భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..

Anil kumar poka

|

Updated on: Dec 31, 2024 | 3:41 PM

అరేబియా సముద్రంలో ఓ నౌక మునిగి పోగా.. అందులోని తొమ్మిది మంది భారతీయ సిబ్బందిని కోస్ట్‌గార్డ్‌ సురక్షితంగా కాపాడింది. పాకిస్థాన్‌ సహకారంతో రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని ముంద్రా నుంచి యెమెన్‌లోని సొకొత్రా ద్వీపానికి ఓ నౌక బయల్దేరింది.

మార్గమధ్యంలో పశ్చిమ అరేబియా సముద్రంలో భీకర అలల తాకిడికి నౌక ప్రమాదానికి గురైంది. గుజరాత్‌లోని పోరుబందర్‌కు సుమారు 311 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమను కాపాడాలంటూ అందులోని తొమ్మిది మంది సిబ్బంది అత్యవసర సందేశం పంపారు. రోజువారీ నిఘా కార్యకలాపాల్లో భాగంగా చక్కర్లు కొడుతున్న ‘ఐసీజీ డోర్నియర్’ దీన్ని గుర్తించి.. గాంధీనగర్‌లోని ఐసీజీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం, ముంబయిలోని ‘ఎంఆర్‌సీసీ’లను అప్రమత్తం చేసింది.

ఈ క్రమంలోనే ఘటనాస్థలానికి సమీపంలో పెట్రోలింగ్‌లో ఉన్న ఐసీజీ నౌక ‘శూర్‌’ వెంటనే రంగంలోకి దిగి.. విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఆ సిబ్బందిని సురక్షితంగా కాపాడింది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌ అధికారులతో సమన్వయం చేసుకున్నట్లు కోస్ట్‌గార్డ్‌ తెలిపింది. సిబ్బందికి వైద్య సాయం అందించామని, వారిని పోరుబందర్‌కు తరలిస్తున్నట్లు పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.