిర్వహిస్తుందో? అలాగే వాటి లిక్విడిటీ ప్రొఫైల్‌లను ఎలా నిర్వహించాలో? వంటి విషయాలను ప్రభావితం చేయవచ్చు.
గరిష్ట పరిమితి పెంచడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద పెట్టుబడులను ప్రోత్సహించడం ఆర్‌బీఐ లక్ష్యంగా కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసే వారిని ఆకర్షించడంలో బ్యాంకుల మధ్య పోటీ డైనమిక్‌లను కూడా ప్రభావితం చేయవచ్చు. బ్యాంకులు తమ డిపాజిట్ పథకాలు, వడ్డీ రేట్లను సవరించాల్సి రావచ్చు. బల్క్ డిపాజిట్లను ఆకర్షించడానికి వారు తమ వ్యూహాలను కూడా సర్దుబాటు చేస్తారని అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..