Viral Video: ఓ మై గాడ్.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంట్రా.. కింగ్ కోబ్రా ముందు కుప్పిగంతులా..
సాధారణంగా పాములు పేరు వింటేనే గుండె జల్లుమంటుంది. అట్లాంటిది అది దగ్గరకు వస్తే.. ఇంకేముంది భయంతో పరుగులు పెట్టాల్సింది. పాములు చాలా విషపూరితమైనవి. అవి కాటేస్తే.. క్షణాల్లో కాటికి వెళ్లాల్సిందే. అందుకే చాలామంది పాములకు ఆమడదూరంలో ఉంటారు. అయితే ఇక్కడొక యువకుడు..
సాధారణంగా పాములు పేరు వింటేనే గుండె జల్లుమంటుంది. అట్లాంటిది అది దగ్గరకు వస్తే.. ఇంకేముంది భయంతో పరుగులు పెట్టాల్సింది. పాములు చాలా విషపూరితమైనవి. అవి కాటేస్తే.. క్షణాల్లో కాటికి వెళ్లాల్సిందే. అందుకే చాలామంది పాములకు ఆమడదూరంలో ఉంటారు. అయితే ఇక్కడొక యువకుడు పాము జోలికి వెళ్లాడు. అది అట్టాంటి.. ఇట్టాంటి పాము కాదండీ.. భారీ సైజు కింగ్ కోబ్రా.. దాని ముందు హీరోయిజం చూపించాలని అనుకున్నాడు. కానీ తీరా చూస్తే అది కాస్తా బెడిసికొట్టింది. దెబ్బకు ఆ పాము ముందే నాగిని డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..
ఈ వీడియోను ‘anan_10k’ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఇంటర్నెట్‌లో షేర్ చేసింది. మీరు వీడియోను పరిశీలనగా చూస్తే.. రోడ్డుపై తిష్ట వేసిన ఓ భారీ నాగుపాము కారణంగా ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. ఇక ఆ భారీ నాగుపామును పక్కకు తీసేందుకు ఓ వ్యక్తి కర్ర పట్టుకుని అక్కడికి వచ్చాడు. ఆ కింగ్ కోబ్రా ముందు పెద్ద హీరోలా పోజులుకొట్టాడు. పామును బెదిరించాడు. దాని తోక పట్టుకుని పైకి లేపుతూ.. కర్రతో కంట్రోల్ చేసేందుకు ట్రై చేశాడు.
కింగ్ కోబ్రా ముందు కుప్పిగంతులా.. అది దెబ్బకు ఆ వ్యక్తి కాలిపై ఒకట్రెండు సార్లు కాట్లు వేసింది. కాగా, ఈ ఘటనలో చివరికి ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆ వ్యక్తి మాత్రం పాము కాటుకు గురయ్యాడు. ఇక ఈ వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కింగ్ కోబ్రాతో ఆటలాడితే.. ఇట్లానే ఉంటుంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే
View this post on Instagram
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి