Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bal Jeevan: రోజుకు రూ. 18 ఆదా చేస్తే రూ. 3 లక్షలు పొందొచ్చు.. చిన్నారుల కోసం ప్రత్యేకంగా

ఇండియన్‌ పోస్టాఫీస్‌ అందిస్తోన్న ఈ పథకంలో రోజుకు రూ. 6 లేదా రూ. 18 చొప్పున పొదుపు చేసుకోవచ్చు. రోజుకు రూ. 6 చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మెచ్యూరిటీ సమయానికి రూ. లక్ష రాబడి పొందొచ్చు, అదే మీరు రోజు రూ. 18 చొప్పున పొదుపు చేస్తే రూ. 3 లక్షలను పొందొచ్చు. ఈ పథకం కేవలం చిన్నారుల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చారు...

Bal Jeevan: రోజుకు రూ. 18 ఆదా చేస్తే రూ. 3 లక్షలు పొందొచ్చు.. చిన్నారుల కోసం ప్రత్యేకంగా
Bal Jeevan Bima Yojana
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 08, 2024 | 4:39 PM

ప్రస్తుతం సంపాదనతో పాటు పొదుపై కూడా ఆసక్తి పెరిగింది. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. భవిష్యత్తులో పెరిగే ఖర్చులు, అవసరాల దృష్ట్యా సేవింగ్స్‌ అనివార్యమనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ నమ్ముతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఎన్నో రకాల సేవింగ్స్‌ స్కీమ్స్‌ను ప్రవేశపెడుతుండడంతో చాలా మంది వీటికి ఆకర్షితులవుతున్నారు. అయితే దాదాపు అన్ని రకాల సేవింగ్స్‌ స్కీమ్స్‌ పెద్దలకు సంబంధించినవే ఉంటాయి. కానీ ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ పథకానికి శ్రీకారం చుట్టింది. బాల్‌ జీన్‌ బీమా పథకంతో తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్‌ పోస్టాఫీస్‌ అందిస్తోన్న ఈ పథకంలో రోజుకు రూ. 6 లేదా రూ. 18 చొప్పున పొదుపు చేసుకోవచ్చు. రోజుకు రూ. 6 చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మెచ్యూరిటీ సమయానికి రూ. లక్ష రాబడి పొందొచ్చు, అదే మీరు రోజు రూ. 18 చొప్పున పొదుపు చేస్తే రూ. 3 లక్షలను పొందొచ్చు. ఈ పథకం కేవలం చిన్నారుల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇందులో చేరాలంటే 5 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. వీరి పేరెంట్స్‌ ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఇక తల్లిదండ్రుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీకు ఇద్దరు పిల్లలు ఉంటే రోజుకు రూ. 36 చొప్పున పొదుపు చేసుకుంటూ పోతే మెచ్యూరిటీ సమయానికి రూ. 6 లక్షల వరకు పొందొచ్చు. ఒకవేళ పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే.. ఆ టైమ్​లో ఇకపై పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిశాక పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తం చెల్లిస్తారు. పాలసీ ప్రీమియాన్ని పేరెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక పాలసీ నుంచి మధ్యలో వైదొగాలనుకుంటే ఐదేళ్ల తర్వాత సరెండర్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ పథకంలో పెట్టిన పెట్టుబడికి రూ. 1000 ప్రతి సంవత్సరం హామీ మొత్తం మీద రూ. 48 బోనస్ ఇస్తారు. ఈ పథకంలో చేరాలనుకునే వారు దగ్గరల్లోని పోస్టాఫీస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..