AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: వందే‌భారత్‌లో కీలక మార్పులు.. రైల్వే ప్రయాణీకులు ఇది గమనించాల్సిందే..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ల వేగం తగ్గిపోయింది. తొలినాళ్లలో గంటకు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసిన ఈ రైళ్లు ప్రస్తుతం సగటున 76.25 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ఈమేరకు ఓ ఆర్టీఐ కార్యకర్త చేసిన దరఖాస్తుకు.. ఇలా వివరాలు..

Vande Bharat: వందే‌భారత్‌లో కీలక మార్పులు.. రైల్వే ప్రయాణీకులు ఇది గమనించాల్సిందే..
Vande Bharat Express
Ravi Kiran
|

Updated on: Jun 08, 2024 | 6:03 PM

Share

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ల వేగం తగ్గిపోయింది. తొలినాళ్లలో గంటకు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసిన ఈ రైళ్లు ప్రస్తుతం సగటున 76.25 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ఈమేరకు ఓ ఆర్టీఐ కార్యకర్త చేసిన దరఖాస్తుకు ఇచ్చిన జవాబులో రైల్వే శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్‌లో గంటకు 99 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. తొలినాళ్లలో వందేభారత్ రైళ్లు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీశాయని రైల్వే అధికారులు తెలిపారు. ఆ తర్వాతి కాలంలో దేశ భౌగోళిక పరిస్థితులు, వాతావరణ కారణాల వల్ల కొన్ని రూట్లలో నడిచే వందేభారత్ రైళ్ల వేగాన్ని తగ్గించినట్లు చెప్పారు.

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

2022-23 నాటికి ఈ రైళ్ల వేగం గంటకు సగటున 81.38 కిలోమీటర్లకు తగ్గించినట్లు వివరించారు. వర్షాకాలంలో సగటున 75 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడం సవాలుతో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. వాస్తవానికి వందేభారత్ రైళ్లకు గరిష్ఠంగా గంటకు 160 కి.మీ. వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉందని చెప్పారు. అయితే, ఆ వేగానికి మన దేశంలోని రైల్వే ట్రాక్‌లు సరిపడవని, వాటి సామర్థ్యం అంతలేదని వివరించారు. కేవలం ఢిల్లీ, ఆగ్రా మధ్య ఉన్న కొన్ని ట్రాక్‌లపైనే ఈ వేగాన్ని అందుకోవడం సాధ్యమని రైల్వే అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఓ మై గాడ్.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంట్రా.. కింగ్ కోబ్రా ముందు కుప్పిగంతులా..

ప్రస్తుతం కూడా కొన్ని రైళ్లు గరిష్ఠంగా గంటకు 160 కి.మీ. వేగంతో పరుగులు పెడుతున్నాయని వివరించారు. మరికొన్ని ట్రాక్ లపై గరిష్ఠ వేగం చాలా తక్కువన్నారు. ఉదాహరణకు డెహ్రడూన్ – ఆనంద్ విహార్ ట్రాక్‌పై రైళ్ల వేగం సగటున 63.42 కిలోమీటర్లు, పాట్నా – రాంచీ ట్రాక్‌పై 62.9 కి.మీ.. కోయంబత్తూర్ – బెంగళూర్ ట్రాక్‌పై గంటకు 58.11 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రైళ్లు నడుస్తాయని అధికారులు వివరించారు.

ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే