Yadadri Temple: ఉండమన్న చోట ఉండవ్ కదరా.. చూడు ఏమైందో
చిన్న పిల్లలు ఒక్కచోట కుదురుగా ఉండరు.. వాళ్లు చేసే అల్లరికి అంతు అంటూ ఉండదు. ఎప్పుడు ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. అందుకే పెద్దవాళ్లు వాళ్లను ఎప్పుడు ఓ కంట కనిపెడుతుండాలి.. లేకపోతే ఒక్కోసారి ప్రాణాలమీదకు వస్తది. తాజాగా అలాంటి ఘటనే యాదాద్రి టెంపుల్‌లో జరిగింది. క్యూలైన్ గ్రిల్‌లో బాలుడి తల ఇరుక్కుపోయింది..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వచ్చిన కుటుంబం.. క్యూలైన్‌లో ఉన్నప్పుడు చిన్నపిల్లాడు ఆడుతూ తల పెట్టేసరికి అది గ్రిల్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే పిల్లాడు ఏడుపు మొదలుపెట్టాడు. ఇది చూసి పేరెంట్స్ కూడా కంగారు పడ్డారు.వెంటనే తోటి భక్తులతో కలిసి పిల్లాడి తల బయటకు తీసేందుకు నానా తంటాలు పడ్డారు. కాసేపటి తర్వాత మొత్తానికి పిల్లాడి తలను ఆ గ్రిల్ నుంచి బయటకు తీయగలిగారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందుకే అనేది పెద్దలు.. పిల్లల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి అని.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos