Telangana: సీన్ రివర్స్.. ఆ షాపుల వద్దకు మందుబాబులు రావడం లేదట.. ఎందుకో తెలుసా..?

తెలంగాణ సరిహద్దుల్లోని మద్యం దుకాణాలన్నీ అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. ఫలితంగా సరిహద్దుల్లోని ఆరు జిల్లాల మద్యం షాపుల్లో విక్రయాలు పడిపోయాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాండెడ్ మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో తెలంగాణ జిల్లాల్లో సేల్స్ తగ్గుముఖం పట్టాయి. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండిపడుతోంది.

Telangana: సీన్ రివర్స్.. ఆ షాపుల వద్దకు మందుబాబులు రావడం లేదట.. ఎందుకో తెలుసా..?
Wines
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Dec 29, 2024 | 11:46 AM

ఆ దుకాణాలు వినియోగదారులతో నిత్యం కిటకిటలాడుతూ ఉండేవి. రద్దీని తట్టుకోలేక, ఉన్న స్టాక్‌ అందరికీ సర్దాలన్న లక్ష్యంతో రేషన్‌కార్డులు తేవాలన్న నిబంధన కూడా అమలు చేశారు. ఒక్క కార్డుపై ఒక్కటి మాత్రమే ఇచ్చేవారు. ఆదివారం, సెలవు రోజుల్లో అయితే రద్దీని నియంత్రించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేవారు. కానీ, ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది.. ఇప్పుడు ఆ దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదట. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. !

తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లోని మద్యం దుకాణాలకు ఒకప్పుడు భారీ డిమాండ్ ఉండేది. ఉమ్మడి నల్లగొండ ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లోని మద్యం దుకాణాల కోసం ఎంతైనా వెచ్చించేవారు. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం ప్రియులు నాణ్యమైన మద్యం కోసం మందుబాబులు నానా ఇబ్బందులు పడ్డారు. అక్కడ బ్రాండెడ్‌ మద్యం అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ వైపు వచ్చేవారు. దీంతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దు మండలాల్లోని మద్యం దుకాణాల్లో విక్రయాలు ఎక్కువగా జరిగేవి.

తెలంగాణ సరిహద్దు వైన్స్‌ షాపుల్లో మందుబాబుల రద్దీని తట్టుకునేందుకు రేషన్ కార్డు నిబంధనతోపాటు ఆదివారం సెలవు దినాల్లో అయితే పోలీస్ పహారా మధ్య మద్యం విక్రయాలు జరిగేవి. గతంలో రాష్ట్రంలో ఎక్కువ మద్యం విక్రయాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో జరిగేవి. అంతకంటే ఎక్కువగా సరిహద్దు దుకాణాల్లో ఎక్కువగా మద్యం విక్రయాలు కొనసాగాయి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది. దీంతో ఏపీలో అన్ని రకాల మద్యం బ్రాండ్లను మందుబాబులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో ఏపీ మందు బాబులు తెలంగాణ మద్యం షాపుల వైపు కన్నెత్తి చూడడం లేదు.

తెలంగాణ సరిహద్దుల్లోని మద్యం దుకాణాలన్నీ వెలవెలబోతున్నాయి. ఫలితంగా సరిహద్దుల్లోని ఆరు జిల్లాల మద్యం షాపుల్లో విక్రయాలు పడిపోయాయి. సరిహద్దుల్లోని మద్యం షాపులు ఇప్పుడు మందు బాబుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆయా దుకాణాల్లో విక్రయాలు పెంచుకునేందుకు తెలంగాణ ఎక్సైజ్‌శాఖ చెమటోడ్చాల్సి వస్తోంది. మూడు ఉమ్మడి సరిహద్దు జిల్లాల్లోని మద్యం దుకాణాల్లో మందుబాబులు రాకపోవడంతో డిసెంబర్ నెలలో 40 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. దసరా, నూతన సంవత్సరం వేడుకల సమయంలోనే ఆబ్కారీ శాఖకు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈసారి సరిహద్దుల్లో కొత్త సంవత్సర ఆదాయం కూడా గణనీయంగా తగ్గనుందని భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి సరిహద్దు జిల్లాల్లో రూ.300 కోట్ల ఆదాయం తగ్గే అవకాశాలున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రియురాలికి వజ్రాల కళ్లజోడు బుక్ చేసి.. అడ్డంగా బుక్కయ్యాడు
ప్రియురాలికి వజ్రాల కళ్లజోడు బుక్ చేసి.. అడ్డంగా బుక్కయ్యాడు
వాట్సాప్‌లో టైప్ చేయకుండా మెసేజ్‌లు పంపే ట్రిక్ మీకు తెలుసా?
వాట్సాప్‌లో టైప్ చేయకుండా మెసేజ్‌లు పంపే ట్రిక్ మీకు తెలుసా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు 'కన్నప్ప'లో క్రేజీ హీరోయిన్..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు 'కన్నప్ప'లో క్రేజీ హీరోయిన్..
వార్నీ ఇదెక్కడి విడ్డూరం..నవ వధువును అమ్మకానికి తీసుకెళ్లిన వరుడు
వార్నీ ఇదెక్కడి విడ్డూరం..నవ వధువును అమ్మకానికి తీసుకెళ్లిన వరుడు
ఆర్బీఐ షాకింగ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ఈ బ్యాంకు ఖాతాలు క్లోజ్‌!
ఆర్బీఐ షాకింగ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ఈ బ్యాంకు ఖాతాలు క్లోజ్‌!
ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..
ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..
ఎయిడ్స్ రోగులకు శుభవార్త.. ఇక దిగులుపడాల్సిన అవసరం లేదు..
ఎయిడ్స్ రోగులకు శుభవార్త.. ఇక దిగులుపడాల్సిన అవసరం లేదు..
ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!
ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!
'అలా చేసి మళ్లీ నా మనసును గాయపర్చొద్దు'.. అభిమానులకు యశ్ విన్నపం
'అలా చేసి మళ్లీ నా మనసును గాయపర్చొద్దు'.. అభిమానులకు యశ్ విన్నపం
రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టటం లేదా? పడుకునే ముందు ఈ జ్యూస్ తప్పని
రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టటం లేదా? పడుకునే ముందు ఈ జ్యూస్ తప్పని
ప్రియురాలికి వజ్రాల కళ్లజోడు బుక్ చేసి.. అడ్డంగా బుక్కయ్యాడు
ప్రియురాలికి వజ్రాల కళ్లజోడు బుక్ చేసి.. అడ్డంగా బుక్కయ్యాడు
ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..
ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..
ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!
ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. ఇలా ఇరుక్కుపోయారు
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. ఇలా ఇరుక్కుపోయారు
బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..
బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త
సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి
సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి
న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?
న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?
ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో
ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో